iDreamPost

T20 World Cup: టీమిండియాకు బిగ్‌ షాక్‌! విరాట్‌ కోహ్లీ దూరం!

  • Published May 26, 2024 | 6:00 PMUpdated May 28, 2024 | 1:28 PM

Virat Kohli, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ కీలక మ్యాచ్‌కు దూరం అవుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇండియన్‌ ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దారి గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Virat Kohli, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ కీలక మ్యాచ్‌కు దూరం అవుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇండియన్‌ ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దారి గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published May 26, 2024 | 6:00 PMUpdated May 28, 2024 | 1:28 PM
T20 World Cup: టీమిండియాకు బిగ్‌ షాక్‌! విరాట్‌ కోహ్లీ దూరం!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2024 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. జూన్‌ 2 నుంచి వెస్టిండీస్‌, అమెరికా సంయుక్త వేదికగా ఈ మెగా టోర్నీ మొదలుకానుంది. ఈ టోర్నీలో టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను జూన్‌ 5న ఐర్లాండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌కి ముందు భారత క్రికెట్‌ అభిమానులు గుండె బద్దలయ్యే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ఒక కీలక మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్‌ కప్‌ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీకి ముందు బంగ్లాదేశ్‌తో జూన్‌ 1న జరిగే వామప్‌ మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది.

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం ఎంపికైన భారత ఆటగాళ్లలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జస్ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్, రిషభ్ పంత్, కుల్‌దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా, మొహమ్మద్‌ సిరాజ్, అర్ష్‌దీప్‌ సింగ్, ఖలీల్‌ అహ్మద్, అక్షర్‌ పటేల్, శివమ్‌ దూబెతో శనివారం అమెరికా విమానమెక్కారు. వారితో పాటు టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా ఉన్నాడు. అయితే.. వీరితో పాటు విరాట్‌ కోహ్లీ, హార్ధిక్‌ పాండ్యా, సంజు శాంసన్‌ వెళ్లలేదు. దుబాయ్‌లో కోహ్లికి వ్యక్తిగత పని ఉండటంతో అతను టీమిండియాతో చేరడం కాస్త ఆలస్యం కానుంది. ఈ విషయాన్ని బీసీసీఐకి ముందుగానే తెలియజేయడంతో.. దానికి బోర్డు ఓకే చెప్పినట్లు సమాచారం.

కోహ్లితో పాటు సంజు శాంసన్, హార్దిక్ పాండ్యకు కూడా బీసీసీఐ అనుమతి ఇచ్చిందని తెలుస్తోంది. ఇండియా నుంచి శాంసన్, లండన్ నుంచి హార్దిక్‌ కాస్త లేటుగా అమెరికా వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌‌తో జూన్ 1న జరగనున్న వామప్‌ మ్యాచ్‌కు కోహ్లి దూరం కానున్నాడు. టీ20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీకి ముందు టీమిండియా ఆడే ఒకే ఒక వామప్‌ మ్యాప్‌కు కోహ్లీ దూరం కావడం క్రికెట్‌ అభిమానులను కాస్త కంగారు పెడుతోంది. అయితే.. కోహ్లీ భీకర ఫామ్‌లో ఉండటంతో.. ఒక వామప్‌ మ్యాచ్‌ మిస్‌ అయినా పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదని అంటున్నారు. మే 30న కోహ్లీ న్యూయార్క్‌కు బయలుదేరనున్నాడు. జూన్‌ 5న తొలి మ్యాచ్‌ ఐర్లాండ్‌తో, జూన్‌ 9న పాకిస్థాన్‌తో టీమిండియా మ్యాచ్‌లు ఆడనుంది. మరి బంగ్లాతో వామప్‌ మ్యాచ్‌కు కోహ్లీ దూరం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి