iDreamPost

రాముడొక స్త్రీలోలుడు, హంతకుడు అంటూ యాంకర్ ఉమా ఘాటు వ్యాఖ్యలు

అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట రోజున కొంతమంది తమిళులు ట్విట్టర్ లో ‘జై రావణ’ అంటూ ట్రెండ్ చేసి దేశమంతా తమ ముఖాల మీద కాండ్రించి ఉమ్మి వేసేలా చేసుకున్నారు. తాజాగా రాముడి మీద తమ ద్వేషాన్ని ప్రదర్శించి మరోసారి ఆగ్రహానికి గురయ్యారు.

అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట రోజున కొంతమంది తమిళులు ట్విట్టర్ లో ‘జై రావణ’ అంటూ ట్రెండ్ చేసి దేశమంతా తమ ముఖాల మీద కాండ్రించి ఉమ్మి వేసేలా చేసుకున్నారు. తాజాగా రాముడి మీద తమ ద్వేషాన్ని ప్రదర్శించి మరోసారి ఆగ్రహానికి గురయ్యారు.

రాముడొక స్త్రీలోలుడు, హంతకుడు అంటూ యాంకర్ ఉమా ఘాటు వ్యాఖ్యలు

డీఎంకే పార్టీ అంటే హిందూ వ్యతిరేక పార్టీ అన్న ముద్ర పడిపోయింది. సనాతన ధర్మాన్ని ఈ దేశంలో లేకుండా చేయాలని ఎంకే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఆ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశాడు. వివాదం రాజుకోవడంతో ఉదయనిధి తండ్రి ఎంకే స్టాలిన్ క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా స్టాలిన్ కుటుంబానికి దగ్గర సంబంధం ఉన్న ఓ మహిళ రాముడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఆమె మరెవరో కాదు డీఎంకే పార్టీకి చెందిన ‘కళైనర్ సేథిగల్’ అనే టీవీ ఛానల్ యాంకర్ ఉమా ఇళక్య. ఈమె ద్రవిడ కఝకం తమిళ్ కౌన్సిల్ కి డిప్యూటీ సెక్రటరీగా కూడా ఉంది. అంతేకాదు ఎంకే స్టాలిన్ కుటుంబానికి దగ్గర బంధువని సమాచారం. అయితే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు కొన్ని రోజుల ముందు ఈమె ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ రాముడి మీద దూషణలు చేసింది. ఆ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

మనం రామరాజ్యాన్ని ఖచ్చితంగా నాశనం చేయాలని.. దీని నుంచి మనం మన పిల్లల్ని రక్షించుకోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బీజేపీ వారు బ్రాహ్మణ రాజ్యంగా ఉండే రామ రాజ్యాన్ని లేదా హిందూ రాష్ట్రాన్ని తీసుకురావాలని చూస్తున్నారని.. ఈరోజు అందరూ అయోధ్యలో రామ మందిరాన్ని కొనియాడుతున్నారని.. కానీ రాముడు ఒక స్త్రీలోలుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాముడు కల్లు తాగి వేల మంది స్త్రీలతో పడుకున్నాడని.. అలాంటి రాముడ్ని మీ పిల్లలకు రోల్ మోడల్ గా చూపిస్తున్నారా? అంటూ కామెంట్స్ చేసింది. పిరికివాడు కాబట్టి జీవించే ధైర్యం లేక తన మనుషులతో కలిసి సరయు నదిలో మునిగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. ఇతన్ని ఉదాహరణగా చూపించి మీ పిల్లల్ని పెంచుతారా అంటూ విమర్శలు చేసింది.

Anchor's controversial comments on Rama

ఇది అర్థం లేనిదని.. రాముడు తన భార్యను అనుమానించి అడవులకు పంపించాడని.. ఈ విషయంలో రాముడు ఎలాంటి ఉదాహరణ చూపిస్తున్నాడు? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు రాముడొక హంతకుడని.. అలాంటి వ్యక్తి దగ్గరకు ఈ దేశాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకెళ్తుందని విమర్శలు చేసింది. అక్కడ మసీదు ఉంది కాబట్టే అయోధ్య రామ మందిరాన్ని స్థాపిస్తున్నారు అంటూ ఉమా ఇళక్య కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రాణ ప్రతిష్ట రోజున కూడా తమిళులు కొంతమంది ట్విట్టర్ లో ‘జై రావణ’ అంటూ ట్రెండ్ చేశారు. దీంతో రాముడి మీద వీళ్ళకి ఎంత ద్వేషం ఉందో అర్థమైంది. ఇప్పుడు టీవీ యాంకర్ ఉమా చేసిన వ్యాఖ్యలతో రాముడిపై వీరికున్న విద్వేషం ఏ స్థాయిలో ఉందో మరోసారి రుజువైంది. రాముడి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈమె మీద కఠిన చర్యలు తీసుకోవాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. మరి రాముడిపై దారుణమైన కామెంట్స్ చేసిన టీవీ యాంకర్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి