iDreamPost

Budget 2024 LIVE: బడ్జెట్ సమావేశాలు.. రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు

  • Published Feb 01, 2024 | 11:18 AMUpdated Mar 14, 2024 | 6:58 PM

Union Budget 2024 LIVE Updates in Telugu: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆ వివరాలు..

Union Budget 2024 LIVE Updates in Telugu: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆ వివరాలు..

  • Published Feb 01, 2024 | 11:18 AMUpdated Mar 14, 2024 | 6:58 PM
Budget 2024 LIVE: బడ్జెట్ సమావేశాలు.. రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వం చివరి బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. లోక్‌సభలో 2024 మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 1, గురువారం ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. బడ్జెట్‌ సమర్పణకు ముందు కేబినేట్‌ భేటీ జరిగింది. ఆ తర్వాత.. నిర్మలా సీతారామన్‌ రాష్ట్రపతిని కలిసి బడ్జెట్‌ సమర్పించేందుకు అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత పార్లమెంటుకు చేరుకున్నారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 01 Feb 2024 12:00 PM (IST)

    రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు

    ట్యాక్స్‌పేయర్ల సొమ్ము దేశాభివృద్ధికి వినియోగిస్తున్నాం.

    కొత్త ట్యాక్స్‌ విధానంలో రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్నులేదు

    ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు రెట్లు పెరిగాయి.

    పర్యాటక ప్రాంతాల అభివృద్దిలో రాష్ట్రాలకు తోడ్పాటు అందిస్తాం.

    సంస్కరణల అమలుకు రాష్ట్రాలకు 50 ఏళ్లపాటు రూ.75వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందిస్తాం.

    ఆదాయపు పన్ను రిటర్న్‌లు సమర్పించిన వారికి రీఫండ్స్‌ను వేగవంతం చేస్తున్నాం.

    కార్పొరేట్‌ ట్యాక్స్‌ 30 నుంచి 22 శాతానికి తగ్గింపు.

  • 01 Feb 2024 11:57 AM (IST)

    ఎఫ్‌డీఐ అంటే ఫస్ట్‌ డెవలపడ్‌ ఇండియా

    ఎఫ్‌డీఐ అంటే ఫస్ట్‌ డెవలపడ్‌ ఇండియా

    వచ్చే 5 ఏళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం

    స్టార్టప్‌ ఇండియా, స్టార్టప్‌ క్రెడిట్‌ గ్యారంటీతో యువతకు ఉద్యోగాలు

    10 ఏళ్లల్లో ఉన్నత విద్య చదివే అమ్మాయిలు 28 శాతం పెరిగారు.

  • 01 Feb 2024 11:54 AM (IST)

    3 అతిపెద్ద రైల్వే కారిడార్స్‌ నిర్మాణం

    3 అతిపెద్ద రైల్వే కారిడార్స్‌ నిర్మించబోతున్నాం

    వందే భారత్‌, నమో భారత్‌ రైళ్లను మరిన్ని పెంచుతాం

    149 కొత్త ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం

  • 01 Feb 2024 11:50 AM (IST)

    జన్‌ధన్‌ ఖాతాలో 34 లక్షల కోట్లు అందించాం

    జన్‌ధన్‌ ఖాతాలో 34 లక్షల కోట్లు అందించాం

    జన్‌ధన్‌ ఖాతాలతో పేదలకు రూ.34 లక్షల కోట్లు అందించాం.

  • 01 Feb 2024 11:48 AM (IST)

    కోటి మంది మహిళలను లక్షాధికారులను చేశాం

    4 కోట్ల మంది రైతులకు క్రాప్‌ ఇన్సూరెన్స్‌ కల్పించాం.

    ముద్ర రుణాల కింద మొత్తం రూ.22.50 లక్షల కోట్లు ఇచ్చాం.

    12 కోట్ల మంది రైతులకు రుణాలు అందించాం

    మహిళలకు 30 వేల కోట్ల ముద్ర రుణాలు ఇచ్చాం.

    మత్స్యశాఖలో కొత్తగా 55 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం

    కోటి మంది మహిళలను లక్షాధికారులను చేశాం.

    3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయడమే తదుపరి లక్ష్యం

    డెయిరీ యూనిట్లకు ఆర్థిక సహకారం అందిస్తాం.

    5 అతిపెద్ద ఆక్వా పార్క్‌ల నిర్మాణం చేపడతాం.

    మత్య్స శాఖలో కొత్తగా 55 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.

    స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కింద 1.4 కోట్ల మంది యువతకు ట్రైనింగ్‌ ఇచ్చాం.

     

  • 01 Feb 2024 11:40 AM (IST)

    వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం

    వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం

    మధ్యతరగతి ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తాం

    వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్‌ యోజన కింద రెండు కోట్ల ఇళ్లనిర్మాణం

    అంగన్‌వాడీ కార్మికులు, హెల్పర్లకు ఆయుష్మాన్‌ భారత్‌ కవరేజ్‌ కల్పిస్తాం.

    9-18 ఏళ్ల బాలికలు సర్వైకల్‌ కేన్సర్‌ పడకుండా చర్యలు చేపడతాం.

    మరిన్ని మెడికల్‌ కాలేజీల కోసం కమిటీ ఏర్పాటు చేశాము

    రూఫ్‌ టాప్‌ సోలార్‌ పాలసీ విధానం కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తాం.

     

  • 01 Feb 2024 11:31 AM (IST)

    2047 నాటికి వికసిత భారత్‌: నిర్మలా సీతారామన్‌

    డిజిటల్‌ రూపంలో బడ్జెట్‌ అందుబాటులోకి తెచ్చాం.

    సబ్‌కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌ అదే మా మంత్రం

    దేశంలో అవినీతి, కుటుంబ పాలనను అంతం చేశాం.

    80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం అందించడం ద్వారా ఆహార సమస్య లేకుండా చేశాం.

    గత పదేళ్లలో అందరికీ ఇళ్లు, వంట గ్యాస్, విద్యుత్ అందేలా కృషి చేశాం.

    2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారత్‌ను మలిచే దిశగా పని చేస్తున్నాం.

    రూ.34 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందించా.

    రైతు బీమా ద్వారా 11. కోట్ల మందిని ఆదుకున్నాం.

    చెస్‌ ప్లేయర్‌ ప్రజ్ఞానంద్‌పై నిర్మలమ్మ ప్రశంసలు

    ప్రస్తుతం 80 మంది బెస్‌ గ్రాండ్‌స్టర్లు భారత్‌లో ఉన్నారు

    30 కోట్ల మంది మహిళలకు ముద్రా రుణాలు అందించాం.

    స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా 1.4 కోట్ల మంది యువతకు శిక్షణ

    గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడేలా చర్యలు తీసుకున్నాం.

    కొత్త సంస్కరణలతో పారిశ్రామిక వేత్తలు పెరిగారు.

    దేశవ్యాప్తంగా 3 వేల ఐటీఐలు, 7 ఐఐటీలు, 7 ఐఐఎంఎంలు ఏర్పాటు చేశాం.

    15 ఎయిమ్స్‌, 319 యూనివర్సిటీలు ఏర్పాటు.

    పార్లమెంట్‌, అసెంబ్లీలో మూడో వంతు సీట్లు మహిళలకే వచ్చేలా చట్టం చేశాం

    మా దృష్టిలో జీడీపీ అంటే గవర్నెన్స్‌, డెవలప్‌మెంట్‌, పర్ఫార్మెన్స్‌

    ట్రిపుల్‌ తలాక్‌ రద్దు చేశాం

    ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి, ఆదాయంలో పెరుగుదల ఉంది.

     

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి