iDreamPost

ఎగిరే హోట‌ల్, నేల మీద‌కు దిగ‌దు, 5000 మంది క‌ష్ట‌మ‌ర్ల‌కు ఆకాశంలో ల‌గ్జీరీ

ఎగిరే హోట‌ల్, నేల మీద‌కు దిగ‌దు, 5000 మంది క‌ష్ట‌మ‌ర్ల‌కు ఆకాశంలో ల‌గ్జీరీ

ఇది పెద్ద విమానం. అందులో బిగ్ హోట‌ల్. అక్క‌డే స్విమ్మింగ్ పూల్స్, మూవీ థియేట‌ర్లు, లగ్జ‌రీ రూమ్స్,
ఎలివేట‌ర్లు అన్నీ. ఒక‌సారి ఎగిరిందంటే సంవ‌త్స‌రాలు ఆకాశంలో తిరుగుతూనే ఉంటుంది. మ‌రి ఫ్యూయ‌ల్ సంగ‌తేంటి? న్యూక్లియ‌ర్ ఎన‌ర్జీతో న‌డుస్తుంది. కాబ‌ట్టి, నో ప్రొబ్ల‌మ్.

విన‌డానికి ఇదో సైన్స్ ఫిక్ష‌న్ స్టోరీలాగే ఉన్నా, ఇది నిజం చేయాల‌ని ఇప్ప‌టికే డిజైన్ కంప్లీట్ చేశారు. ఇది స్లీక్ డిజైన్. క‌మ‌ర్షియ‌ల్ విమానంలాగే ఉంటుంది. కాని ప్ర‌తి అంగుళం ల‌గ్జ‌రీ. ఈ విమానంలో బాల్క‌నీలు, చుట్టూ చూడ‌టానికి డోమ్స్ ఉంటాయి. న‌క్ష‌త్రాల‌ను చూడ‌టానికి ఇంత‌కుమించిన అవ‌కాశం ఎక్క‌డుంటుంది?


ఇంజ‌న్ సౌండ్ త‌క్కువ‌. కార‌ణం న్యూక్లియ‌ర్ ఫ్యూజ‌న్ రియాక్ట‌ర్. ఇంధ‌నాన్ని నింపుకోవ‌డం కోసం నేల మీద దిగాల్సిన అవ‌స‌ర‌మేలేదు.

ఈ అణుశ‌క్తితో న‌డిచే ఎగిరే హోట‌ల్ లో, జిమ్ ఉంది. ఒకేసారి వంద మంది స్విమ్ చేయ‌డానికి పెద్ద స్వ‌మ్మింగ్ పూల్. ఒకేసారి ఇందులో 5000 మంది ఉండొచ్చు. అదికూడా ల‌గ్జీరీగా.

డిజైన్ ను చూస్తుంటే ఇది మెగా క్రూయిజ్ షిప్ కి, బిగ్ స్పేష్ స్టేష‌న్ కి మ‌ధ్య‌గా ఉంది. అందుకే దీన్ని స్కై క్రూయిజ్ అని కూడా అంటున్నారు. దీన్ని ఇంజ‌నీర్ హ‌స‌మ్ అల్ గ‌యిలీ డిజైన్ చేశారు. ఇదే భ‌విష్య‌త్తు ట్రాన్స్ పోర్ట్ కూడా అని చెబుతున్నారు.

ఈ స్కై క్రూయిజ్ లో పెద్ద ఎంట‌ర్ టైన్మెంట్ డెస్క్ ఉంటుంది. ఇది షాపింగ్ మాల్స్, బార్స్, స్పోర్ట్స్ సెంట‌ర్లు, సినిమా థియేట‌ర్లు, ప్లే గ్రౌండ్స్, భూమ్మీదున్నవాళ్ల‌తో మాట్లాడ‌టానికి కాన్ఫ‌రెన్స్ సెంట‌ర్ కూడాఉంది.


ఎలా ప‌నిచేస్తుంది?
ఇది న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్డ్ మీద న‌డిచే ఇంజ‌న్. ఫ్యూజ‌న్ రియాక్ట‌ర్ విమానంలోపే ఉంటుంది. ఈ విమానం నేల మీద దిగ‌దు. ఎవ‌రైన భూమ్మీద‌కు వెళ్లాలంటే వేరే ఫ్ల‌యిట్ ఉంటుంది. అందులోంచి కింద‌కు దిగుతారు. మ‌ళ్లీ పైకి వ‌స్తారు. మ‌రి ఇంత పెద్ద హోట‌ల్ ఆకాశంలో న‌డుస్తుందా? అందుకే క‌నీసం 20 జెట్ ఇంజ‌న్లను వాడ‌తారు.


ఏమైనా స‌మ‌స్య‌లొచ్చినా, వేరే ఫ్లైట్ నుంచి మెకానిక్స్ వ‌స్తారు. గాల్లోనే మ‌ర‌మ్మ‌త్తులు చేస్తారంట‌. అంతా ఆర్టిఫియ‌ల్ ఇంటిలిజెన్స్ తో నడుస్తుందికాబ‌ట్టి, ఎక్క‌డ స‌మ‌స్య వ‌చ్చినా ముందుగానే తెలిసిపోతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి