iDreamPost

వీడియో: పిలిచి మరీ ఆవేశ్‌ ఖాన్‌కు వార్నింగ్‌ ఇచ్చిన కోహ్లీ! కారణం ఇదే!

  • Published Apr 06, 2024 | 2:28 PMUpdated Apr 06, 2024 | 2:28 PM

Virat Kohli, Avesh Khan, RCB vs RR: ఆర్సీబీ వర్సెస్‌ ఆర్‌ఆర్‌ మ్యాచ్‌కి ముందు విరాట్‌ కోహ్లీ ఆవేశ్‌ఖాన్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌ అవుతోంది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Virat Kohli, Avesh Khan, RCB vs RR: ఆర్సీబీ వర్సెస్‌ ఆర్‌ఆర్‌ మ్యాచ్‌కి ముందు విరాట్‌ కోహ్లీ ఆవేశ్‌ఖాన్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌ అవుతోంది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 06, 2024 | 2:28 PMUpdated Apr 06, 2024 | 2:28 PM
వీడియో: పిలిచి మరీ ఆవేశ్‌ ఖాన్‌కు వార్నింగ్‌ ఇచ్చిన కోహ్లీ! కారణం ఇదే!

ఐపీఎల్‌ 2024లో భాగంగా శనివారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం ఆర్సీబీ టీమ్‌ రెండు రోజుల ముందే జైపూర్‌ చేరుకుని ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది. ఈ ప్రాక్టీస్‌ సెషన్‌లో విరాట్‌ కోహ్లీ.. రాజస్థాన్‌ బౌలర్‌ ఆవేశ్‌ ఖాన్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాక్టీస్‌ కోసం గ్రౌండ్‌లోకి వచ్చిన కోహ్లీని.. ఆర్సీబీ మాజీ ఆటగాడు, ప్రస్తుతం రాజస్థాన్‌లో బాగా రాణిస్తున్న యుజ్వేంద్ర చాహల్‌ వెళ్లి కలిసి మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలోనే కొంతదూరంలో కోహ్లీకి ఆవేశ్‌ ఖాన్‌ కనిపించాడు.

వెంటనే ఆవేశ్‌ను ఇటు రా అంటూ వేలు చూపిస్తూ పిలిచిన కోహ్లీ.. రాగానే.. ‘ఇలాంటి ఛాన్స్‌ మళ్లీ రాదు’ అంటూ హిందీలో చెబుతూ.. ఆవేశ్‌ను హగ్‌ చేసుకున్నాడు. అయితే.. నవ్వుకుంటూనే ఆవేశ్‌కు కోహ్లీ గట్టి వార్నింగ్‌ ఇచ్చాడని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. ఇంతకీ ఆవేశ్‌కు కోహ్లీ ఎందుకు వార్నింగ్‌ ఇస్తాడనే డౌట్‌ చాలా మందికి ఉండి ఉంటుంది. దాని కోసం ఐపీఎల్‌ 2023 సీజన్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఆ సీజన్‌లో విరాట్‌ కోహ్లీ-నవీన్‌ ఉల్‌ హక్‌, విరాట్‌ కోహ్లీ-గంభీర్‌ మధ్య జరిగిన గొడవ గుర్తుండే ఉంటుంది. ఆ గొడవ తీవ్ర వివాదాస్పదమైంది. అయితే.. ఆ గొడవ మొదలు కావడానికి కారణం మాత్రం ఆవేశ్‌ ఖాన్‌ విషయం చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది.

ఐపీఎల్‌ 2023 సీజన్‌లో ఆర్సీబీ, లక్నో మధ్య రెండు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో లక్నో థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. ఆ సమయంలో క్రీజ్‌లో ఉన్న ఆవేశ్‌ ఖాన్‌ హెల్మెట్‌ను నేలకేసి కొట్టాడు. అది కోహ్లీకి కోపం తెప్పించింది. అందుకే లక్నో అంటే కోహ్లీకి మండిపోయేది. ఆ కోపంతోనే నవీన్‌ ఉల్‌ హక్‌తో గొడవకు దిగాడు కోహ్లీ. నవీన్‌తో వివాదం సమసిపోయినా.. ఆవేశ్‌ ఖాన్‌కు బుద్ధి చెప్పాలనే కసి మాత్రం ఇంకా కోహ్లీలో ఉందని క్రికెట్‌ అభిమానులు అనుకుంటున్నారు. అందుకే ఆర్సీబీ వర్సెస్‌ ఆర్‌ఆర్‌ మ్యాచ్‌కి ముందు ఇలాంటి ఛాన్స్‌ మళ్లీ రాదంటూ ఆవేశ్‌కు కోహ్లీ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చినట్లు ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ వర్సెస్‌ ఆవేశ్‌ ఫైట్‌ ఎలా ఉండబోతుందో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి