iDreamPost

ఆరుకి చేరుతున్న చిరంజీవి కౌంట్

ఆరుకి చేరుతున్న చిరంజీవి కౌంట్

ఎన్నడూ లేని విధంగా కెరీర్ లేట్ ఇన్నింగ్స్ లో చాలా దూకుడు మీదున్న మెగాస్టార్ చిరంజీవి దాన్ని అలాగే కొనసాగించబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య ఇంకొంచెం బ్యాలన్స్ ఉండగానే మోహన్ రాజాతో గాడ్ ఫాదర్ ని శరవేగంగా సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఇప్పటికే కొంత టాకీ పార్ట్ ఒక ఫైట్ పూర్తి చేశారు. మెహర్ రమేష్ డైరెక్షన్ లో చేయబోయే వేదాళం రీమేక్ భోళా శంకర్ కూడా షెడ్యూల్ చేసుకుని ఉంది కానీ ఎప్పటి నుంచనే వివరాలు బయటికి చెప్పడం లేదు. ఇక బాబీకు ఓకే చేసిన టైటిల్ పెట్టని ప్రాజెక్ట్ కూడా వచ్చే ఏడాది ప్రారంభం లోపే రెగ్యులర్ షూట్ కు వెళ్తుంది. ప్రస్తుతం క్యాస్టింగ్ సెలక్షన్ జరుగుతోంది

ఇవన్నీ విడుదలయ్యే లోపే 2022 దాటిపోతుంది. అయినా కూడా మరో ఇద్దరినీ మెగాస్టార్ లాక్ చేసి పెట్టుకున్నట్టు సమాచారం. రామ్ చరణ్ తో రచ్చ లాంటి మాస్ హిట్ కొట్టి ఇటీవలే సీటిమార్ తో సక్సెస్ అందుకున్న సంపత్ నంది చెప్పిన లైన్ ఒకటి చిరుని ఇంప్రెస్ చేసిందట. పూర్తి వెర్షన్ ఫైనల్ అయ్యాక అప్పుడు సెట్ చేద్దామని మాట ఇచ్చారట. మారుతీ డైరెక్షన్ లో యువి సంస్థ చిరంజీవితో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్ చేసిందని మరో టాక్ ఉంది. రామ్ చరణ్ తో ఒక సినిమా చిరుతో ఒక మూవీకి ఆల్రెడీ కమిట్ మెంట్ అయ్యిందట. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడప్పుడే ప్రకటించే అవకాశాలు లేనట్టే.

ఇలా చూసుకుంటే మొత్తం ఆరు సినిమాలను చిరు లాక్ చేసుకున్నట్టు. రామ్ చరణ్ కూడా ఇంత స్పీడ్ గా లేడు. తనవి చూసుకుంటే ఆర్ఆర్ఆర్ ని మినహాయిస్తే కన్ఫర్మ్ చేసింది ఒక్క శంకర్ సినిమా మాత్రమే.ఇంకెవరికి అఫీషియల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ తండ్రి మాత్రం ఇలా వాయువేగంతో దూసుకుపోవడం అభిమానులకు డబుల్ కిక్ ఇస్తోంది. ఆచార్య విడుదల తేదీ విషయంలో సందిగ్దత మాత్రం అలాగే కొనసాగుతోంది. థియేటర్ల పరిస్థితి ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో దసరాకు రిలీజ్ చేయడం క్రమంగా అసాధ్యంగా మారుతోంది. నవంబర్ అంటున్నారు కానీ ఛాన్స్ లేదు. అయితే సంక్రాంతి లేదా వేసవే. వేరే ఆప్షన్ లేదు

Also Read: రిస్క్ అనుకుంటున్నారా? అలవాటు చేస్తున్నారా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి