iDreamPost

ప్రియురాలి కోసం హత్య.. జైల్లో దర్శన్! అసలు ఎవరీ పవిత్రా గౌడ? ఫుల్ లవ్ స్టోరీ!

ప్రియురాల్ని వేధిస్తున్నాడన్నాడని రేణుక స్వామి అనే వ్యక్తిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు శాండిల్ వుడ్ సూపర్ స్టార్ దర్శన్. ఈ ఛాలెంజింగ్ స్టార్ మోజుపడ్డ ప్రియురాలు పవిత్ర గౌడ ఎవరు

ప్రియురాల్ని వేధిస్తున్నాడన్నాడని రేణుక స్వామి అనే వ్యక్తిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు శాండిల్ వుడ్ సూపర్ స్టార్ దర్శన్. ఈ ఛాలెంజింగ్ స్టార్ మోజుపడ్డ ప్రియురాలు పవిత్ర గౌడ ఎవరు

ప్రియురాలి కోసం హత్య..  జైల్లో దర్శన్! అసలు ఎవరీ పవిత్రా గౌడ? ఫుల్ లవ్ స్టోరీ!

కన్నడ టాప్ హీరో, చాలెంజింగ్ స్టార్ దర్శన్ ఓ హత్య కేసులో అరెస్టు అయ్యాడు. దర్శన్‌తో పాటు ఆయన ప్రేయసి, నటి పవిత్ర గౌడను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ కన్నడ చిత్ర పరిశ్రమనే కాకుండా యావత్ దక్షిణాది ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురి చేసింది. దర్శన్ కన్నడ హీరో అయినప్పటికీ, ఆయన సినిమాలు ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ అవుతుంటాయి. గత ఏడాది కాటేరా మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరో.. ప్రియురాలి మోజులో పడి.. తన జీవితాన్ని తన చేతులతోనే అథో పాతాళానికి తొక్కుకున్నాడు. ప్రియురాలు పవిత్ర గౌడతో రిలేషన్ షిప్ అతడ్ని ఈ దశకు చేర్చింది. ఇంతకు పవిత్ర గౌడ ఎవరు.. ఆమె అతడితో పరిచయం ఎలా ఏర్పడింది. ఎందుకు రేణుక స్వామి అనే వ్యక్తిని హత్య చేయాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే. .

దర్శన్.. కన్నడ హీరోగా మాత్రమే తెలుసు.. కానీ ప్రతి కన్నడిగకు అతడొక సూపర్ స్టార్. ఇండస్ట్రీలో కింద స్థాయి (అసిస్టెంట్ కెమెరామాన్) నుండి హీరోగా, సూపర్ స్టార్‌గా మారాడు. డౌన్ టు ఎర్త్ తెలిసిన మనిషి. 2003లో విజయలక్ష్మీ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికో బాబు వినీష్. స్టార్ డమ్ ఎంత చూశాడో.. వివాదాల్లో కూడా అలానే చిక్కుకున్నాడు. గతంలో తెలుగు హీరోయిన్ నిఖితతో ప్రేమాయణం సాగించాడన్న పుకార్లు.. షికార్లు చేశాయి. విజయలక్ష్మి వార్నింగ్ ఇవ్వడంతోనే నిఖిత కనిపించకుండా పోయిందని అనుకున్నారు. 2011లో దర్శన్ గృహ హింసకు పాల్పడ్డారని ఆరోపిస్తూ భార్య పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అప్పుడు కూడా అరెస్టు అయ్యాడు. 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీలో ఉ న్నాడు. అయితే మళ్లీ కాంప్రమైజ్ అయ్యి బతికేస్తున్నారు. ఓసారి మైసూర్ హోటల్లో వెయిటర్ పై చేయి చేసుకోగా.. రూ. 50 వేలు ఇచ్చి ఈ గొడవను సెటిల్ చేశారని అంటుంటారు.

Actress Pavitra Goud arrested 01

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరిలో సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు దర్శన్. నటి పవిత్రా గౌడ్.. తమ రిలేషన్ పూర్తయ్యి దశాబ్ద కాలం పూర్తయ్యిందంటూ సోషల్ మీడియా ఓ వీడియో పోస్టు చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచాడు దర్శన్. ఆమెతో రిలేషన్ కారణంగానే.. దర్శన్, విజయలక్ష్మీ బంధం బీటలు వారినట్లు తెలుస్తోంది. పవిత్ర గౌడ.. 2013లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమెకు గతంలో సంజయ్ అనే వ్యక్తిని మనువాడింది. వీరికి ఖుషి అనే కూతురు కూడా ఉంది. అయితే కొన్ని కారణాలతో భర్తకు విడాకులిచ్చిన పవిత్ర.. ఓ సమయంలో దర్శన్‌తో ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారి.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ అక్రమ సంబంధం గురించి విజయలక్ష్మీకి తెలిసి తరచూ దర్శన్.. ఆమెకు గొడవలు కూడా అయ్యాయని తెలుస్తోంది. పుండు మీద కారం చల్లినట్లు.. 2017లో ట్విట్టర్, పేస్ బుక్ ఫ్రొఫైల్ ఫోటోలో దర్శన్‌తో దిగిన ఫోటోలను పెట్టింది పవిత్ర గౌడ. అభిమానులు చుక్కలు చూపించడంతో వాటిని తొలగించింది.

అయితే ఇటీవల పవిత్ర గౌడ.. తన కూతురు పుట్టిన రోజు వేడుకల సమయంలో దర్శన్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసి మళ్లీ చిచ్చు రేపింది. ఏకంగా ఈ ఏడాది జనవరిలో బాంబే పేల్చింది. తామిద్దరం పదేళ్ల నుండి రిలేషన్ షిప్‌లో ఉన్నామని, దర్శన్ భార్య విజయలక్ష్మికీ తమ రిలేషన్ గురించి అంతా తెలుసునంటూ చెప్పుకొచ్చింది. అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. కానీ అంతలో వీరి జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు రేణుక స్వామి. రేణుక స్వామి దర్శన్‌కు వీరాభిమాని. తమ ఫేవరేట్ హీరో భార్యకు అన్యాయం చేయడం సరికాదంటూ బహిరంగ వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా పవిత్ర వైఖరిని తప్పుపట్టేవాడు. అయితే అనూహ్యంగా అతడు శనివారం కామాక్షి పాళ్యలోని ఓ అపార్ట్ మెంట్ సమీపంలోని డ్రైనేజీలో మృతదేహం లభించింది. పవిత్ర గౌడకు సోషల్ మీడియా ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపుతుండటంతోనే తట్టుకోలేక దర్శన్.. అతడ్ని హత్య చేసి డ్రైనేజీలో పడేశాడని ఆరోపణల నేపథ్యంలో దర్శన్, అతడి ప్రియురాలు పవిత్రతో పాటు తొమ్మిది మందిని అరెస్టు చేశారు కర్ణాటక పోలీసులు. ఓ స్టార్ హీరో.. ప్రియురాలి మోజులో పడి వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి జీవితంపై కూడా దెబ్బ వేసుకుంటున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి