iDreamPost

Good Luck Sakhi : కీర్తి సురేష్ మూవీకి మోక్షం ఎప్పుడు

Good Luck Sakhi : కీర్తి సురేష్ మూవీకి మోక్షం ఎప్పుడు

వాస్తవానికి ఈ నెల 31న కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి విడుదల కావాల్సి ఉంది. కానీ చడీ చప్పుడు లేదు. ప్రమోషన్ సూచనలు అసలే లేవు. సో రిలీజ్ వాయిదా అని చెప్పకనే చెప్పేశారు. ఇప్పటికే రెండుమూడు సార్లు పోస్ట్ పోన్ అయిన సఖికి నిజంగానే లక్ కలిసి వస్తున్నట్టు లేదు. అదే తేదీని సడన్ గా లాక్ చేసుకున్న అర్జున ఫల్గుణ మాత్రం ఉన్న తక్కువ టైంలోనే వేగంగా పబ్లిసిటీ చేసుకుంటూ వీలైనంత హైప్ తెచ్చుకునే ప్రయత్నాలు జోరుగా చేస్తోంది. ఒకవేళ గుడ్ లక్ సఖి కూడా రేస్ లో ఉన్నా ఇబ్బంది వచ్చేది కాదు. స్టార్ హీరో సినిమా కాదు కాబట్టి థియేటర్లు మరీ భారీగా అవసరం లేదు. కానీ నిర్మాతలు ఎందుకో మరి వెనుకడుగు వేశారు.

ఇక సఖి థియేటర్లో రావాలంటే కనీసం మూడు నెలలు దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. జనవరి ఫిబ్రవరి మొత్తం స్టార్ హీరోలతో నిండిపోయాయి. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, బలం, బంగార్రాజు, ఆచార్య, మేజర్, ఖిలాడీ, భీమ్లా నాయక్ ఇలా గ్యాప్ లేకుండా మరీ ఒకరి తర్వాత ఒకరు దండయాత్ర చేస్తూనే ఉంటారు. వీటి మధ్యలో వచ్చి ఇరుక్కుపోవడం కంటే సైలెంట్ గా ఉండటం ఉత్తమం. అందుకే గుడ్ లక్ టీమ్ మౌనంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఆది పినిశెట్టి, జగపతిబాబు లాంటి ఆర్టిస్టులు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, వీటిని మించి నగేష్ కుకునూర్ దర్శకత్వపు బ్రాండ్ ఇవేవి పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

నిజానికి డిసెంబర్ 31 మంచి డేటే. కాకపోతే ఆర్ఆర్ఆర్ కు కేవలం వారం గ్యాప్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఆలోగానే రన్ ముగించుకోవాల్సి ఉంటుంది. అయినా కూడా అర్జున ఫల్గునాతో పాటు రానా 1945, డబ్బింగ్ చిత్రం అంతఃపురం కూడా అదే రోజు బరిలో దిగుతున్నాయి. ఒకవేళ గుడ్ లక్ సఖి కూడా వచ్చి ఉంటే బాగానే ఉండేది కానీ అది లాంగ్ రన్ ఆశిస్తుందేమో తెలియదు. మహానటి తర్వాత కీర్తి సురేష్ సోలో సినిమాలు పెంగ్విన్, మిస్ ఇండియాలు ఓటిటిలోనే అయినా మరీ దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. ఆ ప్రభావం నేరుగా గుడ్ లక్ సఖి మీద పడింది. మరి ఇది కూడా డిజిటల్ బాట పడుతుందో లేక ఓన్లీ థియేటర్ అంటుందో చూడాలి

Also Read : Samantha : మెట్రో స్పీడ్ తో సమంతా కెరీర్ ప్లానింగ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి