iDreamPost

ఇక వాట్సాప్​లోనే మూవీస్, క్రికెట్ అప్​డేట్స్ తెలుసుకోవచ్చు.. ఎలాగంటే?

  • Author singhj Published - 08:20 PM, Tue - 19 September 23
  • Author singhj Published - 08:20 PM, Tue - 19 September 23
ఇక వాట్సాప్​లోనే మూవీస్, క్రికెట్ అప్​డేట్స్ తెలుసుకోవచ్చు.. ఎలాగంటే?

ప్రముఖ ఆన్​లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం మరో క్రేజీ అప్​డేట్​ను తీసుకొచ్చింది. రెండు అదిరిపోయే ఫీచర్లను వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చింది. అందులో ఒకటి ఛానెల్స్ ఫీచర్. అవును, వాట్సాప్​లో కొత్తగా ఛానెల్స్ సదుపాయం వచ్చింది. ఇండియా సహా 150 దేశాల్లో ఈ ఫీచర్​ను మొదలుపెట్టినట్లు మెటా తెలిపింది. ఇప్పటికే చాలా మంది యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. త్వరలో మిగిలిన వారికి కూడా రానుంది. వాట్సాప్ అప్​డేట్ చేసుకుంటే చాలు.. ఈ ఫీచర్ మీ వాట్సాప్​లోనూ వచ్చేస్తుంది.

వాట్సాప్​ను సాధారణంగా అందరూ పరస్పర కమ్యూనికేషన్ కోసం మాత్రమే వాడుతున్నారు. కానీ ఆ తర్వాత గ్రూప్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు కొత్తగా ఛానెల్స్ ఫీచర్​ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఎవరైనా సరే తమకు నచ్చిన వ్యక్తులు, సంస్థలను ఫాలో అయ్యి వాట్సాప్​లోనే ఎప్పటికప్పుడు వాళ్లకు సంబంధించిన అప్​డేట్స్ తెలుసుకునేందు వీలుంది. సోషల్ మీడియా వేదికలైన ట్విట్టర్, ఇన్​స్టాగ్రామ్​లో ఎలాగైతే మనకు నచ్చిన వాళ్లను ఫాలో అవుతున్నామో అలాగే వాట్సాప్​లోనూ ఫాలో అయి అప్​డేట్స్ తెలుసుకోవచ్చు. అలాగే కావాలనుకుంటే ఈ అప్​డేట్​ను ఇతరులతోనూ పంచుకోవచ్చు.

వాట్సాప్​లో నచ్చిన వారిని ఫాలో అయి వాళ్ల అప్​డేట్స్ తెలుసుకోవచ్చు. అయితే ఫాలో అయినంత మాత్రాన మీ ఫోన్ నంబర్ ఎవరికీ కనిపించదు. స్టేటస్ ట్యాబ్ స్థానంలో అప్​డేట్స్ అని కనిపిస్తుంది. అక్కడ పైభాగంలో స్టేటస్​లు, దిగువన ఛానెల్స్ కనిపిస్తాయి. కింద మీకు ఫైండ్ ఛానెల్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పటికే అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్​ లాంటి బాలీవుడ్ సెలబ్రిటీఆలతో పాటు పలు మీడియా సంస్థల ఛానెల్స్ మీకు కనిపిస్తాయి. ప్లస్ సింబల్​ క్లిక్ చేయడం ద్వారా ఛానెల్​ను ఫాలో అవ్వొచ్చు. ఛానెల్స్ ద్వారా వ్యక్తులు కూడా తమ సొంత ఛానెల్​ను క్రియేట్ చేయొచ్చు. అందుకోసం ఛానెల్స్ పక్కనే ఉన్న ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే క్రియేట్ ఛానెల్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ఛానెల్ పేరు, డిస్క్రిప్షన్ పేర్కొంటే క్రియేట్ అయిపోతుంది. నచ్చిన వారికి ఈ లింక్​ను షేర్ చేయొచ్చు.

ఇదీ చదవండి: బ్రాహ్మణి.. మీ తాతను చెప్పుతో కొట్టించింది ఎవరు?: పోసాని

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి