iDreamPost

వీర్రాజు గారు ఇది విన్నరా..?

వీర్రాజు గారు ఇది విన్నరా..?

ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలనుకుంటున్న బీజేపీ ఆ దిశగా రాజకీయాలు చేస్తోంది. ఉన్న ఇద్దరిలో ఒకరి స్థానంలోకి వెళ్లడం తప్పా.. మూడో ప్రత్యామ్నాయం తెలుగు రాష్ట్రాలలో లేదన్నది సుష్పష్టం. తెలంగాణలో ఇది రుజువైంది కూడా. అక్కడ కాంగ్రెస్‌ స్థానంలోకి బీజేపీ వచ్చే ప్రయత్నాలు విజయవంతంగా సాగుతున్నాయి. అదే క్రమంలో ఏపీలోనూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ స్థానంలోకి బీజేపీ రావాలని లక్ష్యాలు పెట్టుకుంది. ఆ పార్టీ నేతలు బహిరంగంగానే తమ లక్ష్యాలను ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీ స్థానం ఖాళీ గా ఉందని దాన్ని తాము భర్తీ చేయబోతున్నామంటూ రామ్‌ మాధవ్‌ నుంచి సోము వీర్రాజు వరకూ అందరూ ప్రకటనలు చేశారు. అందుకు తగినట్లుగానే రాజకీయాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని సందర్భానుసారంగా విమర్శలు చేస్తున్నారు.

ముఖ్యంగా ఏపీలో ఇటీవల కాలంలో తరచూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. సంక్షేమ పథకాల ప్రారంభ సమయంలోనే ఇవి జరుగుతుండడం విశేషం. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌ను, వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోంది. అయితే హిందుత్వం తమ పేటెంట్‌ అని భావించే బీజేపీకి టీడీపీ తీరు ఏ మాత్రం నచ్చడం లేదు. దీంతో దేవాలయాలు, దాడులు అనే మాటలు టీడీపీ నుంచి వచ్చిన ప్రతిసారి బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయవాడలో కూల్చిన దేవాలయాలు, జరిగిన అపచారాలను గుర్తు చేస్తున్నారు. విజయవాడలో 40 దేవాలయాలను చంద్రబాబు ప్రభుత్వంలో కూల్చారు. హిందువుల మనోభావాలు దెబ్బతీనేలా గుళ్లను కూల్చడం, దేవాతామూర్తుల విగ్రహాలను మున్సిపాలిటీ చెత్త వాహనాల్లో తరలించడం అందరికీ గుర్తుంది.

అయితే దేవాలయాలను కూల్చిన విషయంపై బీజేపీ తరచూ తనను లక్ష్యంగా చేసుకోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఓకింత ఇబ్బంది పడుతున్నారు. సరైన సమయం కోసం ఎదురుచూసిన చంద్రబాబు.. ఈ దుశ్చర్యలను తాజాగా బీజేపీపైకి నెట్టారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పడంతోనే విజయవాడలో దేవాలయాలు కూల్చామని తెలిపారు. ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి అడ్డుగా ఉన్న దేవాలయాలను గడ్కరీ ఆదేశాలతోనే తొలగించామని బంతిని బీజేపీ కోర్టులో వేశారు. నిన్న మొన్నటి రామతీర్ధం ఘటన వరకూ విజయవాడలోని దేవాలాయల కూల్చివేతపై చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన సోము వీర్రాజు.. తాజాగా బాబు మాటాలు విన్నారా..? వింటే సోము వీర్రాజు స్పందన ఎలా ఉంటుందో..? చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి