iDreamPost

అదే జరిగితే రాజకీయాలను శాశ్వతంగా తప్పుకుంటా : ఉత్తమ్

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

అదే జరిగితే రాజకీయాలను శాశ్వతంగా తప్పుకుంటా : ఉత్తమ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. అధికార పార్టీ బీఆర్ఎస్ తరుపు నుంచి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి తనదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈసారి తమకు ఛాన్స్ ఇస్తే.. మరిన్ని అభివృద్ది సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకువస్తా అంటూ ప్రజలకు హామీ ఇస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ని ఢీ కొట్టే ఏకైక పార్టీ కాంగ్రెస్ అంటూ ప్రచారం చేస్తున్నారు ముఖ్యనేతలు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 55 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు విడుదల చేసింది.. మరో లీస్ట్ నేడు బుధవారం రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ మద్యనే బీజేపీ 52 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు రిలీజ్ చేసింది. ఇక ఎన్నికల సందర్బంగా ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారాలు చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల హీట్ ఓ రేంజ్ లో కొనసాగుతుంది. ఇక పార్టీలు వీడి ఇతర పార్టీల్లో చేరుతున్న వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సూర్యాపేట జిల్లా వేపల సింగారం గ్రామంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమం అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది.. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి సముచిత స్థానం కల్పిస్తుంది. పాతవారు, కొత్తవారు సమన్వయంతో పని చేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలి.. ఇదే సరైన సమయం అని గుర్తుపెట్టుకోవాలి. అధికార పార్టీపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలకు బంగారు భవిష్యత్ కల్పిస్తామని నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, నేతకు ఉంది.

తెలంగాణలో ఈసారి ఎన్నికలను కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి 50 వేల ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థిపై గెలుస్తామన్న ధీమా ఉంది. ఒకవేళ 50 వేల మెజార్టీ కి ఒక్క ఓటు తగ్గినా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. కొతకాలంగా హుజూర్ నగర్ లో ఎంతో అభివృద్ది కనిపిస్తుంది. తెలంగాణలో నిరుద్యోగులు, రైతులు, మహిళలు బీఆర్ఎస్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన ఘనత గాంధీ కుటుంబానిదే.. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. మీ ఉత్తమన్న మంచి పదవిలో కొనసాగుతాడు.. మరింత అభవృద్ది చేస్తాడు అన్న విషయం గుర్తు పెట్టుకోండి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం’ అని అన్నారు. తాజాగా దీనిపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ.. గతంలో గడ్డం ఛాలెంజ్ చేసి ఇంకా గడ్డంతోనే తిరుగుతున్నారు.. ఇప్పుడు మళ్లీ ఛాలెంజ్ చేయడం అవసరమా? హుజూర్ నగర్ ఒక్కటి గెలిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా.. ఇతర నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటో గుర్తు తెచ్చుకోవాలని ఎద్దేవా చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి