iDreamPost
android-app
ios-app

Chitram Chudara OTT: డైరెక్ట్‌గా OTTలోకి వరుణ్ సందేశ్ కొత్త సినిమా! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

  • Published May 06, 2024 | 10:58 AM Updated Updated May 06, 2024 | 10:58 AM

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి కొత్త కొత్త చిత్రాలు వచ్చేస్తున్నాయి. థియేటర్ లో రిలీజ్ అయినవే కాకుండా కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీ లోనే రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో మరొక సరికొత్త చిత్రం నేరుగా ఓటీటీ లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయిపొయింది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి కొత్త కొత్త చిత్రాలు వచ్చేస్తున్నాయి. థియేటర్ లో రిలీజ్ అయినవే కాకుండా కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీ లోనే రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో మరొక సరికొత్త చిత్రం నేరుగా ఓటీటీ లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయిపొయింది.

  • Published May 06, 2024 | 10:58 AMUpdated May 06, 2024 | 10:58 AM
Chitram Chudara OTT: డైరెక్ట్‌గా OTTలోకి వరుణ్ సందేశ్ కొత్త సినిమా! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

సినిమాలంటే థియేటర్ లో మాత్రమే చూడాలి అనుకునే రేంజ్ నుంచి ఇప్పుడు సినిమాలన్నిటిని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు అనే రేంజ్ వరకు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ఓటీటీ లో సందడి చేస్తూనే ఉన్నాయి. కొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీ లోకి వస్తుంటే మరికొన్ని సినిమాలు నేరుగా ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో మరొక కొత్త సినిమా నేరుగా ఓటీటీ లో రిలీజ్ కానుంది. మరి ఆ సినిమా ఏంటి ఎక్కడ రిలీజ్ కాబోతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఆ సినిమా మరేదో కాదు వరుణ్ సందేశ్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “చిత్రం చూడరా”. ఈ సినిమాను నేరుగా ఓటీటీ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట మేకర్స్. ఈ క్రమంలో తాజాగా చిత్రబృందం వరుణ్ సందేశ్, ధనరాజ్, కాశీ విశ్వనాథ్ ఉన్న ఓ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చింది. కాగా ఈ సినిమాలో వరుణ్ సందేశ్ కు జోడిగా శీతల్ భట్ హీరోయిన్‍గా నటించారు. వారితో పాటు రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, ధనరాజ్, కాశీ విశ్వనాథ్, శివాజీ రాజా, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ, రచ్చ రవి ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను“ఈవారం ఈ చిత్రం చూడరా.. ‘చిత్రం చూడారా’ సినిమా మే 9న ప్రీమియర్ కానుంది” అని ట్వీట్ చేస్తూ.. ఈటీవీ విన్ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది.

ఇక వరుణ్ విషయానికొస్తే.. కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్ సినిమాలతో యూత్ లో మంచి పాపులర్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వరుణ్ చేసిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులలో అంతగా ఆదరణ దక్కించుకోలేకపోయాయి. కొంతకాలం సినిమాలకు బ్రేక్ తీసుకున్న వరుణ్ ఆ తర్వాత.. జంటగా బిగ్ బాస్ లో దర్శనం ఇచ్చాడు. బిగ్ బాస్ లో తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించి అందరి మన్ననలు పొందాడు. ఇక ఆ తర్వాత వరుణ్ ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల బాట పట్టాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి చిత్రం చూడరా సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişEnbet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom Girişmeritbetjojobetvirüsbetmarsbahis girişJojobet GirişJojobet GirişcasibomHoliganbetCasibom Giriş