iDreamPost

RTC కీలక నిర్ణయం.. నగర ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఏంటంటే

  • Published Apr 13, 2024 | 9:55 AMUpdated Apr 13, 2024 | 9:55 AM

ఉచిత ప్రయాణ వల్ల బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. దాంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..

ఉచిత ప్రయాణ వల్ల బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. దాంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..

  • Published Apr 13, 2024 | 9:55 AMUpdated Apr 13, 2024 | 9:55 AM
RTC కీలక నిర్ణయం.. నగర ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఏంటంటే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దాంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా మహిళా ప్రయాణికులు పెరిగారు. బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. అస్సలు ఖాళీ ఉండటం లేదు. సిటీ బస్సుల్లో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కాలు పెట్టేందుకు కూడా జాగా దొరకట్లేదు. పైగా పురుషులకే కేటాయించిన సీట్లలోనూ మహిళలే కూర్చొని ప్రయాణాలు సాగిస్తున్నారు. దాంతో మగాళ్లు బస్సు ఎక్కాలంటే భయపడుతున్నారు. చేసేదేం లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి జేబులకు చిల్లు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆర్టీసీ నగర ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..

టీఎస్‌ఆర్టీసీ నగర ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉచిత ప్రయాణం వల్ల బస్సుల్లో పెరిగిన రద్దీని తగ్గించేందుకు గాను.. గ్రేటర్‌ పరధిలో సిటీ బస్సుల సంఖ్య పెంచేందుకు కసరత్తు మెుదలుపెట్టింది. ప్రస్తుతం గ్రేటర్‌లో నిత్యం 2,850 బస్సులు నడస్తుండగా.. అవి ప్రధాన రూట్లకే పరిమితమయ్యాయి. దీంతో జిల్లాల్లో తిరుగుతున్న డీలక్స్‌ బస్సులను హైదరాబాద్ కు తరలించి వాటిని సిటీ బస్సులుగా మార్చే పనులు వేగంగా సాగుతున్నాయి.

RTC

డీలక్స్‌ బాడీని తీసేసి వాటిని మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల మాదిరిగా తయారుచేస్తున్నారు. అందుకు ఒక్కో బస్సుకు రూ.6 లక్షల చొప్పున ఖర్చుచేస్తున్నారు. ప్రస్తుతం కొత్త బస్సులు కొనాలంటే రూ.30 లక్షలకు పైగా ఖర్చువుతుండగా.. దాన్ని తగ్గించుకునేందుకు ఆర్టీసీ డీలక్స్ బస్సులనే మెట్రోలుగా మారుస్తుంది.

అంతేకాక రద్దీని తట్టుకోవడానికి నగర వ్యాప్తంగా అద్దె ప్రాతిపదికన ఎలక్ట్రిక్‌ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. మెట్రో లేని మార్గాల్లో ఇప్పటికే ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు తిరుగుతుండగా.. ఇటీవల మెట్రో ఎక్స్‌ప్రెస్‌ స్థానంలో 25 ఎలక్ట్రిక్‌ నాన్‌ ఏసీ బస్సులు రోడ్ల మీదకు వచ్చేశాయి. వచ్చే సంవత్సరానికి గాను 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు గ్రేటర్‌జోన్‌కు సమకూరుతున్నాయని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.

RTC

ప్రస్తుతం బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరగటం, సరిపడా బస్సులు లేకపోవటంతో నగరవాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో డీలక్స్ బస్సులు సీటీ ఎక్స్‌ప్రెస్ బస్సులుగా మారి అందుబాటులో వస్తే మగవారికి కూడా సీట్లు దొరుకుతాయని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. దాంతో ప్రయాణికుల కష్టాలు తొలగిపోతాయని భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి