iDreamPost

నారావారిపల్లె – ఏది నిజం,ఏది అబద్ధం

నారావారిపల్లె – ఏది నిజం,ఏది అబద్ధం

రెండ్రోజుల క్రితం నారావారిపల్లెలో రాజధాని వికేంద్రీకరణ , రాయలసీమ అభివృద్ధి పై వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వచ్చిన జనం గురించి , సభ జయాపజయాలు గురించి మీడియాలో భిన్న కోణాలతో కధనాలు వెలువడ్డాయి .

సాక్షి , మరి కొన్ని పత్రికలు 25 వేల మంది జనాభాకు పైగా వచ్చారని , సభ విజయవంతమయ్యింది అని సభకు హాజరైన జనంతో కూడిన ఫోటోలతో ప్రచురించగా , ఆంధ్రజ్యోతి మాత్రం సభకు జనం రాలేదని , సభ విఫలం అయ్యిందనీ ఖాళీ కుర్చీల ఫోటోలు సాక్ష్యంగా వార్త ప్రచురించింది .

వెంటనే స్పందించిన వైసీపీ శ్రేణులు , సభకు హాజరైన జనంతో కూడిన మరిన్ని ఫోటోలు , వీడియోలు , వేదిక పై ఉపన్యసించిన వారి వీడియోలు బయట పెట్టి , ఆంధ్రజ్యోతి పత్రిక సభ ప్రారంభానికి ముందు , సభ ముగిసిన తర్వాత ఖాళీ కుర్చీల ఫొటోలు , సభపై ప్రశ్నగించేవారి ఫొటోలు పక్కపక్కనే ప్రచురించి మోసపూరితంగా సభ విఫలం అయ్యిందని ప్రచారం చేయటానికి ప్రయత్నించిందని సాక్ష్యాధారాలతో సహా ప్రెసెంట్ చేశారు .

ఇదిలా ఉండగా బహిరంగ సభలు నిర్వహించడంలో అనుభవజ్ఞులు , కొందరు సీనియర్ నాయకులు మాత్రం 20 నుండి 22 వేల మంది జనాభా వరకూ సభకు హాజరయ్యి ఉంటారని , నిర్వహించిన తీరు , రాజకీయ ప్రసంగాలకు పరిమితం కాకుండా , సీనియర్ అధికారులతో వికేంద్రీకరణ , సీమ అభివృద్ధి లాంటి అంశాల పై ప్రసంగింప చేయడం , దానికి ప్రజల ప్రతి స్పందన చూస్తే సభ విజయవంతం అయినట్టే అని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి .

వీటిలో ఏది నిజం?ఆంధ్రజ్యోతి వార్తను నమ్ముదామంటే జనసందోహంతో కూడిన ఫొటోలు వీడియోస్ సాక్ష్యంగా అది అబద్ధం అని కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది . రాధాకృష్ణ పదే పదే చెప్పే దమ్మున్న ఛానెల్ ఎందుకిలాంటి అబద్దాలు ప్రసారం చేస్తోంది . అబద్దాలు చెప్పటానికేనా మీ దమ్ము ఉపయోగపడేది .అసత్య కధనాలు వండి వార్చడానికేనా మీ కలం సిరా కక్కేది . ఈ భూమండలంలో ఓ కార్యాన్ని భుజానికెత్తుకొన్న ఎవరికైనా అలుపు వస్తుందేమో కానీ , బాబు గారిని , టీడీపీని భుజానికెత్తుకొని దాని కోసం ఎం రాయాటానికైనా వెనుకాడని ఆంధ్రజ్యోతికి ఎందుకు అలుపు రావట్లేదు.

కొసమెరుపు ఏంటంటే సభ కవరేజ్ కెళ్లిన ABN ప్రతినిధులకు ఆరు భోజనం ప్యాకెట్లు , ఈనాడు సిబ్బందికి ఐదు భోజనం ప్యాకెట్లు ఇచ్చిన సభ నిర్వాహకులు , సాక్షి ప్రతినిధులకు మాత్రం మూడు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి ఇహ అయిపోయాయి అని సర్దుకోమంటే వారు దగ్గర్లోని మరో ఊరు వెళ్లి హోటల్ లో భోజనం చేయటం . ఇది విడ్డూరంగా లేదూ , అన్నం పెట్టి తన్నించుకొన్నట్టు లేదూ .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి