iDreamPost

చిక్కుల్లో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌.. పులిగోరు చైన్‌ ధరిస్తే క్రైమా?

భారత్‌లో పులి గోర్ల చైన్‌లు ధరించటం నేరమా? వన్య ప్రాణి సంరక్షణా చట్టం 1972 దీనిపై ఏం చెబుతోంది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

భారత్‌లో పులి గోర్ల చైన్‌లు ధరించటం నేరమా? వన్య ప్రాణి సంరక్షణా చట్టం 1972 దీనిపై ఏం చెబుతోంది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చిక్కుల్లో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌.. పులిగోరు చైన్‌ ధరిస్తే క్రైమా?

బిగ్ బాస్ 10 కన్నడ కంటెస్టెంట్‌ వర్తూరు సంతోష్‌ పులి గోర్ల చైన్‌ ధరించిన కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, బిగ్‌బాస్‌ సెట్‌కు వెళ్లిన పోలీసులు సంతోష్‌ మెడలోని పులి గోర్ల చైన్‌ను పరిశీలించారు. అవి నిజమైన పులివేనని గుర్తించిన పోలీసులు సంతోష్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో పులి గోర్ల చైన్‌ల గురించి దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. భారత్‌లో పులి గోర్ల చైన్‌లు ధరించటం నేరమా? వన్య ప్రాణి సంరక్షణా చట్టం 1972 దీనిపై ఏం చెబుతోంది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వన్య ప్రాణి సంరక్షణా చట్టం 1972 ప్రకారం.. పులి భారత దేశ జాతీయ జంతువు. దానికి తోడు అంతరించి పోతున్న జంతు జాతుల్లో అన్ని రకాల పులులు కూడా ఉన్నాయి. వీటిని సంరక్షించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం కఠిన చట్టాలను అమల్లోకి తెచ్చింది. వన్య ప్రాణి సంరక్షణా చట్టం 1972 ద్వారా రక్షణ కల్పిస్తోంది. ఈ చట్టం ప్రకారం… పులుల్ని చంపటం.. వేటాడ్డం.. పులుల శరీర భాగాల్ని కలిగి ఉండటం నేరం. కేవలం పులులు మాత్రమే కాదు.. ఏ అడవి జంతువును వేటాడినా.. వాటి శరీర భాగాల్ని కలిగి ఉన్నా నేరమే.

నేరాన్ని బట్టి శిక్షలు పడే అవకాశం ఉంటుంది. అడవి జంతువుల్ని స్వయంగా వేటాడి ఉంటే ఒకలాంటి శిక్ష.. అలా కాకుండా వాటి శరీర భాగాల్ని మాత్రమే కలిగి ఉంటే ఒకలాంటి శిక్ష పడుతుంది. పులి గోర్ల చైన్‌ కేసుకు సంబంధించి నేరం రుజువైతే సంతోష్‌కు 3 – 7 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. జంతు సంరక్షణా చట్టాలకు సంబంధించి కొన్నిసార్లు బెయిల్‌ దొరకటం కూడా కష్టంగా ఉంటుంది. మరి, పులి గోర్ల చైన్‌ను ధరించి చిక్కుల్లో పడ్డ బిగ్ బాస్ 10 కన్నడ కంటెస్టెంట్‌ వర్తూరు సంతోష్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి