iDreamPost

ఇలాంటి పత్రికను ఎక్కడా చూసుండరు! పెళ్లి కార్డు అనుకుంటే పొరపాటే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. తమ అభిమాన నాయకుడి కోసం ఎవరికి తోచిన పద్ధతిలో వారు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఓ కార్పొరేటర్ మాత్రం కాస్త విభిన్నంగా ఆలోచించాడు. ఆ ప్రయత్నమే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరటమే కాకుండా.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనవి. అంటూ.. ఓట్ల పండుగకు ప్రత్యేక ఆహ్వాన పత్రికలు పంచుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. తమ అభిమాన నాయకుడి కోసం ఎవరికి తోచిన పద్ధతిలో వారు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఓ కార్పొరేటర్ మాత్రం కాస్త విభిన్నంగా ఆలోచించాడు. ఆ ప్రయత్నమే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరటమే కాకుండా.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనవి. అంటూ.. ఓట్ల పండుగకు ప్రత్యేక ఆహ్వాన పత్రికలు పంచుతున్నారు.

ఇలాంటి పత్రికను ఎక్కడా చూసుండరు! పెళ్లి కార్డు అనుకుంటే పొరపాటే!

తెలంగాణలో ఎన్నికల సమయం తుది దశకు చేరుకుంది. ఈ తరుణంలో రాజకీయ నాయకుల గుండెల్లో దడ మొదలైయింది. ప్రచారానికి ఇంకా మూడు రోజులే మిగిలి ఉండటంతో.. అన్ని పార్టీల వారు ప్రచార జోరును పెంచారు. అగ్రనేతల దగ్గర నుంచి బూతుస్థాయి కార్యకర్తల వరకు అందరూ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమకే ఓటు వెయ్యలంటూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే.. ప్రచారంలో భాగంగా అందరూ తమ మేనిఫెస్టో, గుర్తుకు సంబంధించిన కరపత్రాలు పంచుతున్నారు.. ఈ క్రమంలో ఓ నేత మాత్రం వెరైటీగా ఓట్ల పండుగకు ప్రత్యేక ఆహ్వాన పత్రికను పంచుతున్నారు. ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌కు మరో 5 రోజులుండగా.. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అభ్యర్థులంతా అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా.. ఆ ప్రత్యేకమైన ఆహ్వాన పత్రిక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వివరాళ్లోకి వెళ్తే..

వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున బరిలో దిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ను గెలిపించాలని కోరుతూ.. ఆయన తరపున 28వ డివిజన్ కార్పోరేటర్ గందె కల్పన నవీన్ వినూత్నంగా ప్రచారం మొదలుపెట్టారు. అందరిలా పార్టీకి చెందిన మెనిఫెస్టోతో కరపత్రాన్ని ముద్రించి పంచితే… దాన్ని అంతగా ఎవరూ పట్టించుకోరేమో అని భావించి.. ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ.. ఆ ఓటును కారు గుర్తుకే వేసి తమ బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌‌ను గెలిపించాలంటూ.. ఓ ప్రత్యేక ఆహ్వాన పత్రికను ముద్రించారు.

ఇది చూసిన ప్రతి ఒక్కరూ పెళ్లి పత్రిక అనుకుంటే పొరపాటే.. అచ్చం పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రికను పోలినట్టుగానే ఉంది మరి. ఈ ముద్రించిన కరపత్రాన్ని.. ఓటు హక్కు వినియోగ ఆహ్వాన శుభపత్రిక అని పేర్కొన్నారు. అందులో ఈ నెల 30వ తేదీన గురువారం రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓట్ల పండుగ జరగనుందని తెలిపారు. ఈ ఓట్ల పండుగలో.. తమ విలువైన ఓటును కారు గుర్తుకు వేసి.. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ను ఆశీర్వదించి, అభ్యర్థి నన్నపునేని నరేందర్‌ను గెలిపించాలని గందె కల్పన నవీన్ చెప్పుకొచ్చారు. కాగా.. ఇంతవరకు ఇలాంటి ఆహ్వాన పత్రిక ఎప్పుడూ చూడని ప్రజలు.. ఎంతో ఆసక్తిగా దీన్ని చదువుతున్నారు.

మరోవైపు.. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతుండగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా సురేఖ పోటీ చేస్తున్నారు. మరో వైపు.. బీజేపీ తరపున ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే.. 2014లో టీఆర్ఎస్ తరుపున కొండా సురేఖ పోటీ చేయగా.. 2018లో కాంగ్రెస్ నుంచి బరిలో దిగగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన నన్నపునేని చేతిలో ఓడిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి