iDreamPost

ఆ పబ్‌ లో వింత ఆఫర్! ఓటు వేసిన వారికి ఫ్రీగా బీర్! ఎక్కడంటే?

  • Published Apr 26, 2024 | 7:20 PMUpdated Apr 26, 2024 | 7:20 PM

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎన్నికల హడవిడి ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా దేశంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో ఓటర్లను వివిధ రకాల పార్టీ అభ్యర్థులు ఓటు వేసి గెలిపించడం కోసం.. రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ ఆకర్షిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓటు వేసిన వారకి ఉచితంగా బీర్ ఇస్తామని ప్రకటించారు. ఇంతకి ఎక్కడంటే..

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎన్నికల హడవిడి ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా దేశంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో ఓటర్లను వివిధ రకాల పార్టీ అభ్యర్థులు ఓటు వేసి గెలిపించడం కోసం.. రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ ఆకర్షిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓటు వేసిన వారకి ఉచితంగా బీర్ ఇస్తామని ప్రకటించారు. ఇంతకి ఎక్కడంటే..

  • Published Apr 26, 2024 | 7:20 PMUpdated Apr 26, 2024 | 7:20 PM
ఆ పబ్‌ లో వింత ఆఫర్! ఓటు వేసిన వారికి ఫ్రీగా బీర్! ఎక్కడంటే?

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎన్నికల హడవిడి ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా దేశంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో ఓటర్లను వివిధ రకాల పార్టీ అభ్యర్థులు ఓటు వేసి గెలిపించడం కోసం.. రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ ఆకర్షిస్తుంటారు. అలాగే తమ పార్టీకి, పార్టీ అభ్యర్థి ఓటు వేయాలని ఓటర్లకు డబ్బు, మద్యం, వివిధ రకాల గిఫ్ట్ లను పంచుతూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు ఎన్నికల్లో ఓటు వేయమని ఇలాంటి ఆఫర్స్ ప్రకటించడం చూసి ఉంటాం,. కానీ, తాజాగా ఇప్పుడు మాత్రం.. ఎన్నికల్లోఓటింగ్ పోలింగ్ పెంచడం కోసం.. ఓటు వేసిన వారికి ఉచితంగా బీర్ ఇస్తామని ప్రకటిస్తున్నారు. అయితే ఎక్కడైనా.. ఓటు వేస్తే బిర్యాని, డబ్బులు వేయడం చూసి ఉంటాం. కానీ, కొత్తగా ఓటేస్తే బీర్ ఇవ్వడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. నిజంగా ఓటేస్తే బీరుతో పాటు భోజనం, ఫ్రీగా జర్నీ సహా రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇంతకీ ఇది ఎక్కడంటే?

దేశంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, ఇప్పటికే ఒక దశ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు రెండో దశ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మొత్తం 7 దశల్లో పోలింగ్ జరగనుండగా.. ఇంకా 5 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇకపోతే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఇప్పికే ఎన్నికల సంఘం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలు కలసి అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా తమ వంతుగా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు విశ్వప్రయాత్నలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓటు వేసిన వారికి రకరకాల ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఉచితంగా బీరు, మీల్స్, దోశ, ర్యాపిడో ఫ్రీ రైడ్ సహా పలు రకాలుగా ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. ఓటు వేస్తే ఫ్రీగా బీరు ఇవ్వడం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

అయితే ప్రస్తుతం ఈ ఆఫర్లు సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ జరుగుతున్న బెంగళూరులో మాత్రమే ఇస్తున్నారు. కాగా, అక్కడ లోక్ సభ ఎన్నికలు రెండో విడత పోలింగ్ శుక్రవారం జరిగింది. ఇక బెంగళూర్ లో కోటి మందికి పైగా ఓటర్లు ఉండన్నారు. కాగా, వారందరూ పోలింగ్ స్టేషన్ కు వెళ్లి ఓటు వేసేలా బెంగళూరులోని హోటల్స్, పబ్ లు, ట్యాక్సీ కంపెనీలు అంటూ రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నారు. అలాగే ఓటు వేసిన వారికి బీరు, భోజనం, ఫ్రీ రైడ్ వంటి సేవలను ఉచితంగా అందిస్తున్నారు. ఇక ఇలా ఫ్రీగా బీరు, మీల్స్, ర్యాపిడో రైడ్ కావాలంటే ఓటర్లు అందరూ.. కచ్చితంగా ఎన్నికల్లో ఓటు వేసి తమ వేలికి ఉన్న సిరా మరకను చూపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. ఓటర్ ఐడీ కార్డును కూడా ఆయా హోటల్‌లు, పబ్‌లలో చూపించాల్సి ఉంటుంది. అయితే బెంగళూరులోని నృపతుంగా రోడ్‌లో ఉన్న నిసర్గ గ్రాండ్ హోటల్‌లో ఓటు వేసిన వారికి బట్టర్ దోశ, ఘీ రైస్, ఒక కూల్‌డ్రింక్‌ను అందిస్తున్నారు.

అంతేకాకుండా.. బెల్లందూర్‌లో ఉన్న “డెక్ ఆఫ్ బ్రూస్” అనే రెస్టారెంట్ పబ్‌లో ఓటు వేసిన వారికి ఫ్రీగా ఒక మగ్ బీరును అందిస్తున్నారు. అయితే ఈ ఫ్రీ బీర్ కేవలం పోలింగ్ జరిగే శుక్రవారం ఒకటే రోజు అని స్పష్టం చేశారు. ఇక శని, ఆదివారాల్లో తమ రెస్టారెంట్ పబ్‌కు వచ్చేవారికి డిస్కౌంట్లు కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. దేశ అభివృద్ధి కోసం ఓటు వేసిన వారికి ఏదైనా చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు “డెక్ ఆఫ్ బ్రూస్” అనే రెస్టారెంట్ పబ్‌ ఓనర్ ప్రఫుల్ల రాయ వెల్లడించారు. దీంతో పాటు బెంగళూరులోని సోషల్ అనే రెస్టారెంట్‌ పబ్‌లలో 20 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. అయితే పోలింగ్ రోజుతో మొదలుకుని.. వారం రోజుల పాటు ఈ ఆఫర్ కొనసాగుతుందని ప్రకటించారు. ఇక శుక్రవారం పోలింగ్ ఉన్న నేపథ్యంలో బెంగళూరులో మెట్రో రైళ్ల సమయాన్ని సాధారణం కన్నా పొడిగిస్తున్నట్లు బెంగళూరు మెట్రో అధికారులు తెలిపారు. మరి, ఓటీంగ్ పోలింగ్ శాతాన్ని పెంచడానికి బెంగళూర్ ప్రకటిస్తున్న ఈ ఆఫర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి