iDreamPost

Valimai : అజిత్ ఇక్కడ జెండా పాతగలరా

Valimai : అజిత్ ఇక్కడ జెండా పాతగలరా

రేపు విడుదల కాబోతున్న అజిత్ వలిమై మీద తెలుగు నాట పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. ఇండియన్ బిగ్గెస్ట్ బైక్ ఛేజింగ్ యాక్షన్ డ్రామాని యూనిట్ ఎంతగా ప్రమోట్ చేస్తున్నప్పటికీ మన జనం కనెక్ట్ కావడం లేదు. దానికి తోడు నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అసలు హీరో అజిత్ రాకపోవడం హైప్ కి అడ్డుపడింది. అసలు టైటిలే తెలుగులో పెట్టకుండా నిర్లక్ష్యం వహించిన నిర్మాత బోనీ కపూర్ డబ్బింగ్ లోనూ ఏ మాత్రం శ్రద్ధ తీసుకున్నారో చూడాలి. హ్యూమా ఖురేషి లీడ్ రోల్ పోషించిన ఈ మూవీలో ఆరెక్స్ 100 కార్తికేయ విలన్ గా నటించడం ఇక్కడ బిజినెస్ పరంగా పెద్దగా  హెల్ప్ అవ్వలేదు. తనకే పెద్దగా మార్కెట్ లేదు మరి.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు నైజాం హక్కులు కేవలం 1 కోటికి ఇచ్చేశారు. సీడెడ్ 40 లక్షలు, ఆంధ్ర 1 కోటి 10 లక్షలకు డీల్ చేశారట. అంటే మొత్తం 2 కోట్ల 50 లక్షలు. పైన ఓ ముప్పై లక్షలు అదనంగా వస్తే బ్రేక్ ఈవెన్ దాటేసినట్టు. ఫస్ట్ డే గురువారం కావడంతో చెప్పుకోదగ్గ సంఖ్యలో థియేటర్లు దొరికాయి కానీ రెండో రోజే భీమ్లా నాయక్ రావడంతో వలిమై పరిస్థితి దీనంగా మారనుంది. 25న హైదరాబాద్ నగరం మొత్తం కలిపి కేవలం 5 సింగల్ స్క్రీన్లు మాత్రమే కేటాయించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆ రేంజ్ లో పవన్ మానియా కొనసాగుతోంది. ఏపి తెలంగాణ అభిమానులు పవన్ నామస్మరణలో మునిగి తేలుతున్నారు.

సో వలిమై లక్ష్యం చిన్నదే అయినా చేరుకోవడం మాత్రం ఈజీ కాదు. ఇక్కడ రెండు అంశాలు కీలకం. వలిమైకు సూపర్ హిట్ టాక్ రావాలి. రెండోది భీమ్లా నాయక్ రిపోర్ట్ ఎలా వస్తుందనేది. ఒకవేళ పవన్ కనక గబ్బర్ సింగ్ రేంజ్ హవా నడిపిస్తే వలిమై కోలుకోవడం కష్టం. లేదూ దాంతో పాటు అజిత్ కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే 26 నుంచి లేదా 28 నుంచి స్క్రీన్లు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యలో గంగూబాయ్ కటియావాడి ఉన్నప్పటికీ దాని ప్రభావం వీటి మీద తీవ్రంగా ఉండే ఛాన్స్ లేదు. తెలుగులో మళ్ళీ జెండా పాతాలని చూస్తున్న అజిత్ కు మరి వలిమై ఎలాంటి బ్రేక్ ఇస్తుందో వేచి చూడాలి.

Also Read : Parineeti Chopra : ఇన్నేళ్ల తర్వాత పరిణితి టాలీవుడ్ డెబ్యూ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి