iDreamPost

సున్తీ తర్వాత సె*క్స్ సామర్థ్యం పెరుగుతుందా? డాక్లర్లు ఏమంటున్నారంటే?

What are the Benefits of Circumcision in Telugu: సున్తి అనేది మగవారికి చేస్తుంటారు.. వేల ఏళ్ల కాలం నుంచి ఇది ఒక ఆచారంగా కొనసాగుతూ వస్తుంది.

What are the Benefits of Circumcision in Telugu: సున్తి అనేది మగవారికి చేస్తుంటారు.. వేల ఏళ్ల కాలం నుంచి ఇది ఒక ఆచారంగా కొనసాగుతూ వస్తుంది.

సున్తీ తర్వాత సె*క్స్ సామర్థ్యం పెరుగుతుందా? డాక్లర్లు ఏమంటున్నారంటే?

సున్తీ అనేది ఒక శస్త్ర చికిత్స.. దీన్ని వేళ ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరికి సున్తీ జరుగుతుందని చెబుతున్నారు. ఈ శస్త్ర చికిత్సలో భాగంగా పురుషాంగం ముందు ఉండే చర్మాన్ని తొలగిస్తారు. నేటికి ఇది కొన్ని మతాల వరు ఆచారంగా వ్యవహరిస్తున్నారు. భారత్ లోనే కాదు.. అమెరికాలో కూడా ఈ ఆచారం పాటిస్తుంటారు. ఇక్కడ పుట్టిన పురుషుల్లో దాదాపు 80.5 శాతం వరకు ఈ చికిత్స నిర్వహిస్తుంటారని 2016 నాటి డేలా చెబుతుంది. ఈ చికిత్సతో పలు ప్రయోజనాలు ఉంటాయని దశాబ్దాల కాలంగా ప్రజలు నమ్ముతున్నారు. సాదారణంగా సున్తీ అనేది బాల్యంలోనే చేస్తుంటారు.. కొంతమంది మాత్రం పెద్దయ్యాక చేయించుకుంటారు. అయితే సున్తీ వల్ల సె*క్స్ సామర్ధ్యం పెరుగుతుందా అనే విషయంపై భిన్న అభిప్రాయాలు వెలువడతున్నాయి.

సున్తీ చేయించుకుంటే ఏం జరుగుతుంది.. పురుషా0గ ముందు భాగమైన గ్లాన్స్ (జననా0గ శీర్ష0) ను ఈ చర్మం కప్పి ఉంచుతుంది.. అయితే ఇది చాలా సున్నితంగా ఉంటుంది. మితతా చర్మం కన్నా ఫోర్ స్కిన్ చాలా భిన్నమైంది. మొత్తం గ్లాన్స్ బయటకు కనిపించే వరకు ఈ చర్మాన్ని తొలగిస్తారు. చర్మం అనేది పురుషాంగం ముందు బాగానికి రక్షణ కల్పిస్తుందని.. అమెరికాకు చెందిన వైద్యుడు అనా మరియా అట్రాన్ తెలిపారు. ఇది వ్యాధి నిరోధక శక్తితోనూ సంబంధం ఉంటుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా రెండు విధాలుగా సున్తీ శస్త్ర చికిత్స చేస్తుంటారు. కొత్తి లేదా చాకు పై చర్మాన్ని తొలగిస్తారు. రెండోది స్టాపిల్ గన్ ఉపయోగిస్తుంటారు. పురుషాంగం ప్రాంతంలో మాత్రమే మత్తు మందు ఇచ్చి శస్త్ర చికిత్స చేస్తారు.

సున్తీ ఎప్పుడు చేయించుకోవాలి? అనే ప్రశ్నకు రెండు రకాల సమాధానం ఉంది. పుట్టిన కొద్దిరోజుల్లో ఈ చికిత్స చేయిస్తే.. ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువా ఉన్నాయని అంటున్నారు. అంతేకాదు మూత్ర నాళ ఇన్ఫెక్షన్స్, హెచ్ఐవీ, పెనైల్ క్యాన్సర్ లాంటి వ్యాధులను అడ్డుకోవచ్చిన అమెరికన్ అకాడమీ ఆఫ్ పిడయాట్రిక్స్ ( ఏఏపీ) చెబుతుంది. ఆరోగ్య పరిస్థితులను బట్టి పెద్దయ్యాక కూడా చేయించుకోవొచ్చు. అది వారి తల్లిదండ్రులు తీసుకోవాలన్సిన నిర్ణయం అంటున్నారు. అయితే సున్తీ చేసుకున్న తర్వాత పిల్లలకు కొన్ని జాగ్రత్తలు చెబుతూ ఉండాలి. అపరిశుభ్రంగా ఉండకుండా సబ్బుతో ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉండేలా చూసుకోవాలని సూచించాలని వైద్యులు చెబుతున్నారు.

కొంతమంది తమ పురుషా0గ0 మరింత అందంగా కనిపించేందుకు ఆ ముందు చర్మాన్ని తొలగించాలని కూడా వైద్యుల దగ్గరకు వస్తుంటారు. ఇక్కడ కొన్ని అపోహల గురించి వైద్యులు క్లారిటీ ఇచ్చారు.. సున్తీ తర్వాత పురుషా0గ0 పొడవుగా లేదా పెద్దగా మారదు. సున్తీ తర్వాత ఎక్కువ సేపు సె*క్స్ లో పాల్గొనవచ్చు అనేది కూడా అపోహే అంటున్నారు. అంగం ఉద్రేకం అనేది సున్తీకి ముందు.. తర్వాత ఒకేలా ఉంటుందని అంటున్నారు. కానీ కొంతమంది అభిప్రాయాలు వేరుగా చెబుతున్నారు. సున్తీ చేయించుకున్న తర్వాత గతంలో పోలిస్తే ఎక్కవ శృ0గారాన్ని ఆస్వాదిస్తున్నట్లు తెలుస్తుంది. సున్తీ చేయించుకోవడం వ్లల పూర్త చర్మంపై గాయాలు కావడం చాలా వరకు తగ్గిందని అధ్యయనంలో తేలిందని అంటున్నారు. ఫలితంగా పురుషులు శృ0గారానని సంతృప్తిగా ఆస్వాదిస్తున్నట్లు వెల్లడైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి