iDreamPost

దేశమంతా రామనామ జపం.. తమిళనాడులో మాత్రం రావణ జపం.. ఎందుకు?

  • Published Jan 22, 2024 | 10:51 AMUpdated Jan 22, 2024 | 11:23 AM

Ayodhya Ram Mandir-#TamilPrideRavana: దేశవ్యాప్తంగా రామ నామ జపం చేస్తుంటే.. తమిళనాడులో మాత్రం.. రావణ జపం చేస్తూ.. జై రావణ్‌ అంటూ ట్వీట్లు చేయడమే కాక హ్యాష్‌ ట్యాగ్‌లను ట్రెండ్‌ చేస్తున్నారు. కారణమిదే..

Ayodhya Ram Mandir-#TamilPrideRavana: దేశవ్యాప్తంగా రామ నామ జపం చేస్తుంటే.. తమిళనాడులో మాత్రం.. రావణ జపం చేస్తూ.. జై రావణ్‌ అంటూ ట్వీట్లు చేయడమే కాక హ్యాష్‌ ట్యాగ్‌లను ట్రెండ్‌ చేస్తున్నారు. కారణమిదే..

  • Published Jan 22, 2024 | 10:51 AMUpdated Jan 22, 2024 | 11:23 AM
దేశమంతా రామనామ జపం.. తమిళనాడులో మాత్రం రావణ జపం.. ఎందుకు?

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశమంతా రామ నామ జపమే వినిపిస్తోంది. దేశంలోని అందరి చూపు అయోధ్య వైపే ఉంది. మందిర ప్రారంభోతవ్స నేపథ్యంలో దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం కోసం దేశ విదేశాలకు చెందిన ప్రముఖులంతా ప్రస్తుతం అయోధ్యబాట పట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటల నుండి 1 గంట వరకు గల శుభ ముహూర్తంలో ప్రధాని చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు పండితులు. అయితే దేశమంతా రామనామ జపంతో మార్మోగిపోతుంటే.. తమిళనాడులో మాత్రం రావణుడికి జై అంటున్నారు. ప్రస్తుతం ట్విట్టర్లో ఇది ట్రెండవుతుంది.

దేశ ప్రజలే కాక విదేశాల్లో ఉన్న వారు సైతం నేడు రామ నామ స్మరణ చేస్తుంటే.. ఇక్కడే భారతదేశంలోని ఓ రాష్ట్ర ప్రజలు రావణాసురుడిని కీర్తిస్తున్నారు. వారే తమిళులు. ముందు నుంచి కూడా వారిది ప్రత్యేక పంథా. ఉత్తరాది రాష్ట్రాల వారంటే తమిళులకు కొంచెం కోపం కూడా. అదంతా పక్కన పెడితే.. తమిళనాడులో కూడా రామయానికి సంబంధించిన ఎన్నో ఘట్టాలు చోటు చేసుకున్నాయి. రాముడి చరిత్రకు అక్కడ అనేక ఆనవాళ్లు ఉన్నాయి. అయినా సరే వారు రావణుడిని కొలవడానికి కారణం ఏంటి అంటే..

దేశమంతా రామ నామ జపం చేస్తుంటే.. తమిళనాడులో మాత్రం రావణుడి జపం చేస్తున్నారు. ట్విట్టర్ లో కూడా జై రావణ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఇదొక్కసారే కాదు. గతంలో అయోధ్య రామ మందిర భూమి పూజ సందర్భంలో కూడా జై రావణ అంటూ ట్రెండ్ చేశారు. అసలు ఈ తమిళులకి రావణుడు అంటే ఎందుకంత ఇష్టం? రాముడంటే ఎందుకు ఇష్టం ఉండదు? అసలు రావణుడికి, తమిళనాడుకి ఏమైనా సంబంధం ఉందా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

తమిళులకు మొదటి నుంచి ఉత్తరాది రాష్ట్రాల వారు అంటే ఇష్టం ఉండదు. ద్రవిడులు, ఆర్యులు అనే రెండు సమూహాలు తూర్పు ఆఫ్రికా నుంచి వచ్చి భారతదేశంలో స్థిరపడ్డారని చెబుతారు. ద్రవిడులు భారత ఉపఖండానికి చెందివారు. తమిళం మాట్లాడేవారు. ఇక ఆర్యులు ఉత్తర భారతదేశానికి చెందిన వారు.. వీళ్ళు సంస్కృతం మాట్లాడతారు అనే వాదన ఉంది. రాముడు అంటే కేవలం ఉత్తరాది దేవుడు అనే ఒక బలమైన భావనను కొంతమంది రాజకీయ నాయకులు తమిళనాడు ప్రజల మెదడుల్లోకి చొప్పించారు. ద్రవిడులు. ఈ ద్రవిడులు రాముడ్ని ఆర్యుడిగా భావిస్తారు. రాముడు ఈ దేశం వాడు కాదని.. ఎక్కడి నుంచో వచ్చిన ఆర్యులు ఇక్కడ రాముడ్ని తమ మీద రుద్దారని భావిస్తారు.

ముందు నుంచి కూడా వారిది ప్రత్యేక పంథా. ఉత్తరాది రాష్ట్రాల వారంటే తమిళులకు కొంచెం కోపం కూడా. రాముడి ప్రవర్తన కంటే రావణుడి ప్రవర్తన చాలా ఉత్తమం అని వారు నమ్ముతారు. రావణుడు పెర్ఫెక్ట్ కాకపోయినా.. రాజుగా.. తమిళులని పరిపాలించిన తెలివైన రాజుగా అతన్ని గౌరవిస్తారు. హిందువులు, బ్రాహ్మణ సమూహాలు క్రియేట్ చేసిన శాస్త్రాలకు బానిసగా ఉన్న వ్యక్తికి ఆలయాన్ని కట్టడాన్ని రావణుడు ప్రతిఘటించాడని తమిళులు నమ్ముతారు. మరొక కారణం.. తమిళులు రావణుడి సోదరి సెంటిమెంట్ ని ఇష్టపడతారు. సీతను అపహరించిన తర్వాత లంకలో ఆమె పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడని.. అందుకే అతనంటే ఇష్టం అని అంటారు. చచ్చే వరకూ పోరాటం ఆపని యోధుడు కాబట్టి రావణుడు అంటే ఇష్టమని నమ్ముతారు. సీత మీద చేయి వేయలేదు కాబట్టి రావణుడు గొప్పవాడు అంటున్నారు.. అసలు పరాయి వ్యక్తి భార్యను ఎత్తుకెళ్ళడాన్ని ఎలా సమర్థిస్తారు.. ఈ విషయంలో రావణుడు మంచివాడు ఎలా అవుతాడు అన్న ప్రశ్నలు వస్తాయి. కానీ వీటికి సమాధానం ఉండదు.      

తమిళనాడులో కూడా రామాయణానికి సంబంధించిన ఎన్నో ఘట్టాలు చోటు చేసుకున్నాయి. రాముడి చరిత్రకు అక్కడ అనేక ఆనవాళ్లు ఉన్నాయి. అయినా సరే వారు రావణుడిని కొలవడానికి కారణం ఏంటి అంటే.. రావణుడు వారి ప్రాంతాన్ని పాలించాడని కొందరు తమిళులు నమ్ముతారు. శ్రీలంకతో పాటు.. దానికి సమీపంగా ఉన్న తమిళనాడు కూడా రావణుడి రాజ్యంలో భాగమే అని భావిస్తారు. అదిగో అలాంటి వారే ఈ చర్యలకు పూనుకుంటున్నారు. ఇది తమిళ దేశం.. రావణుడి దేశం.. మీ రామ పురణాలను మా దగ్గర చెప్పకండి. రాముడిని ఇక్కడ ఆమోదించం.. ఇది రావణుడి రాజ్యం.. తమిళులు హిందువులు కాదు.. మాకు రావణుడే దేవుడు అంటూ ట్వీట్‌ చేస్తూ.. తమిళుల గౌరవం రావణుడు, జై రావణ్‌ ఫ్రం తమిళనాడు అనే హ్యాష్‌ ట్యాగ్‌లను ట్రెండ్‌ చేస్తున్నారు.

అయితే కొందరు కావాలనే ఉద్రికత్తలు రెచ్చగొట్టడానికి చేస్తున్న చర్యలుగా చెబుతున్నారు. వారికి దేవుడన్నా, గుళ్లు అన్నా ఇష్టం ఉండదు. అందుకే నేరుగా అయోధ్య మందిరం గురించి విమర్శలు చేసే ధైర్యం లేక రావణాసురుడికి జై కొడుతున్నారు అని కామెం‍ట్స్‌ చేస్తున్నారు నెటిజనులు. వాస్తవంగా చూసుకుంటే ఇదే నిజం కూడా. ఎందుకంటే తమిళనాడులోని రామేశ్వరం, ధనుష్కోడి వంటి ప్రాంతాలకు రామాయణంతో సంబంధం ఉంది. అంతేకాక రామ మందిర నిర్మాణం కోసం తమిళ ప్రజలు ఏకంగా 80 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే అక్కడ రామ భక్తులు ఎక్కువనే విషయం అర్థం అవుతుంది. కానీ కొందరు అక్కసుతో ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారని అర్ధమవుతోంది.

రావణుడు రాముడు కంటే గొప్పవాడు అని ప్రచారం చేస్తుంటారు. జీవితంలో ఒక్కసారి కూడా రామాయణం చదవని వారు చేసే ప్రచారం ఇది. రాజకీయ ప్రయోజనాల కోసం, ఇతర ప్రయోజనాల కోసం.. హిందువుల మీద ద్వేషంతో ఇలా చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. ఒక్కసారి కూడా రామాయణం చదవని వారు కూడా రావణుడు తోపు, తురుము అని పొగిడేస్తూ మేధావుల్లా ఫీలైపోతుంటారు. వాల్మీకి రామాయణం గానీ కంబర్ రచించిన తమిళ రామాయణం గానీ చదవరు. కనీసం రామాయణం చదివిన స్కాలర్స్ చెప్పేది కూడా వినరు. ఈ మేధావులను పెంచి పోషించడానికి ద్రవిడియన్ పార్టీలు రాజకీయాన్ని సాహిత్యంతో మిక్స్ చేస్తున్నాయన్న వాదన కూడా ఉంది. అందుకే సనాతన ధర్మాన్ని దేశంలో లేకుండా చేయాలన్న కఠినమైన కామెంట్స్ ఉదయనిధి స్టాలిన్ లాంటి వారి నోటి నుంచి వస్తున్నాయి. 

రావణుడిని ఇష్టపడేవారు ఎక్కువగా బ్రాహ్మణ వ్యతిరేకులే. వీరికి బ్రాహ్మణులు అంటే ఇష్టం ఉండదు. బ్రాహ్మణులు పూజించే దేవుళ్ళు అంటే ఇష్టం ఉండదు. అందుకే అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ట చేస్తుంటే జై రావణ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. అయితే వీరికి తెలియంది ఏంటంటే.. రావణుడు కూడా ఒక బ్రాహ్మణుడే అని. రావణుడు అసలు తమిళుడే కాదు. అసలు రావణుడికి తమిళమే రాదు. ఇంకా తమిళ భాష తెలిసిన వ్యక్తి హనుమంతుడు. ఆయన కర్ణాటక, తమిళనాడు అడవుల సమీపంలో జన్మించారు అని అంటారు. ఆయన రామ భక్తుడు. అయినా కానీ ఈ మేధావులు.. హనుమంతుడిని గానీ, హనుమంతుడు పూజించే రాముడ్ని గానీ దైవంగా భావించరు. కారణం స్వప్రయోజనాలు అనేది ఒక వాదన. మరి దేశమంతా రాముడి జపం చేస్తుంటే.. తమిళంలో కొంతమంది మాత్రం రావణ జపం చేస్తుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి