iDreamPost

TTDలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

స్వామి కార్యం.. స్వకార్యం నేరవేరాలనుకున్న వారికి శుభవార్త. తిరుమల తిరుపతి దేవ స్థానంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పూర్తి వివరాల కోసం..

స్వామి కార్యం.. స్వకార్యం నేరవేరాలనుకున్న వారికి శుభవార్త. తిరుమల తిరుపతి దేవ స్థానంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పూర్తి వివరాల కోసం..

TTDలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఆధ్యాత్మిక ప్రాంతమైన తిరుపతిలోని తిరుమలను రోజు వేలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా భక్తులు తిరుమలలో కొలువై ఉన్న వెంకటేశ్వరుడ్ని దర్శించుకుంటూ ఉంటారు. ఆపద మొక్కుల వాడిగా, కలియుగ దైవంగా కొలవబడుతున్న శ్రీవారిని కన్నులారా వీక్షించేందుకు తరలి వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే దేవుడికి మొక్కులు చెల్లించి, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. శ్రీవారి నామ స్మరణతో మాడ వీధులన్నీ మారుమోగిపోతుంటాయి. అక్కడ వేలాది మంది భక్తులు.. ఆయన సేవలో తరించి పోతుంటారు. ఆయన సేవలో తరించాలనుకునే వారికి ఓ అద్భుత అవకాశం వచ్చింది.

తిరుమల తిరుపతి దేవ స్థానం (టీటీడీ) నుండి మరో జాబ్ నోటీఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. బీఈ, బీటెక్ (ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులకు ఈ పోస్టులకు అర్హులు. డిసెంబర్ 19 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఇక ఉద్యోగ వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం 4 ఏఈఈ పోస్టులకు అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది. అయితే హిందూ మతస్థుల నుండి మాత్రమే దరఖాస్తులను స్వీకరించనుంది. వయో పరిమితి కూడా 42 ఏళ్లను మించకూడదు. ఇక ఎంపిక విధానం, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • TTD ఏఈఈ  (ఎలక్ట్రికల్) పోస్టుల సంఖ్య-4
  • వయోపరిమితి : 42 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, పీహెచ్ అభ్యర్థులకు పదేళ్ల వయో సడలింపు
  • ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువ పత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు ఉంటాయి.
  • వేతనం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 ఉండనుంది.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్‌ 19, 2023.
  • పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి