iDreamPost

ఎండల వార్త చదువుతూ.. వడదెబ్బ తగిలి పడిపోయిన నటి, యాంకర్!

TV Anchor Lopamudra Sinha Fainted: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి నెల నుంచే ఎండలు ప్రారంభమై.. ఏప్రిల్ నాటికి భానుడి ప్రతాపం తీవ్ర స్థాయికి చేరుకుంది.

TV Anchor Lopamudra Sinha Fainted: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి నెల నుంచే ఎండలు ప్రారంభమై.. ఏప్రిల్ నాటికి భానుడి ప్రతాపం తీవ్ర స్థాయికి చేరుకుంది.

ఎండల వార్త చదువుతూ.. వడదెబ్బ తగిలి పడిపోయిన నటి, యాంకర్!

వేసవి కాలం వచ్చింది.. దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి భానుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. వేసవి తాపం తట్టుకోలేక ప్రజలు శీతలపానియాల వెంట పరుగులు తీస్తున్నారు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం బయటకు రావాలంటే భయంతో వణికిపోతున్నారు. వేసవి ప్రభావం ఎంతగా ఉందో తెలియజేయడానికి ఓ సంఘటన జరిగింది. బయట తిరిగేవారికే కాదు.. ఏసీ గదుల్లో ఉన్నవారు కూడా అధిక ఉష్ణోగ్రత వల్ల ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటారో ఈ ఘటనతో తెలిసిపోతుంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ దూరదర్శన్ ఛానల్ లో జరిగింది. అసలే ఏం జరిగింది అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

పశ్చిమ బెంగాల్ దూర దర్శన్ ఛానల్ లో వాతావరణ వార్తలు చదువుతున్న సమయంలో యాంకర్ లోపాముద్ర సిన్హా హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోయింది. ఈ ఘటన కోల్‌కొతా లోని దూరదర్శన్ స్టూడియోలో చోటుచేసుకుంది. వాతావరణ వివరాలు తెలియజేస్తూ అధిక ఎండ వేడి గురించి వార్తలు చదువుతున్న లోపాముద్ర అక్మాత్తుగా ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది ఆమె ముఖంపై నీళ్లు చల్లగా కొద్దిసేపటికి తేరుకున్నారు.ఇటీవల కోల్‌కొతాలో ఎండలు బాగా ముదిరిపోయాయి.  ఈ క్రమంలోనే యాంకర్ లోపాముద్రకు వడదెబ్బ తాకడంతో ఆమె వార్తలు చదువుతూ స్పృహకోల్పోయినట్లు తెలుస్తుంది.

ఈ విషయం గురించి లోపా ముద్ర సోషల్ మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఆ సమయంలో తన బీపీ ఒక్కసారిగా పడిపోయిందని.. మొదట కళ్లు తిరిగి అంతా మసకగా కనిపించిందని.. క్రమంగా కళ్ల ముందు చీకటి ఆవరించిందని.. చేతులు, మాట తడబడిపోయాయని తెలిపింది. ఎదురుగా టెలీప్రాంప్టర్ కూడా సరిగా కనిపించలేదని.. అక్రమంలోనే తాను వార్తలు చదువుతూ స్పృహకోల్పోయానని తెలిపింది లోపాముద్ర. ఓ గ్లాస్ నిమ్మరసం తాగిన తర్వాత అంతా కుదుట పడిందని తన ఫేస్ బుక్ ద్వారా తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ కి పెరిగిపోయిందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా వడగాలులు వీస్తున్నాయని తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి