iDreamPost

చిన్న ట్రిక్స్‌తో రూ.200 కోట్ల ఆర్జన.. వీళ్లది మామూలు తెలివి కాదు!

ఎంతో మంది..తాము ధనవంతులం కావాలని కలలు కంటుంటారు. కానీ కొందరు మాత్రమే ఆ కలలను సాకారం చేసుకుంటారు. వారిలో కొందరు రేయింబవళ్లు కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మరికొందరు తమదైన తెలివిని ప్రదర్శించి కోట్ల రూపాయాలను సంపాదిస్తారు.. ఆ కోవాకు చెందిన వారే ఈ వృద్ద దంపతులు.

ఎంతో మంది..తాము ధనవంతులం కావాలని కలలు కంటుంటారు. కానీ కొందరు మాత్రమే ఆ కలలను సాకారం చేసుకుంటారు. వారిలో కొందరు రేయింబవళ్లు కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మరికొందరు తమదైన తెలివిని ప్రదర్శించి కోట్ల రూపాయాలను సంపాదిస్తారు.. ఆ కోవాకు చెందిన వారే ఈ వృద్ద దంపతులు.

చిన్న ట్రిక్స్‌తో రూ.200 కోట్ల ఆర్జన.. వీళ్లది మామూలు తెలివి కాదు!

ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కలల కంటారు. చాలా మంది రేయింబవళ్లు కష్టపడి డబ్బులను కూడబెడుతుంటారు. అయినా కూడా చాలా తక్కువ మంది మాత్రమే ధనవంతులుగా నిలబడిపోతారు. అయితే కొందరు మాత్రం తమదైన తెలివితో అతి తక్కువ  సమయంలో ఎక్కువ సంపాదించి.. కోటిశ్వర్లుగా మారుతుంటారు. ఇక తెలివికి వయసుకు సంబంధం లేదని విషయం మనకు తెలిసిందే. మరోసారి అదే విషయ ఓ వృద్ధ దంపతులు నిరూపించారు. తమదైన తెలివిని ఉపయోగించి.. చిన్న ట్రిక్స్ తో రూ.200 కోట్లను సంపాదించారు. వారి తెలివి చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. న్యూయార్క్ పోస్టు తెలిపిన వివరాల ప్రకారం..

అమెరికాకు చెందిన జెర్రీ(80), మార్జ్ సెల్బీ(81) వృద్ధ దంపతులు స్టోర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొన్నాళ్ల తరువాత ఆ స్టోర్ ను వేరే వాళ్లకు విక్రయించారు. ఇక ఈ దంపతులకి గణిత నైపుణ్యాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తెలివితేటలతో లాటరీల ద్వారా 26 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.200 కోట్లు సంపాదించారు. 2003లో విన్‌ఫాల్ అనే కొత్త లాటరీ గేమ్ కోసం విడుదలైన బ్రోచర్‌ ఈ దంపతులను ఆకర్షించింది. ఆ లాటరీని గెలుపొందే అవకాశం ఉందని సెల్బీ గ్రహించారు. విన్‌ఫాల్ లాటరీలో జాక్‌పాట్ 5 మిలియన్ డాలర్లకు చేరుకున్న తర్వాత ఆడటం ఆపేయకుంటే ఎక్కువ టిక్కెట్ కొనుగోలు చేసిన వ్యక్తులకు లాభం కలుగుతుంది.

ఎక్కువు సంఖ్యలో టిక్కెట్లు కొనుగోలు చేస్తే ఖచ్చితంగా లాటరీ గెలుస్తుంది. ఇక సెల్బీ.. గణితంలో తనకున్న ప్రావీణ్యంతో 1,100 డాలర్లు పెట్టి 1,100 టిక్కెట్‌లను కొనుగోలు చేసి.. తద్వారా 1,900 డాలర్లు సంపాదించవచ్చని అంచనా వేశారు. రిస్క్-రివార్డ్ విశ్లేషించి.. ఆ గేమ్ లాభదాయకంగా ఉంటుందని గుర్తించడానికి తనకు రెండు నిమిషాల కంటే తక్కువ సమయం పట్టిందని అతను తెలిపారు. ఇక, వృద్ద దంపతులు ప్రయోగాత్మకంగా తొలుత 3,600 డాలర్లకి విన్‌ఫాల్ టిక్కెట్‌ల్లో పెట్టుబడి పెట్టారు. దీని ద్వారా  దాదాపు 6,300 డాలర్లు గెలిచారు.

ఆ తర్వాత మరోసారి 8,000 డాలర్లు వెచ్చిస్తే… దానికి రెట్టింపు డబ్బులు వచ్చాయి. ఇక తన ట్రిక్స్ ను కూడా సెల్బీ బయట పెట్టాడు. ఆయన చెప్పిన మాటలు విని తోటి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..ఒకవేళ నేను 1,100 డాలర్లతో ఆట అడితే..  లెక్కలపరంగా నాలుగు సంఖ్యల అంటే 1000 బక్స్ గెలుస్తాం, నేను 1,100ని 57కి బదులుగా 6తో భాగించాను, దీంతో 18 లేదా 19 మూడు సంఖ్యలు విజేతలుగా ఉంటారని ఊహించాను. అందుకే నేను 1,100 పెట్టుబడి పెడితే.. నాకు 1,900 డాలర్ల రాబడి వచ్చింది’ అని సెల్బీ చెప్పొకొచ్చాడు. చివరికి ఈ గేమ్‌లో అనుభవం సాధించిన ఈ దంపతులు.. జీఎస్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు.. ఒక్కొక్కరిని 500 డాలర్లు చొప్పున టిక్కెట్‌లు కొనుగోలు చేయమని ప్రోత్సహించారు.

మసాచుసెట్స్‌లో విన్‌ఫాల్ లాటరీ గురించి కూడా తెలుసుకుని.. ప్రతిసారీ అక్కడి వెళ్లి తమకు అనుకూలమైన రెండు షాపుల్లో వందల వేల టిక్కెట్‌లను కొనుగోలు చేశారు. విన్‌ఫాల్‌తో ఆడిన తొమ్మిదేళ్లలో తమ బృందం మొత్తం 26 మిలియన్ డాలర్లు గెలుచుకుందని సెల్బీ వివరించారు. పన్నులకు ముందు సుమారు 8 మిలియన్ డాలర్లు లాభం పొందామని చెప్పారు. వారి విజయాలు, పెద్ద సంఖ్యలో టిక్కెట్‌ల కొనుగోలు చేస్తున్న అంశంపై  స్థానిక అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో స్థానిక ఇన్‌స్పెక్టర్ జనరల్ విచారణను ప్రారంభించింది. అయితే, నిబంధనల ప్రకారం ఆడుతున్నారని,  ఇందులో చట్ట విరుద్దం ఏమీ లేదని  అధికారులు తేల్చారు. మరి..వృద్ధ దంపతులు గణిత నైపుణ్యంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి