iDreamPost

‘మామ’ దర్శకుడికి ‘మెగా’ ఆఫర్

‘మామ’ దర్శకుడికి  ‘మెగా’ ఆఫర్

మెగాస్టార్ చిరంజీవి కొత్త జనరేషన్ దర్శకులతో చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150కి కంబ్యాక్ ఇస్తున్న సమయంలో సీనియారిటీనే నమ్ముకుని వివి వినాయక్ ని అవకాశం ఇచ్చిన చిరు ఆ తర్వాత సైరా లాంటి రిస్కీ ప్రాజెక్ట్ ని సురేందర్ రెడ్డి చేతిలో పెట్టిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్ లో ఫెయిల్ అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్లు రాబట్టి నష్టాలు గట్టిగానే తగ్గించేసింది. ప్రస్తుతం కొరటాల శివతో ఆచార్య చేస్తున్న చిరు ఇది కాగానే లూసిఫర్ రీమేక్ పనిలో పడతారు.

సాహో ఫేం సుజిత్ కు ఆ బాధ్యతలు ఇచ్చినట్టు టాక్ ఉంది కాని అధికారికంగా ప్రకటన రాలేదు. కరోనా గోల సద్దుమణిగాక ఇవ్వొచ్చు. ఇదిలా ఉండగా 154కి సైతం రంగం సిద్ధమవుతున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. గత ఏడాది వెంకీ మామతో ఓ మోస్తరు కమర్షియల్ హిట్ అందుకున్న బాబీ అలియాస్ రవీంద్ర చెప్పిన లైన్ నచ్చడంతో ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినికిడి. ఇదీ అఫీషియల్ గా వచ్చిన న్యూస్ కాదు. లూసిఫర్ రీమేక్ విషయంలో వినాయక్ తో పాటు బాబీ పేరు కూడా కొంత కాలం వినిపించింది. కాని ఎందుకో మరి బాబీ కొత్త స్టొరీని ఓకే చేయించుకున్నట్టున్నాడు .

బాబీ ట్రాక్ రికార్డు మరీ గొప్పగా లేకపోయినా కమర్షియల్ ఎంటర్ టైనర్స్ ని బాగా డీల్ చేస్తాడని పేరుంది. రవితేజ పవర్ సూపర్ హిట్ కాగా పవన్ తో సర్దార్ గబ్బర్ సింగ్ దారుణంగా నిరాశ పరిచింది. జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ అద్భుతాలు చేయలేదు కాని తారక్ కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ గ్రాసర్ గా మిగిలిపోయింది. పూరి లాంటి మహా మహా సీనియర్లే మెగాస్టార్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో బాబీని ఈ అవకాశం దక్కడం నిజంగా అదృష్టమే. మరి నిజంగా 154ని అతని చేతుల్లో పెడుతున్నారా లేదా అనేది కరోనా గోల పూర్తిగా వదిలిపోయాక చూడాలి మరి. వచ్చే రెండేళ్లకు సరిపడా బిజీ షెడ్యూల్ ని చిరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకున్నట్టు ఈ దూకుడుని బట్టి అర్థమవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి