iDreamPost

Daggubati Brothers : సురేష్ వెంకీలు రైట్ అని ఋజువు చేశారు

Daggubati Brothers : సురేష్ వెంకీలు రైట్ అని ఋజువు చేశారు

ఎవరెన్ని విమర్శలు చేసినా తమ మీద అభిమానుల్లో అసంతృప్తి చెలరేగుతుందని తెలిసినా నారప్ప, దృశ్యం 2 విడుదల విషయంలో దగ్గుబాటి సోదరులు తీసుకున్న నిర్ణయాలు ఎంత చక్కని ఫలితాలను ఇచ్చాయో కళ్లారా చూస్తున్నాం. స్వతహాగా అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన సురేష్ బాబు తన సినిమాలనే ఓటిటికి ఇవ్వడం ఏంటనే ప్రశ్న తలెత్తినప్పటికీ ఆయన వాటిని కేర్ చేయలేదు. బిజినెస్ కోణంలో లెక్కలు చూసుకుని, లాభనష్టాలు బేరీజు వేయించి తనతో భాగస్వామ్యంలో ఉన్న ప్రొడ్యూసర్ల పెట్టుబడికి రక్షణ కల్పించి ఫైనల్ గా డిజిటల్ కే ఓటు వేయడం ద్వారా అన్ని రకాలుగా ఖచ్చితమైన ప్రయోజనం పొందారని చెప్పొచ్చు.

ప్రాక్టికల్ గా చూస్తే నారప్ప, దృశ్యం 2లు రెండూ ఓటిటిలో సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఇవే థియేటర్లలో వచ్చి ఉంటే ఎంత షేర్ సాధించేవి అని విశ్లేషించుకుని చూస్తే మాత్రం సమాధానం పాజిటివ్ గా రాదు. ఎందుకంటే కంటెంట్ బలంగానే ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి ఒక్కొక్కటి 30 కోట్ల షేర్ తెచ్చేంత సీన్ లేదు. అంటే గ్రాస్ 40 కోట్లకు పైగానే రావాలి. ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా పూర్తి స్థాయిలో హాళ్లకు రావడం లేదు. లవ్ స్టోరీ అంత హంగామా చేసినా నలభైని టచ్ చేయలేకపోయింది. కులవివక్ష మీద రూపొందిన నారప్ప లాంటి రా విలేజ్ డ్రామాలు అంత మొత్తాన్ని రాబట్టడం అసాధ్యం. అందుకే డిజిటల్ లో హిట్టు కొట్టింది.

ఇక దృశ్యం 2 సంగతి చూసినా కూడా సెకండ్ హాఫ్ చివరి గంటకు మాత్రమే గట్టి ప్రశంసలు దక్కుతున్నాయి. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగిందనే కంప్లయింట్స్ లేకపోలేదు. ఇదే టాక్ థియేటర్ నుంచి బయటికి వస్తే దాని ప్రభావం వసూళ్ల మీద గట్టిగా ఉంటుంది. కేరళలో పాత రికార్డులు పాతిపెట్టిన దృశ్యం 1 తెలుగు రీమేక్ లో సూపర్ హిట్ అనిపించుకుందే తప్ప కలిసుందాం రా రేంజ్ లో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. అలాంటప్పుడు దృశ్యం 2 అద్భుతాలు చేసేదేమో అని ఊహించుకోవడం అత్యాశే. అందుకే వెంకటేష్ చాలా స్పష్టంగా తన బాధ్యత అయ్యాక విడుదల ప్రయోజనాలు నిర్మాతకే వదిలేస్తానని చెప్పడం గమనార్హం.

Also Read : Radhe Shyam : అన్నివైపులా ఒత్తిడిలో ప్రభాస్ బృందం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి