iDreamPost

వెంకయ్య ప్రశంస – టిడిపి మీమాంస

వెంకయ్య ప్రశంస – టిడిపి మీమాంస

కరోనా నియంత్రణ చర్యల్లో ఏపీ భేష్ అంటూ ఉపరాష్ట్రపతి మెచ్చుకోలు …

సాధారణంగా ఒక కుటుంబంలోని వ్యక్తులుగా కలసి మెలసి మెలుగుతూ కష్టసుఖాల్లో నిత్యం కలసి సాగే వాళ్ళు తమ వ్యతిరేకులు ఎవరైనా ఉన్నా తమ ఉమ్మడి టార్గెట్ గానే భావిస్తారు. ఈ విషయంలో ఇద్దరి అభిప్రాయాల్లోనూ మార్పులు ఉండవు. ఆ ఇద్దరిలో ఒకరికి వేరే ఎవరితో అయినా పోసగలేదు అంటే సదరువ్యక్తి ఆటోమేటిగ్గా రెండో ఆయనకు కూడా శత్రువు అవుతాడు. కానీ ఏపీలో తాజాగా చోటుచేసుకున్న పరిణామం టిడిపికి ఇబ్బందికరంగా మారాయి.

రాష్ట్రములో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి, బాధితులను ఆదుకునే విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన శక్తిమేరకు సర్వీస్ అందిస్తోంది. లాక్ డవున్ ను పక్కాగా అమలు చేయడమే కాకుండా ఇంటింటి సర్వే పేరిట గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటిని తడుతూ అనుమానితులను గుర్తించి ఆస్పత్రులకు పంపుతున్నారు. అవసరమైన దానికన్నా ఎక్కువే క్వారంటేయిన్ సెంటర్లు పెట్టి ఏ మాత్రం అనుమానం ఉన్నవారిని కూడా వదలకుండా వారిని క్వారంటేయిన్ కేంద్రాలకు పంపడం లేదా హోమ్ క్వరంటయిన్ లో ఉంచడం వంటి చర్యల ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధిస్తున్నారు. ఈ విషయమై జాతీయ మీడియా ఎన్డీటీవి తోబాటు టైమ్స్ నౌ చానెళ్లు సర్వే చేపట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు భేష్ అంటూ కితాబిచ్చాయి. కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.

ఇది కాకుండా మెడ్ టెక్ లో తయారైన ట్రూ నాట్ టెస్టింగ్ కిట్స్ ద్వారా డ్యాండం టెస్టులు చేస్తూ పరిస్థితి తీవ్రతను గమనిస్తున్నారు. ఈ కిట్ల ద్వారా గంటలోనే ఫలితం తేలిపోతుండడంతో ఏమాత్రం పాజిటివ్ కేసు వచ్చినా వెంటనే ఆస్పత్రికి తరలిస్తున్నారు. దీంతోబాటు దక్షిణ కొరియా నుంచి ఒక లక్ష రాపిడ్ టెస్ట్ కిట్స్ దిగుమతి చేసుకుని పదినిముషాల్లోనే టెస్ట్ ఫలితాలు తెలుసుకుని వెనువెంటనే పాజిటివ్ కేసులను ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. దీంతో కేసుల సంఖ్య పెరగడం తగ్గింది.

ఇదే విషయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. వైరస్ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని, ర్యాపిడ్ టెస్ట్ కిట్లు దక్షిణ కొరియా నుంచి తీసుకురావడం కూడా మంచి నిర్ణయమేనని కొనియాడారు. అయితే మరోవైపు చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటూనే రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. తరచూ లేఖలు రాస్తూ ప్రభుత్వం యేమి చేయడం లేదని, ఆన్నిటా ఫెయిల్ అయిందని ఆరోపిస్తున్నారు. ఇక టీడీపీ నాయకులు బుద్ధ వెంకన్న, యనమల వగైరాలు అయితే గావుకేకలు పెడుతున్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం లేదని ఒకసారి కేసుల సంఖ్య తక్కువ చూపుతున్నారని ఇంకోసారి ఇలా రకరకాలుగా మాట్లాడుతూ పబ్బం గడుపుతున్నారు. ఇలాంటి తరుణంలో తమకు దశాబ్దాల కాలంగా మద్దతుదారుగా ఉంటూ వస్తున్న వెంకయ్యనాయుడు ఒక్కసారిగా ప్రభుత్వం మీద ప్రశంసలు కురిపించడంతో టిడిపి నేతలకు గొంతులో వెళక్కాయ పడినట్లు అయింది.

తాము దుమ్మెత్తి పోస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని సాక్షాత్తు ఉపరాష్ట్రపతి కొనియాడడంతో తాము ఏమి చేయాలన్నది టిడిపి నేతలకు పాలుపోవడం లేదు. కష్టకాలంలో రాష్ట్రానికి దూరంగా ఉంటూ ప్రభుత్వం మీద విమర్శలు చేయడంతో చంద్రబాబు పట్ల కూడా ప్రజల్లో కాస్త ఏహ్యభావన ఏర్పడింది. ఈ తరుణంలో వెంకయ్యనాయుడు చేసిన కామెంట్లు ఇటు ప్రభుత్వానికి నైతిక బలాన్నివ్వగా టిడిపి క్యాడర్లో నిరుత్సాహానికి కారణమయ్యాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి