iDreamPost

అలా జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

అలా జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణలో ఎన్నికల  వేడి మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ ఆ దిశగా కసరత్తు వేగవంతం చేస్తోంది. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పరిశీలించే పనిలో నిమగ్నమైంది. అలానే ఒకే ఇంటికి  ఒక్కే సీటు అనే  చర్చ కాంగ్రెస్ లో జరుగుతోంది. అది కూడా మాజీ టీపీసీసీ ఛీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించే జరగడం గమన్హరం. ఈక్రమంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను, తన భార్య ఇద్దరం పోటీలోనే ఉంటామని స్పష్టం చేశారు. అంతేకాక తమ రెండు నియోజవర్గాల్లో 50 వేల మెజార్టీ రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆ దిశగా కసరత్తు వేగవంతం చేస్తోంది. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పరిశీలించే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను, తన భార్య ఇద్దరూ పోటీలో ఉండనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఏఐసీసీ నిబంధనలు, ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారంగానే సీట్లు కేటాయింపు ఉంటుందని చెప్పుకొచ్చారు. తాను హుజూర్ నగర్‌ నుంచి, తన భార్య పద్మావతి కోదాడ నుంచి బరిలో దిగనున్నట్టు తెలిపారు.

హుజూర్ నగర్, కోదాడలో 50వేల కంటే తక్కువ మెజార్టీ వస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఉద్ఘాటించారు. అధినాయకత్వం పోటీ చేయోద్దంటే చేయనని ఆయన తెలిపారు. గత 6 నెలల్లో కాలంలో పార్టీ చాలా బలపడిందని తెలిపారు. ఖమ్మం, నల్గొండలో క్లీన్ స్విప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మోజార్జీపై అంత ధైర్యంగా చెప్పడానికి  అనేక కారణాలను ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి హుజూర్ నగర్, కోదాడ నియోజకవ వర్గాలు కంచుకోటలు.

ఆయన సొంత కేడర్ తో పాటు, కాంగ్రెస్ కు బలమైన కేడర్ ఉండం ఆయనకు కలిసి వచ్చే అంశం. ఆయన  తొలిసారి 1994 కోదాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. అప్పుడు పరాయజం చవిచూసిన..  ఆ తరువాత  1996 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తరువాత 2004లో కూడా కోదాడ నుంచి  రెండో సారి విజయం సాధించారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడ్డ హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. అలానే 2014లో కోదాడ నుంచి ఆయన భార్య పద్మావతి పోటీ చేశారు. ఆమె కూడా గెలిచి అసెంబ్లీ  అడుగు పెట్టారు. ఇలా రెండు నియోజకవర్గాలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంచి పేరు ఉంది.

అందరిని కలుపుకుని పోతారనే పేరు ఉంది. సొంత సామాజిక వర్గంతో పాటు మిగిలిన వర్గాలు కూడా ఆయన వెంట ఉండటమే ఆయనకు కలిస్సొచ్చే అంశం. అంతేకాక ఆ రెండు నియోజకవర్గాల్లోఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు ప్రత్యర్ధులుగా బలమైన నేతలు లేరు. ఈ రెండు నియోజవర్గాల్లోని ప్రజలకు ఉత్తమ్ కుమార్ దంపతులపై పాజిటీవ్ టాక్ ఉంది. ఇలా స్థానికంగా తనకు ఉన్న బలంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మెజార్టీపై  సంచలన వ్యాఖ్యలు చేశారని రాజకీయా విశ్లేషకులు అంటున్నారు. మరి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి