iDreamPost

Ajith: ఆసుపత్రిలో చేరిన అజిత్ ! ఆందోళనలో అభిమానులు

  • Published Mar 07, 2024 | 12:57 PMUpdated Mar 07, 2024 | 12:57 PM

ఈ మధ్య కాలంలో సినీ తారలంతా వారి అభిమానులను కాస్త కంగారు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ స్టార్ నటుడు అజిత్ ఆసుపత్రిలో చేరానని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో సినీ తారలంతా వారి అభిమానులను కాస్త కంగారు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ స్టార్ నటుడు అజిత్ ఆసుపత్రిలో చేరానని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 07, 2024 | 12:57 PMUpdated Mar 07, 2024 | 12:57 PM
Ajith: ఆసుపత్రిలో చేరిన అజిత్ ! ఆందోళనలో అభిమానులు

ప్రముఖ స్టార్ హీరో అజిత్ .. ఇటు తెలుగు చిత్రాలతో పాటు.. హిందీ, తమిళ చిత్రాలలో కూడా నటించి.. బాగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. కేవలం సినిమా పరంగానే కాకుండా బయట కూడా అజిత్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమలో అజిత్ కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. పైగా అజిత్ తన సినీ కెరీర్ ను తెలుగు చిత్రాలాతోనే ప్రారంభించడం విశేషం. అయితే, తాజాగా అజిత్ ఆరోగ్యం గురించి.. సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అజిత్ ఆసుపత్రిలో చేరారంటూ పలు వదంతులు వినిపించాయి. దీనితో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అభిమానులు తమ ఫేవరేట్ హీరో గురించి .. ప్రతి నిత్యం ఆరా తీస్తూనే ఉంటారు. వారికీ సంబంధించిన ప్రతి చిన్న విషయాన్నీ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ .. వాటిని వైరల్ చేస్తూ ఉంటారు. ఇక వారి ఫేవరేట్ తారలకు ఏ చిన్న అనారోగ్యం కలిగిన దాని గురించి కూడా .. ఆందోళన చెందుతూ ఉంటారు. అంతటి అభిమానం కేవలం సినీ తారాలకే దక్కుతుంది. ఇక ఈ క్రమంలో తాజాగా ప్రముఖ నటుడు అజిత్ ఆరోగ్యం గురించి.. అతని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అజిత్ తాజాగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. దీనితో అజిత్ ఆరోగ్యం పట్ల అందరికి ఆందోళన నెలకొంది. కాగా, సినీ వర్గాల నివేదిక ప్రకారం అజిత్ .. కేవలం రెగ్యులర్ చెక్ అప్స్ కోసమే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని .. తెలుస్తోంది. త్వరలోనే అజిత్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కానున్నారు. కాబట్టి ప్రస్తుతం అజిత్ ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక అజిత్ విషయానికొస్తే.. ఈ హీరో తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, ఆంగ్ల భాషలను చాలా సునాయాసంగా మాట్లాడగలడు. యంగ్ హీరోగా కొంతకాలం పాటు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన అజిత్.. ఇప్పుడు ఏజ్ అయిపోవస్తున్నా .. జుట్టు తెల్లబడుతున్నా .. ఏ మాత్రం ఎనర్జీ తగ్గకుండా .. ఆయనకు తగిన పాత్రలను ఎన్నుకుంటూ.. ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకుంటున్నాడు అజిత్. అంతే కాకుండా.. అతను సినీ రంగంలో అడుగు పెట్టేకంటే ముందు .. మొదట ఓ ప్రఖ్యాత రేసర్. దేశంలోనే అత్యుత్తమ డ్రైవర్లలో మూడో స్థానం పొందాడు. ఇక దానికంటే ముందు అజిత్ ఒక బైక్ మెకానిక్ గా తన జీవితాన్ని ప్రారంభించారు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు అజిత్ ఎంతో మంది అభిమానుల .. ఆప్యాయతను పొందాడు. ప్రస్తుతం అజిత్ పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మరి, అజిత్ ఆసుపత్రిలో చేరారని .. అభిమానులు ఆందోళన చెందిన విషయంలో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి