iDreamPost

ఏడాదికి రెండు మూడు చిరు వల్ల కూడా సాధ్యం కానట్లేనా?

1980 మరియు 1990 ల్లో చిరంజీవి నుంచి ఏడాదికి పది సినిమాలు వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఏడాదికి ఒక్కటి వచ్చినా చాలు అన్నట్లుగా పరిస్థితి మారింది. చిరు ఏడాదికి రెండు మూడు సినిమాలతో వస్తానంటూ హామీ ఇచ్చినా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం అయ్యేలా లేదని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

1980 మరియు 1990 ల్లో చిరంజీవి నుంచి ఏడాదికి పది సినిమాలు వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఏడాదికి ఒక్కటి వచ్చినా చాలు అన్నట్లుగా పరిస్థితి మారింది. చిరు ఏడాదికి రెండు మూడు సినిమాలతో వస్తానంటూ హామీ ఇచ్చినా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం అయ్యేలా లేదని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఏడాదికి రెండు మూడు చిరు వల్ల కూడా సాధ్యం కానట్లేనా?

ఒకప్పడు స్టార్‌ హీరోలు ఏడాదికి అర డజను సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే వారు. చిరంజీవి, కృష్ణలతో పాటు కొందరు సీనియర్‌ స్టార్‌ హీరోలు ఒకానొక సమయంలో ఏడాదికి పదికి పైగా సినిమాలను విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏడాదిలో నెలకు ఒకటి చొప్పున కూడా స్టార్ హీరోలు అప్పట్లో సినిమాలు విడుదల చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. మేకింగ్ కాస్ట్‌ పెరగడంతో పాటు, మేకింగ్ లో వచ్చిన మార్పుల కారణంగా ఎక్కువ రోజుల పాటు షూటింగ్‌ చేయాల్సి వస్తుంది. అంతే కాకుండా హీరోలు, దర్శకులు ఒకే సారి ఎక్కువ సినిమాలు చేసే పరిస్థితి కూడా లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏడాదికి కనీసం రెండు సినిమాలు మాత్రం చేసే అవకాశం ఉంది. కానీ ఆ రెండు సినిమాలను కూడా మన స్టార్‌ హీరోలు చేయడం లేదు. తమిళ్‌ కు చెందిన విజయ్‌, ధనుష్ వంటి స్టార్స్‌ ఏడాదికి కనీసం రెండు చొప్పున సినిమాలు చేస్తూ ఉన్నారు. కానీ మన స్టార్స్ మాత్రం ఏడాది మొత్తం వెయిట్‌ చేసినా ఒక్క సినిమా విడుదల చేయడం లేదు.

ఆ మధ్య చిరంజీవి ఒక ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కచ్చితంగా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తాను, మెగా ఫ్యాన్స్‌ కి ముందు ముందు మంచి వినోదాన్ని అందించి మునుపటి రోజులు గుర్తు చేస్తాను అన్నట్లుగా ప్రకటించాడు. అన్నట్లుగానే చిరంజీవి బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలకు కమిట్‌ అయ్యాడు. అందులో కొన్ని నిరాశ పరచగా, కొన్ని డిజాస్టర్ లుగా నిలిచాయి. దాంతో చిరంజీవి కూడా ఆలోచనలో పడ్డాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయడం కంటే.. ఎక్కువ సక్సెస్ లను దక్కించుకోవడం ముఖ్యం. అందుకే చిరంజీవి స్లో అయ్యాడు. ఆ మధ్య కమిట్‌ అయినట్లుగా బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేయకుండా మెల్లగానే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం చిరంజీవి ఒకే ఒక్క సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకు బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. విశ్వంభర అనే టైటిల్‌ తో రూపొందుతున్న సినిమా పూర్తి అయిన తర్వాతే కొత్త సినిమాను చిరంజీవి మొదలు పెట్టేలా ఉన్నాడు.

mega star new movie

చిరంజీవి వంటి స్టార్‌ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్‌ అవుతూ ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల చేసే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో వందల కోట్ల బడ్జెట్‌ తో రూపొందుతున్న సినిమాల్లో నటిస్తున్న యంగ్‌ స్టార్స్‌ ఏడాదికి రెండు సినిమాలను చేయాలి అనుకోవడం పొరపాటు అవుతుంది. వారి నుంచి ఏడాదికి కనీసం ఒక్క సినిమా వచ్చినా చాలు అన్నట్లుగా ఫ్యాన్స్ సోషల్‌ మీడియా ద్వారా కామెంట్స్‌ చేస్తున్నారు. సీనియర్‌ స్టార్‌ హీరోల్లో బాలకృష్ణ కాస్త స్పీడ్‌ గా ఉన్నాడు. ఆయన ఈ ఏడాది ఆరంభంలో వీర సింహారెడ్డితో వచ్చాడు. ఇక మొన్న దసరాకి భగవంత్‌ కేసరి సినిమా తో వచ్చాడు. వచ్చే ఏడాది కూడా బాలయ్య రెండు సినిమాలను విడుదల చేసే ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. చిరు మాత్రం ఏడాదికి ఒక్కటి చాలు అన్నట్లుగా స్లో అయ్యాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరు సినిమాల ఎంపిక విషయంలో స్లో అవ్వడంపై మీ స్పందన ఏంటి? స్లో గా చేస్తే హిట్స్ పడుతాయని మీరు భావిస్తున్నారా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి