iDreamPost

ఆ మార్గాల్లో ప్రయాణించే వారికి TSRTC బంపరాఫర్.. భారీగా డిస్కౌంట్‌

  • Published Apr 25, 2024 | 12:37 PMUpdated Apr 25, 2024 | 12:37 PM

ప్రయాణికులకు టీఎస్‌ఆర్‌టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆ రూట్లలో ప్రయాణించే వారికి భారీగా డిస్కౌంట్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు.

ప్రయాణికులకు టీఎస్‌ఆర్‌టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆ రూట్లలో ప్రయాణించే వారికి భారీగా డిస్కౌంట్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు.

  • Published Apr 25, 2024 | 12:37 PMUpdated Apr 25, 2024 | 12:37 PM
ఆ మార్గాల్లో ప్రయాణించే వారికి TSRTC బంపరాఫర్.. భారీగా డిస్కౌంట్‌

ప్రయాణికులను ఆకర్షించి.. ఆర్టీసీ ఆదాయం పెంచడం కోసం ఆ సంస్థ ఎండీ సజ్జనార్‌ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఆర్టీసీ ఎండీగా వచ్చిన నాటి నుంచి రకరకాల స్కీములు, పథకాలు ప్రారంభించి.. ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో బస్సుల్లో ప్రయాణాలు చేసేలా కృషి చేస్తున్నారు. ఇప్పుడు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అమల్లోకి రావడంతో.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరగడమే కాక ఆదాయం కూడా భారీగానే పెరిగింది. ఉచిత ప్రయాణం వల్ల మగాళ్లు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదలా ఉంచితే తాజాగా ఆర్టీసీ బంపరాఫర్‌ ప్రకటించింది. ఆ రూట్లలో ప్రయాణం చేసే ప్రయాణికులకు భారీ డిస్కౌంట్‌ కల్పించింది. ఆ వివరాలు..

హైదరాబాద్-బెంగళూరు మార్గంలో ప్రయాణాలు చేసే వారికి టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆ మార్గంలో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు భారీ డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. హైదరాబాద్-బెంగళూరు మార్గంలో ముందుగా రిజర్వ్‌ చేసుకునే ప్రయాణికులకు.. రిటర్న్‌ జర్నీపై 10 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు వెల్లడించారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే అన్ని హైఎండ్ సర్వీసుల్లోనూ ఈ రాయితీ వర్తిస్తుందని సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ రూట్లలో వెళ్లే ప్రయాణికులు 10 శాతం రాయితీని వినియోగించుకుని, టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

అలానే క్రికెట్ అభిమానలకు కూడా టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నేడు అనగా గురువారం నాడు సన్ రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. దీన్ని చూసేందుకు వేల మంది అభిమానులు.. ఉప్పల్‌ స్టేడియానికి వస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఉప్పల్ స్టేడియానికి చేరుకోవటానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది టీఎస్‌ఆర్టీసీ.

‘‘మీకోసమే హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి క్రికెట్ స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులను నడపుతున్నాం. ఆర్టీసీ బస్సుల్లో వెళ్తే ట్రాఫిక్ తిప్పలు ఉండవు. పైగా సొంత వాహనాల్లో వెళ్తే పార్కింగ్ ఇబ్బందులుంటాయి. కావున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి. క్షేమంగా స్టేడియానికి చేరుకుని మ్యాచ్‌ చూస్తూ ఎంజాయ్‌ చేయండి’’ అని సజ్జనార్ ట్వీట్ చేశారు.

ఇక ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ మెట్రో కూడా ట్రైన్ తన పని గంటల్ని పొడిగించిన సంగతి తెలిసిందే.. మ్యాచ్ జరిగే రూట్‌లో అర్ధరాత్రి వరకు సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పింది. క్రికెట్ ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని హైదరాబాద్ మెట్రో ప్రకటన రిలీజ్ చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి