iDreamPost

నిర్మాతపై బిగ్‌బాస్‌ బ్యూటీ కామెంట్స్‌! ఒక్కరాత్రికి ఒప్పుకోమంటూ

  • Published Mar 01, 2024 | 4:28 PMUpdated Mar 01, 2024 | 5:25 PM

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ఆవకాశాలు రావలంటే కాంప్రమైజ్ అవ్వలని తనకు ఎదురైన చేదు అనుభవన్ని తాజాగా కుండ బద్దలు కొడుతూ చెప్పుకొచ్చింది ఓ నటి. ఇంతకి ఆమె ఎవరంటే..

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ఆవకాశాలు రావలంటే కాంప్రమైజ్ అవ్వలని తనకు ఎదురైన చేదు అనుభవన్ని తాజాగా కుండ బద్దలు కొడుతూ చెప్పుకొచ్చింది ఓ నటి. ఇంతకి ఆమె ఎవరంటే..

  • Published Mar 01, 2024 | 4:28 PMUpdated Mar 01, 2024 | 5:25 PM
నిర్మాతపై బిగ్‌బాస్‌ బ్యూటీ  కామెంట్స్‌! ఒక్కరాత్రికి ఒప్పుకోమంటూ

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు తారలుగా కొనసాగాలంటే అవకాశాలు జోరుగా ఉండాలి. మరి ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం సినీ తారలు పడే కష్టాలు మాములుగా ఉండవు. కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా.. ఆఫర్స్ కోసం గ్లామరెస్ పాత్రల్లో నటిస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో అయితే ఏకంగా ఈ ఆవకాశాల కోసం కమిట్మెంట్ లను కూడా అడుగుతారు. ఈ క్రమంలోనే అటూ వెండితెర నుంచి బుల్లితెర వరకు ఎంతో మంది తారలు ఈ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడుతుంటారు. ఇండస్ట్రీలో హద్దులను చెరిపేస్తేనే అవకాశాలను అందుకుంటారని.. అప్పుడే స్టార్ స్టేటస్ ను దక్కించుకుంటారని చాలా మంది నిర్మాతలు, డైరెక్టర్లు అనేక ఇబ్బందులకు గురి చేస్తారు. అయితే తాజాగా ఈ కోవలో తాను కూడా బాధితురాలినే అని ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తు చేసుకుందో నటి. ఇంతకీ ఆమె ఎవరంటే..

హిందీ బిగ్ బాస్ సీజన్ 17లో అలరించిన బుల్లితెర జంట అంకిత లోఖండే, విక్కీజైన్ ల గురించి అందరికీ తెలిసిందే. ఈ రియాలిటీ షోలో పాల్గొన్న జంట సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక షోలో వీరిద్దరి గొడవలు, కొట్లాటలు, ప్రేమలు, ఈర్ష్య వంటి చిన్న చిన్న మూమెంట్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇవన్నీ ప్రేక్షకులకు ఎంతగానో వినోదాన్ని పంచాయి. అయితే ఈ షో వల్ల ఎక్కువగా అంకితనే ట్రోల్స్ కి గురవుతూ.. నెగిటివిటీ మూటగట్టుకుందని చెప్పవచ్చు. అయితే తాజాగా ఈ బ్యూటీ ఓ షోకి హాజరైంది. అక్కడ ఆమెకు క్యాస్టింగ్ కౌచ్ ఎప్పుడైనా ఫేస్ చేశారా అంటూ ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇందుకు ఆమె అవునని కుండ బద్దలు కొడుతూ.. ఆనాటి ఇబ్బందికర పరిస్థితులను చెప్పుకొచ్చింది.

‘నేను దక్షిణాది చిత్రపరిశ్రమల ఆడిషన్ కు వెళ్లాను. ఆ తర్వాత వాళ్లు కాల్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారు, వచ్చి సంతకం చేయండని చెప్పారు. దీంతో నేను సంతోషంతో ఈ విషయం మా అమ్మకు చెప్పి సంబరపడ్డాను. అయితే, నాకు అక్కడ ఓ సందేహం వచ్చింది. నన్ను ఇంత తేలికగా ఎలా సెలెక్ట్ చేశారబ్బా అనే అనుమానం కూడా వచ్చింది. కాగా, నేను సంతకం చేయడానికి వెళ్లినప్పుడు నాతో వచ్చిన వ్యక్తిని బయటే ఉండమని చెప్పి.. నన్ను మాత్రం లోపలికి పిలిచి కాంప్రమైజ్ కావాలని అడిగారు. నేను ఆ మాట విని షాకయ్యాను. 

అప్పుడు నా వయసు 19 ఏళ్లు. నన్ను హీరోయిన్ చేస్తారేమోనని కాంప్రమైజ్ అంటే ఏంటని అడిగాను. అందుకు వాళ్లు నిర్మాతతో ఒక రాత్రి ఉండాలని చెప్పారు. అప్పుడు నేను.. మీ నిర్మాతకు టాలెంట్ తో పని లేదా, అమ్మాయి తన పక్కన ఉంటే చాలనుకుంటున్నాడు. అయినా నేను అలాంటి దాన్ని కాదని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను’ అని చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ సౌత్ లో ఏ ఇండస్ట్రీలో ఇలాంటి అనుభవం ఫేస్ చేసిందో వివరంగా చెప్పలేదు. మరి, నటి అంకిత లోఖండే ఎదుర్కొన్న సంఘటనల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి