iDreamPost
android-app
ios-app

సౌతాఫ్రికాతో సిరీస్‌కు విరాట్‌ కోహ్లీ దూరం! కారణం ఏంటి?

  • Published Nov 29, 2023 | 11:47 AMUpdated Nov 29, 2023 | 11:47 AM

వరల్డ్‌ కప్‌ 2023లో విరాట్‌ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. 765 పరుగులు చేసి వరల్డ్‌ కప్‌ చరిత్రలోనే అత్యధిక రన్స్‌ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. కానీ, ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉండాలని భావిస్తున్నాడు. మరి కోహ్లీ ఇలాంటి టఫ్‌ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్లో ఓటమితో క్రికెట్‌ అభిమానులతో పాటు, ఆటగాళ్లు కూడా తీవ్ర నిరాశకు గురైన విషయం తెలిసిందే. వరల్డ్‌ కప్‌ ఆసాంతం అద్భుతంగా రాణించిన భారత జట్టు.. వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి.. ఫైనల్‌కు దూసుకొచ్చింది. కానీ, అనూహ్యంగా ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది ఇండియా. దీంతో వంద కోట్ల మంది భారత క్రికెట్‌ అభిమానులు హృదయాలు ముక్కలయ్యాయి. అలాగే.. టీమిండియాకు రెండు కళ్ల లాంటి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ దాదాపు కళ్లెంటే నీళ్లు పెట్టుకున్నారు.

ఆ బాధ నుంచి ఇంకా కోలుకోని రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మీడియా కంట పడలేదు. సోషల్‌ మీడియాలో కూడా ఎలాంటి అప్డేట్‌ ఇవ్వలేదు. వరల్డ్‌ కప్‌ ఆడిన చాలా మంది ఆటగాళ్లకు రెస్ట్‌ ఇచ్చిన సెలెక్టర్లు.. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలో యంగ్‌ టీమ్‌ను ఎంపిక చేశారు. ఈ యంగ్‌ టీమిండియా సైతం అద్భుతం ప్రదర్శన కనబరస్తోంది. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన యువ భారత్‌.. మూడో మ్యాచ్‌లో ఓటమి పాలైనా.. బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. ఇక ఆస్ట్రేలియాతో సిరీస్‌ తర్వాత.. టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది.

డిసెంబర్‌ 10 నుంచి జనవర్‌ 7, 2024 వరకు సౌతాఫ్రికాలో పర్యటించనుంది భారత జట్టు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌ ఆడని ఆటగాళ్లంతా సౌతాఫ్రికాతో సిరీస్‌కు అందుబాటులోకి రానున్నారు. ప్రొటీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది టీమిండియా. అయితే.. ఈ సిరీస్‌లోని వైట్‌ బాల్‌ మ్యాచ్‌లకు తనను పరిగణంలోకి తీసుకోవద్దని విరాట్‌ కోహ్లీ బీసీసీఐని కోరినట్లు సమాచారం. టీ20లు, వన్డేలకు తనకు రెస్ట్‌ ఇవ్వాలని కోహ్లీ కోరినట్లు తెలుస్తుంది. టెస్టు సిరీస్‌ మాత్రం అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడట. వరల్డ్‌ కప్‌ పోయిన బాధ నుంచి కోలుకునేందుకు తనకు మరింత సమయం కావాలని కోహ్లీ భావిస్తున్నాడేమో అని క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. మరి కోహ్లీ టీ20లు, వన్డేలకు దూరంగా ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి