iDreamPost

అదిరే అప్ డేట్.. ఏ యాప్ కైనా వాట్సాప్ నుంచే..!

WhatsApp New Feature: ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అదిరిపోయే సరికొత్త ఫీచర్ తో వినియోగదారుల ముందుకు రాబోతోంది.

WhatsApp New Feature: ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అదిరిపోయే సరికొత్త ఫీచర్ తో వినియోగదారుల ముందుకు రాబోతోంది.

అదిరే అప్ డేట్.. ఏ యాప్ కైనా వాట్సాప్ నుంచే..!

ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగాదురలను సర్ ప్రైజ్ చేస్తుంటుంది. ఇప్పుటు అలాంటి ఒక సరికొత్త ఫీచర్ ని తీసుకురాబోతోంది. ఆ ఫీచర్ వచ్చిన తర్వాత వాట్సాప్ వినియోగాదారులకు మెసేజింగ్ అనే మరింత సులువు కాబోతోంది. అదేంటంటే.. వాట్సాప్ అతి త్వరలోనే థర్డ్ పార్టీ యాప్స్ తో మెసేజ్ చేసే ఫీచర్ ని తీసుకు రాబోతోంది. ఆ ఫీచర్ వచ్చిన తర్వాత మీరు ఏ థర్డ్ పార్టీ యాప్ కైనా నేరుగా వాట్సాప్ నుంచే మెసేజ్ చేయచ్చు. ఈ వార్త విన్న తర్వాత వాట్సాప్ వినియోగదారులు ఎగిరి గంతేస్తున్నారు. అయితే అసలు ఆ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చూద్దాం.

వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు తీసుకురాబోయే ఫీచర్ ద్వారా వినియోగదారులు వాట్సాప్ నుంచి ఏ థర్డ్ పార్టీ యాప్ కైనా మెసేజ్ చేయచ్చు. మెటా సంస్థకు చెందిన వాట్సాప్ ప్రస్తుతం ఈ థర్డ్ పార్టీ యాప్ ఛాటింగ్ ఫీచర్ మీద కృషి చేస్తోంది. యూరోపియన్ యూనియన్ డిజిటల్ మార్కెట్ చట్టం తెస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ఈ ఫీచర్ వచ్చే మార్చి నాటికి అందుబాటులోకి వచ్చే ఆస్కారం కనిపిస్తోంది. వాట్సాప్ ఇంజినీరింగ్ డైరెక్టర్ డిక్ బ్రోబర్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. వాట్సాప్ తమ 200 కోట్ల మంది వినియోగదారుల కోసం థర్డ్ పార్టీ ఛాటింగ్ ఫీచర్ మీద పనిచేస్తోందని వెల్లడించారు.

వాట్సాప్ సెక్యూరిటీ, సేఫ్టీ, ప్రైవసీ, యూనిటీని దృష్టిలో ఉంచుకుని థర్డ్ పార్టీ యాప్ లకు ఇంటర్ ఆపరబిలిటీని అందిస్తున్నామని తెలిపారు. ఈ ఇంటర్ ఆపరబిలిటీకి థర్డ్ పార్టీ యాప్స్ మద్ధతు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మిగిలిన యాప్స్ సంగతి పక్కన పెడితే.. టెలిగ్రామ్ విషయంలోనే క్లారిటీ రాలేదు. ఈ ఇంటర్ ఆపరబిలిటీకి వాట్సాప్ అతి పెద్ద ప్రత్యర్థి అయిన టెలిగ్రామ్ సపోర్ట్ చేస్తుందా అంటే కష్టమనే చెప్పాలి. ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకుండానే బగ్గు మంటుంది. టెలిగ్రామ్ అధినేత ఇప్పటికే చాలాసార్లు వాట్సాప్ పై నేరుగానే నిందలు వేశారు. వాట్సాప్ ప్రైవసీ విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు.

వాట్సాప్ అంటే గుర్రుగా ఉండే అలాంటి టెలిగ్రామ్ అధినేత.. వాట్సాప్ ఇంటర్ ఆపరబిలిటీకి అంగీకరిస్తుందా? అంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాట్సాప్ టూ వాట్సాప్ కి ఎలాగైతే మెసేజులు, ఫొటోలు, వాయిస్, వీడియోలు పంపుతారో.. అలాగే ఈ థర్డ్ పార్టీ యాప్ లకు కూడా మీరు మెసేజ్ లు, వీడియోలు, వాయిస్ మెసేజ్లు పంపుకోవచ్చు. మరి.. వాట్సాప్ తీసుకురాబోతున్న ఈ థర్డ్ పార్టీ ఛాటింగ్ ఫీచర్ యూజ్ ఫుల్ అనిపిస్తోందా? అలాంటి ఫీచర్ ని తీసుకురావడం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి