iDreamPost

వినయ విధేయ రామలో నటించిన ఈ చిన్నారి గుర్తున్నాడా.. బోయపాటికి ఏమవుతాడంటే!

  • Published Jul 07, 2023 | 1:33 PMUpdated Jul 07, 2023 | 1:33 PM
  • Published Jul 07, 2023 | 1:33 PMUpdated Jul 07, 2023 | 1:33 PM
వినయ విధేయ రామలో నటించిన ఈ చిన్నారి గుర్తున్నాడా.. బోయపాటికి ఏమవుతాడంటే!

రామ్ చరణ్ హీరో గా నటించిన వినయ విధేయ రామ సినిమా గుర్తుందా.. రంగస్థలం సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుని.. బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన రామ్‌ చరణ్‌.. ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో ఫుల్‌ లెంత్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కి సైన్‌ చేశాడు. అదే.. వినయ విధేయ రామ చిత్రం. సిక్స్‌ ప్యాక్‌ బాడీతో.. బీభత్సమైన యాక్షన్‌ సీన్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద మాత్రం బోల్తా కొట్టింది. యాక్షన్‌ ఎలిమెంట్స్‌ కాస్త అతి అయ్యాయనే అభిప్రాయం సర్వత్రా వినిపించింది. మరోసారి బోయపాటి మార్క్‌ యాక్షన్‌ అందరు హీరోలకు సెట్‌ అవ్వదని ఈ చిత్రం నిరూపించింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. దీనిలో నటించిన కొందరు నటీనటులకు విపరీతమైన గుర్తింపు వచ్చింది.

అంతేకాక స్నేహ, సీనియర్‌ హీరో ప్రశాంత్‌లకు ఈ సినిమా సెకండ్‌ ఇన్నింగ్స్‌ అని చెప్పవచ్చు. అంతేకాక ఈ సినిమా వల్ల ఓ బుల్లి నటుడు టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ఆ చిన్నారి ఎవరంటే.. వినయ విధేయ రామలో.. రామ్‌ చరణ్‌ చిన్నప్పటి పాత్రలో నటించిన బుడ్డోడు. సినిమా తర్వాత ఈ చిచ్చర పిడుగు చాలా పాపులర్‌ అయ్యాడు. వరుస అవకాశాలు అందుకున్నాడు. మరి ఇంతకు ఈ బుడ్డోడు ఎవరు.. ఏవైనా బ్యాగ్రౌండ్‌ ఉందా అంటే..

వినయ విధేయ రామ చిత్రంలో.. రామ్ చరణ్ చిన్నప్పటి క్యారెక్టర్ పోషించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు రోషన్. సినిమా పెద్దగా హిట్ కాకపోయినా ఈ బుడ్డోడు మాత్రం మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. మాస్‌, యాటిట్యూడ్‌ లుక్‌తో ఆకట్టుకున్నాడు. సినిమా కథ ప్రకారం.. ఈ బుడ్డోడు బాల్యంలోనే అన్నల కోసం విలన్స్‌తో వీర రేంజ్‌లో ఫైట్‌ చేయడం.. వారిని కాపాడటం చేస్తాడు. అన్నాళ్లు తాను ఒక్కడు మాత్రమే చదువుకోగా.. ఆ తర్వాత నుంచి.. అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను అంటూ మొండిగా, యాటిట్యూడ్‌తో చెప్పే డైలాగ్‌ హైలైట్.

ఈ సీన్‌లో బుడ్డోడి ఎక్స్‌ప్రెషన్స్‌ చాలా నాచురల్‌గా అనిపిస్తాయి. మరి అంత చిన్న వయసులోనే తన యాక్టింగ్‌తో అదరగొట్టిన ఈ బుడ్డోడు.. దర్శకుడు బోయపాటికి బంధువు అవుతాడని చాలా మందికి తెలియదు. ఈ చిచ్చర పిడుగు పేరు రోషన్‌ రాయ్‌.. బోయపాటి, కజిన్‌ కొడుకు. చిన్నప్పటి నుంచే రోషన్‌కు కెమెరా ముందుకు రావడం అంటే సరదానట. అందుకే ఈ సినిమాలో చిన్న రోల్ ఇచ్చారు. కానీ మనోడు జీవించేసాడు. దాంతో ఈ చిన్నారి క్రేజ్‌ పెరగడం మాత్రమే కాక.. వరుస అవకాశాలు అందకుంటున్నాడు.

ఈ సినిమా తర్వాత రోషన్‌ కళ్యాణ వైభోగమే అనే సీరియల్‌లో నటించి అందరి ప్రశంసలు పొందాడు. ఈ సీరియల్‌లో రోషన్‌.. చారుకేశ పాత్రలో నటించాడు. ఇదే కాకుండా కొన్ని టాలీవుడ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా చేస్తున్నాడు. అయితే ఈ బుడ్డోడు బోయపాటికి బంధువు అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ చిన్నారికి మరిన్ని మంచి పాత్రలు రావాలని కోరుకుంటున్నారు. టాలీవుడ్‌లో మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి