iDreamPost

దగ్ధమవుతున్న కారు.. ఇంజన్ లో భారీగా నోట్ల కట్టలు! తర్వాత జరిగింది ఇదే!

వరంగల్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. తగలబడుతున్న కారు ఇంజన్ నుంచి భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

వరంగల్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. తగలబడుతున్న కారు ఇంజన్ నుంచి భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

దగ్ధమవుతున్న కారు.. ఇంజన్ లో భారీగా నోట్ల కట్టలు! తర్వాత జరిగింది ఇదే!

నడి రోడ్డులో ఉన్న ఓ కారు ఇంజన్ నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. అయితే, పక్కనే ఉన్న కొందరు వ్యక్తులు అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దగ్ధమవుతున్న ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. అయితే, ఈ క్రమంలోనే కారు ఇంజన్ లో నుంచి ఏదో పేపర్లు కాలిపోతున్నట్లు పోలీసులకు కనిపించాయి. దగ్గరకు వెళ్లి చూడగా.. అందులో భారీగా ఉన్న కరెన్సీ నోట్ల కట్టలు కనిపించాయి. ఈ సీన్ చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత ఏం జరిగింది తెలసుకుని నోళ్లు తెరిచారు. అసలేం జరిగింటే?

పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట సమీపంలోని రోడ్డుపై నుంచి వెళ్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సాయంతో పోలీసులు ఆ మంటలును అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కారు బానెట్ లో ఏదో పేపర్లు అంటుకుంటున్నట్లు అనిపించింది. దీంతో పోలీసులు దగ్గరకు వెళ్లి చూశారు. కాస్త ఏదో తేడాగా ఉండడంతో ఆ మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఆ తర్వాత అది తెరిచి చూడగా.. అందులో భారీగా కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ సీన్ ను చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురై నోళ్లు తెరిచారు.

అనంతరం అందులో ఉన్న ఆ నోట్ల కట్టలను బయటకు తీశారు. ఆ తర్వాత పోలీసులు మరోసారి ఆ కారు అంతా పరిశీలించారు. ఇక ఆ డబ్బును అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించి ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కారులో ప్రయాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పట్టుబడ్డ నగదు ఏ రాజకీయ పార్టీకి చెందింది అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, పోలీసులు ఆ డబ్బుతో పాటు ఆ కారును కూడా సీజ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు షాక్ గురవుతున్నారు. డబ్బును అక్రమంగా తీసుకెళ్లాలనుకుకుంటే ఏదో జరిగిందంటూ చర్చించుకుంటున్నారు. ఈ డబ్బు ఖచ్చితంగా ఏదో రాజకీయ పార్టీకి చెందిందే అంటూ గుస గుస లాడుకుంటున్నారు. డబ్బును దొంగచాటున తీసుకెళ్లాలని భావించి చివరికి అడ్డంగా దొరికిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి