iDreamPost

ఇన్ స్టా రీల్స్ పిచ్చి.. కాలువ ఒడ్డుకు వెళ్లి వీడియోలు తీస్తుండగా..

షాట్స్, రీల్స్ పిచ్చిలో పడి కొంత మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రైలు ట్రాకులపైన, రోడ్డు మీద, ప్రమాదపు అంచుల వద్ద నిల్చొని వీడియోలు తీసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు ఉన్నాయి. తాజాగా

షాట్స్, రీల్స్ పిచ్చిలో పడి కొంత మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రైలు ట్రాకులపైన, రోడ్డు మీద, ప్రమాదపు అంచుల వద్ద నిల్చొని వీడియోలు తీసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు ఉన్నాయి. తాజాగా

ఇన్ స్టా రీల్స్ పిచ్చి.. కాలువ ఒడ్డుకు వెళ్లి వీడియోలు తీస్తుండగా..

ఇప్పుడంతా సోషల్ మీడియా కాలం. తిండి లేకుండా అయినా బతుకుతున్నారు కానీ సోషల్ మీడియాను చూడకుండా గంట కూడా ఉండలేరు. అంతలా ఈ మాయ ప్రపంచానికి ఎడిక్ట్ అయిపోయారు ప్రజలు. పిల్లా జెల్లా అందరూ దీని మాయలో పడిపోయిన వాళ్లే. ఒకసారి తల ఫోనులో పెట్టేశారు అంటే.. చుట్టు ప్రక్కల ఉన్నవాళ్లంతా ఏమైపోతున్నారో కూడా తెలియడం లేదు. ఇది ఓ కోణం. మరో కోణం ఏంటంటే.. సోషల్ మీడియాలో ఫేమ్ అయ్యేందుకు రీల్స్, షాట్స్ అంటూ వీడియోలు చేస్తున్నారు కొందరు. ఓవర్ నైట్ స్టార్ అయిపోయేందుకు రీల్స్ పిచ్చిలో పడి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. రైలు ట్రాకులపైన, రోడ్డు మీద, ప్రమాదపు అంచుల వద్ద నిల్చొని వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఓ యువతి రీల్స్ పిచ్చిలో పడి.. కుటుంబానికి తీరని దుఖాన్ని మిగిల్చింది.

రీల్స్ చేసేందుకు సిస్టర్స్, స్నేహితులతో కలిసి వెళ్లిన యువతి .. ఓ కెనాల్లో ప్రమాదవ శాత్తూ కాలు జారి పడి గల్లంతయ్యింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వికాస్ నగర్‌కు చెందిన షకీల్ కుమార్తెలు మనీషా ఖాన్, నిషా ఖాన్ సోషల్ మీడియాలో రీల్స్ చేయడం అంటే భలే సరదా. మనీషాకు రీల్స్ చేస్తే సోదరి వీడియోలు తీస్తూ ఉంటుంది. కొత్త సినిమాల్లోని పాటలకు కాలు కుదుపుతూ.. ఆ వీడియోలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేస్తూ ఉంటుంది. ఆదివారం సాయంత్రం, తన స్నేహితులు, సిస్టర్స్‌ నిషా, నగ్మా, ఓంకార్, రూపాలీతో కలిసి మున్షీ పుల్లియా నుండి ఆటోలో తన ఇంటికి సమీపంలో ఉన్న ఇందిరా కెనాల్ వద్దకు వెళ్లింది. రీల్స్ చేస్తుండగా.. ఒక్కసారిగా కాలు జారి కెనాల్లో పడిపోయింది.

అప్పటి వరకు ఆమె వీడియోలను తీస్తున్న ఫ్రెండ్స్ ఒక్కసారిగా కాపాడండి అంటూ కేకలు వేశారు. వీరి కేకలు విన్న స్థానికులు ఏమైందని పరుగెత్తుకుంటూ వెళ్లినప్పటికీ.. మనీషా అప్పటికే కాలువలో పడి కొట్టుకుపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఈతగాళ్లను రంగంలోకి దింపినా ఆమె ఆచూకీ కానరాలేదు. సోమవారం కూడా ఆమె కోసం కాలువ అంతా జల్లెడ పట్టారు. కానీ కనిపించలేదు. కాగా, తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మనీషా రీల్స్ చేస్తుండగా.. వీడియో చిత్రీకరిస్తోంది నిషా. ఆమె కాలువలో పడిపోయిన దృశ్యాలు నిషా మొబైల్లో రికార్డు అయ్యాయి. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రంగంలోకి దిగారు… గాలింపు చర్యలు చేపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి