iDreamPost
android-app
ios-app

నేనూ హీరోనే.. అలా చేయమంటే ఎలా? విజయ్ సేతుపతి షాకింగ్ నిర్ణయం!

  • Author Soma Sekhar Published - 04:00 PM, Fri - 24 November 23

విజయ్ సేతుపతి.. నచ్చితే ఎలాంటి పాత్రలు చేయడానికైనా ముందుండే యాక్టర్. తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. నేనూ హీరోనే.. అలా నన్ను చేయమంటే ఎలా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

విజయ్ సేతుపతి.. నచ్చితే ఎలాంటి పాత్రలు చేయడానికైనా ముందుండే యాక్టర్. తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. నేనూ హీరోనే.. అలా నన్ను చేయమంటే ఎలా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

  • Author Soma Sekhar Published - 04:00 PM, Fri - 24 November 23
నేనూ హీరోనే.. అలా చేయమంటే ఎలా? విజయ్ సేతుపతి షాకింగ్ నిర్ణయం!

ఇండస్ట్రీలో ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి నటించే నటీ, నటులు చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పాలి. అలాంటి నటుల్లో ముందు వరుసలో ఉంటారు తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. ఓ వైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు విలన్ రోల్స్ తో మెప్పిస్తున్నాడు ఈ డైనమిక్ యాక్టర్. ఇక ఇతడి యాక్టింగ్ కు ఇండియా వైడ్ గా అభిమానులు ఉన్నారు. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ.. ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు విజయ్ సేతుపతి. నచ్చితే ఎలాంటి పాత్రలు చేయడానికైనా ముందుండే ఈ స్టార్ యాక్టర్.. తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. నేనూ హీరోనే.. అలా నన్ను చేయమంటే ఎలా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

విజయ్ సేతుపతి.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న విలక్షణ నటుల్లో ఒకడు. కథ నచ్చితే చాలు ఎలాంటి పాత్రలో నటించడానికైనా సిద్దంగా ఉంటాడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ.. దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నాడు. ఒక పక్క హీరోగా నటిస్తూనే.. మరో పక్క విలన్ గా మెప్పిస్తున్నాడు ఈ స్టార్ యాక్టర్. విలన్ గా అద్భుతమైన నటన కనబరుస్తుండటంతో.. ఎక్కువగా అలాంటి పాత్రలే వస్తున్నాయట. దీంతో ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఇటీవల ఓ ఈవెంట్ లో పాల్గొని విలన్ రోల్స్ చేయడం గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

విజయ్ సేతుపతి మాట్లాడుతూ..”విలన్ పాత్రలు చేయడం నాకు తప్పుగా అనిపించడం లేదు. ఎలాంటి పాత్రకైనా నేను వందకు వందశాతం న్యాయం చేయాలనే చూస్తా. అయితే అందులో నాకు కొన్ని పరిమితుల విధిస్తారు. నువ్వు హీరోని మించి చేయెుద్దని చెప్పి నన్ను కంట్రోల్ చేస్తుంటారు. దాని వల్ల నేను మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతున్నాను. అందుకే కొన్ని రోజులు అలాంటి పాత్రలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంటే విలన్ రోల్స్ కు కొన్ని రోజులు విరామం ప్రకటించాడు ఈ విలక్షణ నటుడు. ఇక ఈ నిర్ణయంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి తమ అభిమాన నటుడిని హీరోగా చూస్తామని ఖుషీ అవుతున్నారు. మరి విజయ్ సేతుపతి తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbet