iDreamPost
android-app
ios-app

20 ఏళ్ల తర్వాత కమల్ తో జతకట్టనున్న అలనాటి నటి!

స్టార్ డైరెక్టర్ మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ రానుంది. ఈ సినిమాలో కమల్ తో 20 ఏళ్ల క్రితం ఆయనతో నటించిన అలనాటి నటి.. మరోసారి కనిపించినుంది.

స్టార్ డైరెక్టర్ మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ రానుంది. ఈ సినిమాలో కమల్ తో 20 ఏళ్ల క్రితం ఆయనతో నటించిన అలనాటి నటి.. మరోసారి కనిపించినుంది.

20 ఏళ్ల తర్వాత కమల్ తో జతకట్టనున్న అలనాటి నటి!

విశ్వనటుడు కమల్ హాసన్ గురించి సినీ ప్రియులకు పెద్దగా పరిచయం  అక్కర్లేదు. నటనలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించారు కమల్. ఇక పోతే ఇటీవలే విక్రమ్ సినిమాతో  ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రం అత్యధిక వసూళ్లు రాబట్టి.. అనేక రికార్డులను  క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత మరో కొత్త ప్రాజెక్టుతో కమల్  బిజీగా ఉన్నారు.

కమల్ హాసన్ నటించిన విరుమాండి చిత్రం మనందరికీ సుపరిచితమే. ఆయన అంతలా నటించి మెప్పించిన ఈ సినిమాని ప్రేక్షకులు  ఎప్పటికి మరిచిపోలేరు. ఆ సినిమాలో  నటి అభిరామి కమల్ హాసన్ కి జోడిగా నటించింది.  ఆ సినిమాలో వీరిద్దరి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రంలో కమల్, అభిరామి జంటకు మంచి మార్కులే పడ్డాయి. కమల్ నటించిన విరుమాండి సినిమా 2004లో  విడుదలైంది.అంతేకాకుండా ఈ సినిమాలో నటించిన అభిరామి.. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక దాదాపు 20 ఏళ్ల తరువాత ఈ వీరిద్దరు మరో సినిమాలో కనిపించనున్నారు.

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, కమల్ లో థగ్ లైఫ్ అనే చిత్రం తెరకెక్కనుంది. వీరిద్దరి కాంబినేషన్లో 1987లో నాయకుడు అనే యాక్షన్ డ్రామా మూవీ విడుదలైంది. తమిళ లో నయగన్ పేరుతో విడుదలైన ఈ సినిమా సెన్సేషనల్  హిట్ గా నిలిచింది. ఈ సూపర్ హిట్ మూవీ తర్వాత మరోసారి మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి కమల్ హాసన్ సిద్ధమయ్యారు. ఇంకా చెప్పాలంటే దాదాపు 36 సంవత్సరాల  తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో కొత్త సినిమా రానుంది.  ఈ సినిమాకి ‘థగ్ లైఫ్’అనే  టైటిల్ కూడా ఖరారు చేశారు.  ఇది పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. ఇకపోతే కమల్ కెరియర్ లో ఇది 234వ చిత్రం.

ఈ భారీ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్, రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషల్, మద్రాస్ టాకీస్ సంస్థలు నిర్మిస్తున్నారు. ఇందులో స్టార్ హిరోయిన్ త్రిష, నటుడు జయంరవి, దుల్కర్ సల్మాన్ వంటి ప్రముఖ స్టార్స్ అందరూ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ వర్గాలు దీనిపై అధికారికంగా ప్రకటించాయి. తాజాగా ఇందులో అలనాటి నటి అభిరామి కూడా భాగం అవుతున్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన కెరీర్ గురించి ఆసక్తికరంగా విషయాలను షేర్ చేసుకున్నారు.

థగ్ లైఫ్ సినిమాకు సంబంధించిన విశేషాలను కూడా ఆమె షేర్ చేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. తాను, కమల్ జంటగా నటించే విరుమండి చిత్రం విడుదలై దాదాపుగా 20 ఏళ్లు అయిందన్నారు. మళ్లీ ఇప్పుడు థగ్ లైఫ్ చిత్రంతో ఆయనతో కలిసి మరోసారి నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇందులో తన పాత్ర గురించి దర్శక నిర్మాతలే త్వరలో ప్రకటిస్తారని అన్నారు. మరో విశేషం ఏమిటి అంటే.. అప్పుడు విరుమాండి చిత్రం 2004లో పొంగల్ సమయంలో విడుదలైయింది.

ఇప్పుడు థగ్ లైఫ్ చిత్రం షూటింగ్ కూడా 2024లో పొంగల్ సందర్భంగా ప్రారంభం కాబోతుందని నటి అభిరామి తెలిపారు. కాగా ఈ సినిమాలో మరో లెజెండరీ ఏఆర్ రెహమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, ప్రోమో రిలీజై అందరినీ ఆకట్టుకుంది. అంతేకాక ఈ సినిమా విడుదల కోసం కమల్ అభిమానులతో పాటు.. సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి.. థగ్ లైఫ్ సినిమాపై అలనాటి నటి అభిరామి చెప్పిన విశేషాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis