iDreamPost
android-app
ios-app

Thandel: తండేల్ టీం వాలెంటైన్స్ డే స్పెషల్ గిఫ్ట్

  • Published Feb 14, 2024 | 11:57 AM Updated Updated Feb 14, 2024 | 12:25 PM

తండేల్‌ సినిమా నుంచి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల కోసం ఓ ప్రత్యేక బహుమతిని తీసుకొచ్చారు. ఆవివరాలు..

తండేల్‌ సినిమా నుంచి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల కోసం ఓ ప్రత్యేక బహుమతిని తీసుకొచ్చారు. ఆవివరాలు..

  • Published Feb 14, 2024 | 11:57 AMUpdated Feb 14, 2024 | 12:25 PM
Thandel: తండేల్ టీం వాలెంటైన్స్ డే స్పెషల్ గిఫ్ట్

దూత వెబ్‌ సిరీస్‌లో తన నటనతో ఆకట్టుకున్న నాగచైతన్య.. ప్రస్తుతం ‘తండేల్’ అనే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో ఆయన పక్కన సాయి పల్లవి నటించింది. ఇప్పటికే ఈ జోడీ లవ్‌స్టోరీ చిత్రంతో ప్రేక్షకులను అలరించగా.. మరోసారి అదే మ్యాజిక్‌ క్రియేట్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. కొన్ని వారాల క్రితం ఈ సినిమా నుంచి వచ్చిన ‘ఎసెన్స్ ఆఫ్ తండేల్’కు అటు విమర్శకుల నుంచి, ఇటు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.

ఈ సినిమాలో ఒక జాలరి పాత్రలో కనిపించనున్న నాగచైతన్య అద్భుతమైన నటనను ప్రదర్శిస్తారని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉన్నారు. ఇక దర్శకుడు చందూ మొండేటి గ్లింప్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ రెస్పాన్స్ చూసి సంతోషించిన నాగచైతన్య ‘‘తండేల్‌ గ్లింప్స్‌కు మీ నుంచి లభించిన ఆదరణ చూసి నేను థ్రిల్లియ్యాను. దాని మీద మీలో చాలా మంది రీల్స్‌ చేయడం నా మనసును హత్తుకుంది. నేను, సాయి పల్లవి కూడా ఓ రీల్‌ చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రతిరోజు ప్రేమను సెలబ్రేట్‌ చేసుకొండి.. తండేల్‌ నుంచి మీకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.. ’’ అంటూ సాయి పల్లవి, నాగచైతన్య తండేల్‌ గ్లింప్స్‌ మీద చేసిన రీల్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు నాగచైతన్య. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతోంది.” అని సోషల్ మీడియాలో తన  ఆనందాన్ని పంచుకున్నారు.

నాగ చైతన్య చేసిన ఈ వాలెంటైన్స్ డే పోస్ట్ అభిమానులను అలరించింది. ప్రస్తుతం సాయి పల్లవి తన బాలీవుడ్ ప్రాజెక్ట్ షూటింగ్ కోసం జపాన్‌లో ఉండటంతో విదేశాల నుంచే వీడియో రికార్డ్ చేసారు. తండేల్‌ గ్లింప్స్‌లోని సంభాషణను చైతన్య, పల్లవి ఈ రీల్లో రీక్రియేట్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన అద్భుతమైన సంగీతం ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.

ఇటీవలే ఓ కీలక షెడ్యూల్ ను పూర్తి చేసిన చిత్ర బృందం త్వరలోనే తదుపరి షెడ్యూల్ ను ప్రారంభించనుంది. అల్లు అరవింద్ సమర్పణలో రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బన్నీ వాస్ ఈ చిత్రానికి నిర్మాత. షామ్దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్. నవీన్ నూలి ఎడిటర్ గా, కార్తీక్ తీడా కథా రచయితగా వ్యవహరిస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ఆర్ట్ డిజైనర్. కాగా ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş