iDreamPost

టీ.వీ5 కార్యలయంపై రాళ్ళు విసిరిన ఆగంతకులు

టీ.వీ5 కార్యలయంపై రాళ్ళు విసిరిన ఆగంతకులు

తెలుగురాష్ట్రాల్లో ప్రముఖ మీడీయా ఛానల్ గా గుర్తింపు పొందిన టి.వి 5 ఛానల్ పై నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఆగంతకులు రాళ్ళు విసిరినట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో హైదరాబాద్ టీ.వీ5 ప్రధాన కార్యాలయం బయట ఉన్న సెక్యూరిటీ గది అద్దాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై ఛానల్ యాజమాన్యం పోలీసులుకి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే తెలుగురాష్ట్రాల్లో ఉన్న పలువురు రాజకీయ వాదులు ఈ ఘటనని పత్రిక స్వేచ్చపై దాడిగా అభివర్ణిస్తు ఖండించారు.

టీ.వీ5 ఛానల్ లో గత కొద్ది కాలంగా ఉద్యోగులుగా పని చేస్తున్న సాంబశివరావు, మూర్తిని ఇటీవలే ఛానల్ యాజమన్యం రాజీనామ చేయమని అడిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో ఉన్న నిజనిజాలు ఇంకా పూర్తిగా బహిర్గతం కాక ముందే నిన్నటి రోజున ఈ దాడి జరగడంతో దీనివెనక ఉన్న అదృశ్య శక్తులు ఎవరా అనే అనుమానం ప్రతిఒక్కరిలో కలుగుతుంది. ఇదిలా ఉంటే గత కొద్దికాలంగా సదరు ఛానల్ ఒక రాజకీయ పార్టికి పూర్తిగా మద్దతు పలుకుతూ ఆ సదరు పార్టి రాజకీయ ప్రయోజనాలు కాపాడే విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఇతర పార్టీ నాయకులపై నిజ నిర్దారణ లేకుండా ఏకపక్షంగా వార్తలు ప్రచారం చేస్తు వివాదాస్పదం అయింది.

కారణాలు ఏదైనప్పటికి చివరికి అగంతకులు రాళ్ళు విసిరే వరకు వెళ్ళింది. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో భౌతిక దాడి సమర్థనీయం కాదు కాబట్టి ఇటువంటి పరిణామాలు పునారావృతం అవ్వకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుని దోషులని కఠినంగా శిక్షించాలి అని కోరుకుందాం. అలాగే సదరు మీడియా ఛానల్ కుడా ఏకపక్ష ధోరణి వదిలి ప్రజల పక్షాన నిలవాల్సిన అవసరాన్ని ఆ ఛానల్ కూడా గుర్తించాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి