iDreamPost

వీల్ చైర్‌లో మహిళ.. ఆమె ముందు మోకరిల్లిన UAE అధ్యక్షుడు! ఎందుకంటే!

UAE President Honours Women: సమాజంలో ప్రాణాలకు తెగించి గొప్ప పనులు చేసిన వారిని ప్రభుత్వం సత్కరించడం తెలిసిన విషయమే. అలా సత్కారం పొందిన మహిళకు ఏనలేని గౌరవం దక్కింది.

UAE President Honours Women: సమాజంలో ప్రాణాలకు తెగించి గొప్ప పనులు చేసిన వారిని ప్రభుత్వం సత్కరించడం తెలిసిన విషయమే. అలా సత్కారం పొందిన మహిళకు ఏనలేని గౌరవం దక్కింది.

వీల్ చైర్‌లో మహిళ.. ఆమె ముందు మోకరిల్లిన UAE అధ్యక్షుడు! ఎందుకంటే!

2022 లో అబుదాబీలో ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ చిక్కుకున్న చాలా మందిని ఓ మహిళ తన ప్రాణాలకు తెగబడి రక్షించింది. ఆమె పేరు ఇమెన్ స్ఫాక్సీ.. అప్పట్లో ఆమె పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. ఇమెన్ స్పాక్సీ చేసిన పనికి యూఏఈ అధ్యక్షులు ఆమెను కనీ వినీ ఎరుగని రీతీలో గౌరవించారు. వీల్ చైర్ లో వచ్చిన ఆమె ముందు మోకరిల్లి సత్కరించడం యావత్ ప్రపంచం మొత్తం ఆశ్చర్యానికి గురి చేసింది. విలువైన మనుషులకు విలువైన సత్కారం అంటూ ఫోటోలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం సమాజంలో ఎవరి పని వారు చూసుకుంటున్నారు. పక్కవారికి ఏం జరిగినా పట్టించుకునే నాధుడే లేరు. ఎక్కడో అక్కడ కొంతమంది మంచి మనుషులు మాత్రమే స్పందిస్తుంటారు. 2022 లో అబుదాబిలో ఓ బహుల అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ప్రాణాలు కాపాడుకోవడం కోసం జనాలు ఉరుకులు పరుగులు పెట్టారు. ఆ సమయంలో ఇమెన్ స్పాక్సీ యువత తన ప్రాణాలకు తెగించి కొంతమంది ప్రాణాలు కాపాడింది. అప్పట్లో ఈ వార్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా సమాజానికి సేవ చేసిన ఎనిమిది మంది వ్యక్తులకు యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ సత్కరించారు. ఈ సందర్భంగా వీల్ చైర్ పై వచ్చిన ఇమెన్ స్పాక్సీ ముందు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ మోకరిల్లి సత్కరించారు.

అబుదాబిలోని కసర్ అల్ హుస్న్ లో జరిగిన అబుదాబీ అవార్డ్స్ 11 వ ఎడిన్ లో ఇమెన్ స్పాక్సీ కి గొప్ప సత్కారం లభించింది. సుస్థిర అభివృద్ది, విద్యా, వైద్య రంగాల్లో విశేష కృషి చేసిన వారిని ఈ కార్యక్రమంలో సత్కరించారు. విజేతలకు అవార్డు అందించారు యూఏఈ ప్రెసిడెంట్. ఈ సందర్భంగా యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ మాట్లాడుతూ  ‘ఈ అవార్డు విజేతలు తమ నీతి, నిజాయితీ చాటుకుంటూ ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపాడానికి కృషి చేశారు.. వారి అంకిత భావాన్ని గౌరవించడం ఎంతో గొప్పగా భావిస్తున్నాను’ అని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by دولة الامارات العربية المتحدة (@emarati_nation)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి