iDreamPost

West Indies: వెస్టిండీస్‌ ఇజ్‌ బ్యాక్‌! 25 ఏళ్ల తర్వాత విజయం దక్కింది!

  • Published Dec 10, 2023 | 11:37 AMUpdated Dec 11, 2023 | 10:11 AM

వెస్టిండీస్‌ జట్టు దాదాపు 25 ఏళ్ల తర్వాత విజయం సాధించింది. ఈ విషయం విని క్రికెట్‌ ప్రపంచం మొత్తం సంతోషం వ్యక్తం చేస్తోంది. గెలిచింది మూడు వన్డేల సిరీస్‌లో మాత్రమే.. కానీ, ఇంత ప్రత్యేకత ఎందుకు? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.

వెస్టిండీస్‌ జట్టు దాదాపు 25 ఏళ్ల తర్వాత విజయం సాధించింది. ఈ విషయం విని క్రికెట్‌ ప్రపంచం మొత్తం సంతోషం వ్యక్తం చేస్తోంది. గెలిచింది మూడు వన్డేల సిరీస్‌లో మాత్రమే.. కానీ, ఇంత ప్రత్యేకత ఎందుకు? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.

  • Published Dec 10, 2023 | 11:37 AMUpdated Dec 11, 2023 | 10:11 AM
West Indies: వెస్టిండీస్‌ ఇజ్‌ బ్యాక్‌! 25 ఏళ్ల తర్వాత విజయం దక్కింది!

వెస్టిండీస్‌.. ఈ తరం క్రికెట్‌ అభిమానులు ఆ టీమ్‌ను ఓ పసికూన అనుకుంటారు. కానీ, కొన్ని దశాబ్దాల పాటు క్రికెట్‌ ప్రపంచాన్ని ఏలిన దేశం వెస్టిండీస్‌. క్రికెట్‌ పుట్టింది ఇంగ్లండ్‌లోనే అయినా.. దానికి మొట్టమొదటి రారాజులు కరేబియన్లే. వరుసగా తొలి రెండు వరల్డ్‌ కప్‌లను గెలిచిన జట్టు వెస్టిండీస్‌. గతమెంతో ఘనం అన్న రితీలో వెస్టిండీస్‌ ఘన చరిత్ర మనసకబారుతూ వచ్చింది. ఎంతలా అంటే.. తొలి రెండు ప్రపంచ కప్పులు గెలిచి.. క్రికెట్‌ ప్రపంచాన్ని శాసించిన జట్టు.. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌కు కనీసం అర్హత సాధించలేకపోయింది. క్రికెట్‌ చరిత్రలో వెస్టిండీస్‌ లేకుండా జరిగిన తొలి వన్డే వరల్డ్‌ కప్‌గా నిలిచింది వన్డే వరల్డ్‌ కప్‌ 2023. ఇంతటి పతనంలోకి కూరుకుపోయిన వెస్టిండీస్‌కు మళ్లీ పాత రోజులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

అందుకే తాజాగా దక్కిన ఒక విజయమే దారి చూపించేలా ఉంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పాతికేళ్ల తర్వాత వెస్టిండీస్‌ సిరీస్‌ గెలిచింది. ఇంగ్లండ్‌తో తాజాగా జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కరేబియన్‌ జట్టు 2-1 తేడాతో గెలిచింది. ఇలా ఇంగ్లండ్‌పై సొంత గడ్డపై వన్డే సిరీస్‌ను 25 ఏళ్ల తర్వాత వెస్టిండీస్‌ కైవసం చేసుకుంది. ఆఫ్ట్రాల్‌.. మూడు వన్డేల సిరీస్‌నే కదా గెలిచింది అని చాలా మంది అనుకుని ఉండొచ్చు. కానీ, అది వెస్టిండీస్‌కు వరల్డ్‌ కప్‌తో సమానం. ఈ సిరీస్‌ విజయాన్ని క్రికెట్‌ లెజెండ్‌ వీవీయన్‌ రిచర్డ్స్‌ సైతం చిన్నపిల్లాడిలా గంతులేస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఈ విజయం వెస్టిండీస్‌ క్రికెట్‌ కు ఊపిరి లాంటిదని.

వరల్డ్‌ కప్‌కు అర్హత సాధించకపోవడం, క్రికెట్‌ బోర్డుతో విభేదాల కారణంగా జట్టులోని అత్యుత్తమ ఆటగాళ్లు ఫ్రాంచైజ్‌ క్రికెట్‌కే పరిమతం కావడం.. ఒకప్పుడు క్రికెట్‌ ప్రపంచాన్ని శాసించిన జట్టు.. ఇప్పుడు కనీసం కిట్‌ స్పాన్సర్‌ కూడా లేని దీన స్థితిలోకి వెళ్లిన సమయంలో.. ఛాంపియన్‌ టీమ్‌ ఇంగ్లండ్‌ను సొంత గడ్డపై వన్డే సిరీస్‌లో ఓడించడంపై కరేబియన్‌ క్రికెట్‌కు పెద్ద విషయమే. ఒక్క వెస్టిండీస్‌కే కాదు.. విండీస్‌ వైభవాన్ని చూసిన ప్రతి క్రికెట్‌ అభిమాని కూడా వెస్టిండీస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. కనీసం ఈ విజయంతోనైనా వెస్టిండీస్‌ తన పూర్వ వైభావాన్ని తిరిగి పొందాలని ప్రపంచంలోని ప్రతి క్రికెట్‌ అభిమాని ఆకాంక్షిస్తున్నాడు. మరి 25 ఏళ్ల తర్వాత తమ సొంత దేశంలో ఇంగ్లండ్‌పై వెస్టిండీస్‌ వన్డే సిరీస్‌ గెలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి