రిస్క్ అనుకుంటున్నారా? అలవాటు చేస్తున్నారా?

By Balu Chaganti Sep. 16, 2021, 04:30 pm IST
రిస్క్ అనుకుంటున్నారా? అలవాటు చేస్తున్నారా?

ఒకరకంగా దాసరి నారాయణరావు మరణం తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి సరైన పెద్ద దిక్కు లేకుండా పోయింది. ప్రస్తుతానికి ఇండస్ట్రీకి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా అందరూ చిరంజీవిని ఆశ్రయిస్తున్నారు, చిరంజీవి కూడా పెద్ద మనిషి హోదాలో దాదాపు తన వంతుగా అన్ని విషయాలు క్లియర్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ ముందు ఏర్పడిన అతిపెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ల రేట్ల వ్యవహారం అని ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ భావిస్తున్నారు. నిజానికి వకీల్ సాబ్ సినిమా విషయంలో ఈ వివాదం మొదలైంది అనుకుంటున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం సినిమా జీఎస్టీ వసూళ్లు విషయంలో ముందు నుంచే ఈ టికెట్ల వ్యవహారం మీద దృష్టి పెట్టింది అనే విషయాన్ని ఈ మధ్యనే పేర్ని నాని ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు.. సంక్రాంతి పండుగకు విడుదలైన రెండు పెద్ద సినిమాలు వందల కోట్ల కలెక్షన్లు వచ్చాయి అని ప్రకటించుకున్నాయి కానీ జీఎస్టీ వసూళ్లు ఏడాది మొత్తానికి కలిపినా 39 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

Also Read: బిగ్ బాస్ రేటింగ్ భారీగానే ఉంది కానీ

ఎక్కడో అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని ఆపేందుకు సినిమా పెద్దలు సూచనలతో ఒక పోర్టల్ నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేశారని దానికి సంబంధించి ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో చిరంజీవి బృందం భేటీ ఈ విషయంలో ఇపుడు ఆసక్తికర వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. అవేమిటంటే మెగాస్టార్ చిరంజీవి ఇలా ప్రభుత్వాధినేతలను కలిసేప్పుడు గతంలో ఇతర హీరోలను సంప్రదించే వారిలో లేదో తెలియదు, ఎక్కువగా ఆయన వెంట నాగార్జున ఒక్కరే కనిపించేవారు. అయితే ఇప్పుడు చిరంజీవి తమతో పాటు మీటింగుకు హాజరు కావాలని స్టార్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లని కూడా కోరారని అంటున్నారు. అందరూ ఉండి మన ఇండస్ట్రీ సమస్యలు రిప్రజెంట్ చేస్తే బాగుంటుందని 20వ తేదీ అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి మీటింగ్ కు హాజరు కావాలని చిరంజీవి కోరారని తెలుస్తోంది.

మరి వారు వస్తారో లేదో తెలియదు కానీ, ఇలా హీరోలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసి తమకు సానుకూలంగా ఏదైనా నిర్ణయం తీసుకోమని కోరే అవకాశం ఉందని అంటున్నారు. తమ ఇబ్బందులను పరిష్కరించుకోవడమే కాకుండా సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి న్యాయంగా రావాల్సిన అన్ని పన్నులు చెల్లించే విధంగా ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీ నుంచి జరుగుతున్న పన్నుల నష్టం నుంచి కూడా బయట పడినట్లే. ఇక ఈ సమావేశానికి దిల్ రాజు అలాగే సురేష్ బాబులని కూడా ప్రొడ్యూసర్స్ తరఫున రిప్రజెంట్ చేయమని చిరంజీవి కోరినట్లు తెలుస్తోంది. ఈ భేటీ 20వ తేదీన జరగబోతుండగా ఇప్పుడు అగ్రహీరోలు అందరూ హాజరు అవుతున్నారు అనే వార్త మాత్రం అనేక చర్చలకు తావిస్తోంది. చిరంజీవి రిస్క్ తీసుకోవడం ఎందుకు ? అనే ఉద్దేశంతో వాళ్ళను కూడా పిలుస్తున్నారా? లేక ఇండస్ట్రీలో వారు కూడా భాగమే కాబట్టి ఇండస్ట్రీ తరపున ప్రాతినిధ్యం ఇప్పటి నుంచే అలవాటు చేస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

Also Read: ప్రకాష్ రాజ్ ప్లాన్స్ భారీగా ఉన్నాయి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp