iDreamPost

జట్టులో చోటు దక్కినా.. విండీస్ ప్లేయర్ షాకింగ్ డెసిషన్!

  • Author Soma Sekhar Published - 10:46 AM, Fri - 1 December 23

ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ.. షాకింగ్ డిసిషన్ తీసుకున్నాడు విండీస్ కీపర్, బ్యాటర్ షేన్ డౌరిచ్.

ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ.. షాకింగ్ డిసిషన్ తీసుకున్నాడు విండీస్ కీపర్, బ్యాటర్ షేన్ డౌరిచ్.

  • Author Soma Sekhar Published - 10:46 AM, Fri - 1 December 23
జట్టులో చోటు దక్కినా.. విండీస్ ప్లేయర్ షాకింగ్ డెసిషన్!

వెస్టిండీస్ జట్టు త్వరలోనే ఇంగ్లాండ్ తో తలపడబోతోంది. ఈ సిరీస్ లో భాగంగా 3 వన్డేలు, 5 టీ20లు జరగనున్నాయి. డిసెంబర్ 3న జరిగే తొలి వన్డే మ్యాచ్ తో ఈ సిరీస్ ప్రారంభం అవుతుంది. ఇక ఇప్పటికే ఇరు జట్లు సిద్ధమైయ్యాయి. ఈ క్రమంలోనే విండీస్ కీపర్, బ్యాటర్ షేన్ డౌరిచ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ.. షాకింగ్ డిసిషన్ తీసుకున్నాడు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అతడు తెలిపాడు.

వెస్టిండీస్ వికెట్ కీపర్ షేన్ డౌరిచ్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అర్దాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. తన రిటైర్మెంట్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ పేర్కొన్నాడు. ఈ వార్త క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. దానికి కారణం కూడా ఉంది. డిసెంబర్ 3 నుంచి ఇంగ్లాండ్ తో ప్రారంభం అయ్యే వన్డే సిరీస్ కు డౌరిచ్ ను ఎంపిక చేసింది. మ్యాచ్ ప్రారంభానికి ఒక్క రోజు ముందే అతడు క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు.

ఇక డౌరిచ్ తీసుకున్న ఆకస్మిక నిర్ణయం పట్ట విండీస్ క్రికెట్ బోర్డు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక అతడి కెరీర్ విషయానికి వస్తే.. 2015లో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన డౌరిచ్.. 35 టెస్టులు, ఓ వన్డే ఆడాడు. ఓవరాల్ గా 1570 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, 9 అర్దశతకాలు ఉన్నాయి. ఇక వికెట్ కీపర్ గా 91 మంది ప్లేయర్లను పెవిలియన్ కు పంపాడు. సాధారణంగా జట్టులో చోటు దక్కకపోతే ఆటగాళ్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఈ విండీస్ ప్లేయర్ తీసుకున్న డెసిషన్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. మరి డౌరిచ్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి