iDreamPost

హనుమాన్‌కి మరణం లేదు కదా? మరి.. హనుమాన్ జయంతి అని ఎందుకు పిలుస్తున్నారు?

  • Published Apr 23, 2024 | 1:10 PMUpdated Apr 23, 2024 | 1:10 PM

Hanuman Jayanti 2024: హనుమాన్‌ జయంతి పర్వదినం సందర్భంగా ఓ కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. జయంతి అంటే మరణించి వారి కోసం వాడతాం. మరి హనుమాన్‌ చిరంజీవి కదా.. ఆయన జన్మదినాన్ని జయంతి అనవచ్చా అనే సందేహం తెర మీదకు వచ్చింది. మరి పండితులు ఏమంటున్నారంటే..

Hanuman Jayanti 2024: హనుమాన్‌ జయంతి పర్వదినం సందర్భంగా ఓ కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. జయంతి అంటే మరణించి వారి కోసం వాడతాం. మరి హనుమాన్‌ చిరంజీవి కదా.. ఆయన జన్మదినాన్ని జయంతి అనవచ్చా అనే సందేహం తెర మీదకు వచ్చింది. మరి పండితులు ఏమంటున్నారంటే..

  • Published Apr 23, 2024 | 1:10 PMUpdated Apr 23, 2024 | 1:10 PM
హనుమాన్‌కి మరణం లేదు కదా? మరి.. హనుమాన్ జయంతి అని ఎందుకు పిలుస్తున్నారు?

హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో హనుమాన్‌ జయంతి ఒకటి. వాయు పుత్రుడు ఆంజనేయుడు పుట్టిన రోజు సందర్భంగా.. హిందువులు ఈ పండగ జరుపుకుంటారు. పురాణాల ప్రకారం.. హనుమాన్‌.. చైత్ర పౌర్ణమి నాడు జన్మించాడు. అందుకే ఈ రోజున హనుమాన్‌ జయంతి పేరుతో పండుగ చేసుకుంటారు. భారీ ఎత్తున ర్యాలీలు, శోభయాత్రలు నిర్వహిస్తూ పవన సుతుడిని ఆరాధిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో పండుగలకు సంబంధించి కొన్ని కొత్త కొత్త వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. అలానే హనుమాన్‌ జయంతి సందర్భంగా ఓ కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. అదేంటి అంటే.. సాధారణంగా మన దగ్గర చనిపోయిన వారి పుట్టిన రోజును జయంతి పేరుతో సంభోదిస్తాము. మరి ఆంజనేయుడు చిరంజీవి కదా.. ఆయన జన్మదినాన్ని జయంతి అని పిలవడం తప్పు కదా.. ఇది పాపమే అంటున్నారు కొందరు.

పురణాలు, వేదాల ప్రకారం చూసుకుంటే.. మన దేవుళ్లలో చాలా మంది లోక కళ్యాణం కోసం అనేక అవతారాలు ఎత్తి.. రాక్షసులను నిర్మూలించి.. ధర్మాన్ని కాపాడి.. ఆ తర్వాత అవతార పరిసమాప్తి చేశారు. రాముడు, శ్రీకృష్ణుడు, నరసింహ స్వామి.. ఇలా దశవాతారాలు.. ధర్మ సంస్థాపన కోసం జరిగినవే. ఆయా అవతారాల లక్ష్యం పూర్తి కాగానే పరిసమాప్తి జరిగింది. కనుక ఆయా దేవుళ్ల పుట్టిన రోజు వేడుకలకు సంబంధించి ఇలా జయంతి అని వాడొచ్చు.. దానిలో తప్పు లేదు అంటున్నారు. కానీ ఆంజనేయుడు అలా కాదు కదా.. ఆయన చిరంజీవి. భూమి అంతం అయ్యే వరకు.. ఆయన బ్రతికే ఉంటాడు.

మరి అలాంటి హనుమాన్‌ జన్మదిన వేడుకలను సూచించడం కోసం చనిపోయిన వారికి సంబోధించే జయంతిని వాడటం ఎంత వరకు కరెక్ట్‌ అని కొందరు వాదిస్తున్నారు. అంతేకాక చిరంజీవిగా వరం పొంది.. ఇంకా బతికే ఉన్న పవనసుతుడి జన్మదినాన్ని ఇలా జయంతి అని సంభోదించడం మహా పాపం అంటున్నారు. మరణం లేని హనుమాన్‌కి జయంతి చేసి మహాపాపం ముట్టగట్టుకుంటున్నామని భయపెడుతున్నారు.

కానీ మరి కొందరు మాత్రం.. జయంతి అనేది కేవలం మానవులకు మాత్రమే వర్తిస్తుందని.. దేవతల విషయంలో జయంతి అంటే విజయాన్ని కూడా సూచిస్తుంది అంటున్నారు. అమోఘమైన విజయాన్ని సాధించిన పక్షంలో కూడా జయంతి అనే పదాన్ని వాడతారు. జయంతి అంటే విజయవంతమైనది అనే అర్థం కూడా ఉంది. ఇక లంకలో ఉన్న సీతా మాతను.. కనిపెట్టడం మాత్రమే కాక రావణ సంహారంలో ఆంజనేయుడు చేసిన సాయం అనితర సాధ్యం.

హనుమాన్‌ వీరత్వాన్ని పొగడటానికే ఇలా జయంతి అనే పదాన్ని వాడుతున్నారని.. ఆయన జన్మదినం నాడు.. కేసరి చేసిన గొప్ప పనులను తలుచుకుని.. ఆయన చూపిన మార్గంలో నడవాలనే ఉద్దేశంతోనే హనుమాన్‌ జయంతి అని పిలుస్తున్నారని కొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఈ కొత్త వివాదంపై స్పష్టత రావాలంటే.. శాస్త్రాలు, పురాణాలపై బాగా పట్టున్న పండితులు దీనిపై స్పందించి.. ఏది మంచో.. ఏది చెడో వివరిస్తే.. తప్ప.. ఈ వివాదం ముగిసిపోదు అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి