iDreamPost

మరో అదిరిపోయే ఫీచర్.. ఒకే వాట్సాప్​లో రెండు వేర్వేరు అకౌంట్లు!

  • Author singhj Published - 04:46 PM, Sat - 12 August 23
  • Author singhj Published - 04:46 PM, Sat - 12 August 23
మరో అదిరిపోయే ఫీచర్.. ఒకే వాట్సాప్​లో రెండు వేర్వేరు అకౌంట్లు!

ప్రముఖ ఆన్​లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్​కు ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. ఈ యాప్​ను వరల్డ్​వైడ్​గా కోట్లాది మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది వాట్సాప్. యూజర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. స్క్రీన్ షేరింగ్, లాక్​చాట్​తో పాటు మల్టీ డివైజ్ ఫీచర్లను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా మరో కొత్త ఫీచర్​ను పరిచయం చేసింది. ఇక మీదట ఒకే వాట్సాప్ యాప్​లో రెండు వేర్వేరు ఖాతాలను వినియోగించే వెసులుబాటును కల్పించింది.

ఇప్పటిదాకా ఒక మొబైల్ ఫోన్​లో కేవలం ఒకే వాట్సాప్ అకౌంట్​ను ఉపయోగించడానికి మాత్రమే వాట్సాప్ అనుమతిస్తోంది. ఒకవేళ మరో వాట్సాప్ అకౌంట్​ను ఉపయోగించాలంటే వేరే మొబైల్ అయినా ఉండాలి. లేదా క్లోన్డ్ వాట్సాప్ యాప్ అయినా వినియోగించాల్సి ఉంటుంది. రెండు వాట్సాప్ అకౌంట్​లు ఉపయోగించడం కోసం రెండు ఫోన్లు వాడాలంటే చాలా కష్టం. అలాగని క్లోన్డ్ వాట్సాప్ వెర్షన్ వినియోగిద్దామంటే సెక్యూరిటీ పరమైన చిక్కులు ఎదురవుతాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే వాట్సాప్ ఈ సరికొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది.

కొత్త ఫీచర్ సాయంతో ఒకే వాట్సాప్​తో రెండు వేర్వేరు అకౌంట్లు ఉపయోగించుకోవచ్చు. ఇది అందుబాటులోకి వచ్చిన వారు తమ వాట్సాప్ అకౌంట్​లో క్యూఆర్ కోడ్​ ఆప్షన్ దగ్గర ఉన్న ‘యారో’ (బాణం) ఐకాన్ సాయంతో మరో అకౌంట్​ను యాడ్ చేసుకోవచ్చు. ఇదే ఐకాన్ సాయంతో వేరే అకౌంట్​కు మారొచ్చు. అప్పుడు యూజర్లు ఒకే ఫోన్​లో రెండు వేర్వేరు నంబర్లతో వాట్సాప్ అకౌంట్స్​ను నిర్వహించే సౌలభ్యాన్ని పొందొచ్చు. ఒక ఖాతాలో ప్రైవేట్ చాట్​లు, మరో ఖాతాలో జాబ్ లేదా బిజినెస్​కు సంబంధించిన సంభాషణలు జరపొచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చిందని వాట్సాప్ పేర్కొంది. మరి.. వాట్సాప్ నయా ఫీచర్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి