iDreamPost

2023లో పఠాన్ రికార్డులను బ్రేక్ చేసే ఏకైక మూవీ ఏదో తెలుసా..?

  • Author ajaykrishna Published - 12:00 PM, Thu - 6 July 23
  • Author ajaykrishna Published - 12:00 PM, Thu - 6 July 23
2023లో పఠాన్ రికార్డులను బ్రేక్ చేసే ఏకైక మూవీ ఏదో తెలుసా..?

ఈ ఏడాది ఫస్టాఫ్ లో బాలీవుడ్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ పరంగా మీడియం రేంజ్ ఫలితాలు చూసింది. బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మినహా.. మిగతా ఏ సినిమాలు కూడా ఆ స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. ఆ రేంజ్ కలెక్షన్స్ కూడా టచ్ చేయలేకపోయాయి. దీంతో గతేడాది RRR, కేజీఎఫ్ 2 మూవీస్ బాక్సాఫీస్ వద్ద రూ. 1200 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి రికార్డులు సెట్ చేశాయి. ఈ ఏడాది ఆరంభంలోనే పఠాన్.. రూ. 1000 కోట్లకు పైగా రాబట్టి రచ్చలేపింది. దీంతో ఈ ఏడాది పఠాన్ కి సవాల్ విసిరే మూవీ ఏది అవుతుందా? అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ టీజర్ వచ్చింది.

సలార్ టీజర్ వచ్చిందో లేదో.. వరల్డ్ వైడ్ మూవీ లవర్స్, ఫ్యాన్స్ అందరికీ మూవీపై అంచనాలు పీక్స్ లోకి చేరుకున్నాయి. ఇంకేముంది.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మార్క్ షాట్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, భువన్ గౌడ కెమెరా వర్క్, ఓ క్రేజీ డైలాగ్ తో సలార్ మాస్ ఎలివేషన్స్.. ప్రభాస్ కటౌట్.. ఇంకా పార్ట్ 1 అని టీజర్ లో డీటెయిలింగ్ గా క్లారిటీ ఇచ్చారు. కట్ చేస్తే.. సెప్టెంబర్ 28న సలార్ సినిమా ఆగమనం.. రెస్ట్ ఆఫ్ ఇండియన్ సినిమా రికార్డులన్నీ కనిపించకుండా పోతాయని అంచనాలు ఏర్పడ్డాయి. అదీగాక.. ఈ ఏడాది విన్నర్ గా ఉన్న పఠాన్ సినిమాకి బాక్సాఫీస్ వద్ద సరైన సవాల్ విసిరే సినిమా సలార్ ఒకటే అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

పఠాన్ బాలీవుడ్ మూవీ అయినా ఇండియా వైడ్ ప్రభంజనం సృష్టించింది. షారుఖ్ స్టామినా ప్రూవ్ చేస్తూ.. రూ. 1000 కోట్లు కొల్లగొట్టింది. కానీ.. ఏడాది అర్ధభాగం ముగిసే సరికి ఇటు సౌత్, అటు నార్త్ లో ఏ ఒక్క సినిమా పఠాన్ ని టచ్ చేయలేదు. కానీ.. 2023 సెకండాఫ్ లో మాత్రం పఠాన్ కి చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి. షారుఖ్ నుండి జవాన్ – డుంకి, సల్మాన్ ఖాన్ నుండి టైగర్ 3, రణబీర్ కపూర్ నుండి యానిమల్.. ఇలా ఇన్ని ఉన్నా.. అందరి కన్ను ప్రభాస్ నుండి వస్తున్న సలార్ పైనే పడింది. ముందు నుండి పెట్టుకున్న నమ్మకమే టీజర్ చూసాక ప్రూవ్ అయ్యింది. బాలీవుడ్ సర్కిల్స్ లో కూడా పఠాన్ ని బ్రేక్ చేసే సత్తా.. సలార్ కి ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి బాహుబలి 2తో ప్రభాస్ సెట్ చేసిన హిందీ రికార్డులను బ్రేక్ చేయడానికి బాలీవుడ్ కి ఐదేళ్లు పట్టింది. మరి ఈసారి సలార్ తో సెట్ చేసే టార్గెట్స్ ఏ రేంజ్ లో నమోదు అవుతాయో చూడాలి. మరి సలార్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి