• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » business » Union Govt Good News For Lic Agents And Employees

ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. గ్రాట్యుటీ భారీగా పెంపు

  • By pvenkatesh338 Published Date - 05:13 PM, Mon - 18 September 23 IST
ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..  గ్రాట్యుటీ భారీగా పెంపు

దేశంలో అతిపెద్ద మరియు అత్యంత విలువైన ప్రభుత్వ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా. భారత ప్రజల నుంచి అత్యంత ఆధరణ పొందింది ఎల్ఐసీ. అద్భుతమైన పాలసీలను ప్రవేశపెడుతూ పాలసీదారులకు నమ్మకం కలిగిస్తూ ఎల్ఐసీ దూసుకెళ్తుంది. అయితే దీని వెనకాల ఎల్ఐసీ ఏజెంట్లు సంస్థలో పని చేసే ఉద్యోగుల కృషి ఎనలేనిది. కాగా వీరి సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలను చేపట్టింది. తాజాగా ఏజెంట్లకు, ఉద్యోగులకు ఎల్ఐసీ తీపి కబురును అందించింది. వారికి అందించే గ్రాట్యుటీని భారీగా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా 13 లక్షల మంది ఏజెంట్లకు, ఒక లక్ష మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఏజెంట్లు, ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. ఎల్ఐసీ ఏజెంట్ల గ్రాట్యుటీ పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీంతో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ రూ. 3000-10,000 ల నుంచి రూ. 25,000- 1,50,000 వరు పెంచేందుకు ఆమోదం తెలిపింది. టర్మ్ ఇన్సూరెన్స్ పెంపుదలతో మరణించిన ఏజెంట్ల కుటుంబాలకు పెద్ద మొత్తంలో ప్రయోజనం చేకూరనుందని ఆర్థిక మంత్రత్వ శాఖ తెలిపింది. ఇక ఎల్ఐసీ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం 30 శాతం చొప్పున కుటుంబ పెన్షన్ ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంక్షేమ చర్యలతో ఎల్ఐసీ దేశంలో బీమా వ్యాప్తిని మరింత పెంచాలని చూస్తోందని కేంద్రం తెలిపింది.

  • ఇది కూడా చదవండి: ఇంగ్లీష్ మీడియం వద్దన్న ప్రతిపక్షాలకు చెంపపెట్టు.. UNO సదస్సుకు AP విద్యార్థులు

Tags  

  • central govt
  • family pension
  • gratuty
  • LIC
  • LIC agents
  • lic employees
  • Term Insurance

Related News

ఒక్కసారి కడితే చాలు.. 40 ఏళ్ల నుంచే నెలకు రూ. 20 వేలు పొందవచ్చు

ఒక్కసారి కడితే చాలు.. 40 ఏళ్ల నుంచే నెలకు రూ. 20 వేలు పొందవచ్చు

ఒంట్లో సత్తువ ఉన్నన్ని రోజులు కష్టపడి పని చేస్తాం.. కుటుంబాన్ని పోషిస్తాము. మరి వృద్ధాప్యంలో.. పని చేద్దామని భావించినా.. చేయడానికి శరీరం సహకరించదు. ఆ సమయంలో నెలకు ఎంతో కొంత స్థిరమైన ఆదాయం వచ్చే ఏర్పాటు చేసుకోకపోతే.. ముసలితనంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకప్పటిలా.. కొడుకులు పోషిస్తారని నమ్మకంగా ఉండే రోజులు కావివి. అందుకే ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే వృద్ధాప్యం గురించి ఆలోచించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా పెన్షన్‌ ప్లాన్లకు డిమాండ్‌ […]

7 days ago
అన్నదాతలకు మోదీ సర్కార్‌ శుభవార్త.. పండగకు ముందే 4 కొత్త ప్రకటనలు

అన్నదాతలకు మోదీ సర్కార్‌ శుభవార్త.. పండగకు ముందే 4 కొత్త ప్రకటనలు

7 days ago
కేంద్రం గుడ్‌న్యూస్‌.. 75 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

కేంద్రం గుడ్‌న్యూస్‌.. 75 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

2 weeks ago
సూపర్‌ స్కీమ్‌.. మీ షాపింగ్‌ బిల్‌ అప్లోడ్‌ చేస్తే చాలు.. రూ.కోటి క్యాష్‌ ప్రైజ్‌

సూపర్‌ స్కీమ్‌.. మీ షాపింగ్‌ బిల్‌ అప్లోడ్‌ చేస్తే చాలు.. రూ.కోటి క్యాష్‌ ప్రైజ్‌

1 month ago
టమాటా ధరలపై కేంద్ర కీలక ప్రకటన.. భారీగా దిగి వచ్చే అవకాశం

టమాటా ధరలపై కేంద్ర కీలక ప్రకటన.. భారీగా దిగి వచ్చే అవకాశం

1 month ago

తాజా వార్తలు

  • ఈ వరల్డ్ కప్​లో ఆ యంగ్ బ్యాటరే టాప్ స్కోరర్: డివిలియర్స్
    5 mins ago
  • వీడియో: స్టేజ్ పైనే గొడవపడ్డ ఇమాన్యుయేల్, యాదమ్మరాజు!
    10 hours ago
  • వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న CM కేసీఆర్.. మంత్రి KTR వెల్లడి
    10 hours ago
  • కూతురి పెళ్లి కోసం లాకర్లో దాచిన రూ.18 లక్షలకు చెదలు!
    10 hours ago
  • విజేత సూపర్ మార్కెట్ ను సీజ్ చేసిన GHMC కమిషనర్.. కారణం తెలిస్తే షాక్!
    11 hours ago
  • మూడో వన్డేలో కోహ్లీ శివతాండవం తప్పదా? రికార్డులు ఏం చెబుతున్నాయంటే?
    11 hours ago
  • జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
    11 hours ago

సంఘటనలు వార్తలు

  • అతడు జట్టులో ఉంటే.. నేను వరల్డ్ కప్ ఆడను! బంగ్లా బోర్డుకు షకీబ్ వార్నింగ్!
    11 hours ago
  • రైల్వే ట్రాక్ మీద భార్యపై బ్లేడ్ తో దాడి.. ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్
    12 hours ago
  • వరల్డ్ కప్ ముంగిట రోహిత్ కీలక వ్యాఖ్యలు.. మేం వాటిని పట్టించుకోం అంటూ..!
    13 hours ago
  • వైన్ షాపులు బంద్.. ఎన్ని రోజులంటే?
    13 hours ago
  • శివపార్వతులుగా ప్రభాస్, నయనతార.. లీక్ చేసిన సీనియర్ హీరోయిన్
    13 hours ago
  • గ్యాస్ స్టేషన్ లో భారీ పేలుడు.. 20 మంది సజీవదహనం!
    13 hours ago
  • రోహిత్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరలవుతున్న వీడియో..
    13 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version