iDreamPost

‘తెలంగాణ టెట్’ దరఖాస్తుల గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే?

Extension of TS TET Application Date: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనదైన మార్క్ చాటుకుంటున్నారు. నిరుద్యోగులకు వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతున్నారు.

Extension of TS TET Application Date: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనదైన మార్క్ చాటుకుంటున్నారు. నిరుద్యోగులకు వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతున్నారు.

‘తెలంగాణ టెట్’ దరఖాస్తుల గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల అమలు పై దృష్టి సారిస్తూనే ఇతర విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తూ అక్రమార్కులపై కొరడా ఝులిపిస్తున్నారు. మరోవైపు రైతులు, మహిళా సంక్షేమం, విద్యా వ్యవస్థ, నిరుద్యోగ సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. తాజాగా టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష టెట్ దరఖాస్తు గడువు తేదీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. వివరాల్లోకి వెళితే..

ఇటీవల టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ‘తెలంగాణ టెట్’ దరఖాస్తుల గడువు గురువారం 10 తో ముగియనుంది. చాలా మంది అర్హులు దరఖాస్తు చేయలేకపోవడంతో గడువు తేదీ పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గడువు తేదీ పెంపు విషయంలో ఇప్టపి వరకు తర్జన భర్జన కొనసాగింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. టెట్ దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించింది. దాంతో పాటు ఈ నెల 11 నుంచి 20 వరకు అప్లికేషన్లను ఎడిట్ చేసుకునే అవకాశం కూడా కల్పించింద. దీంతో అప్లై పరీక్ష కోసం దరఖాస్తులు చేయని అభ్యర్థులు గడువు పొడిగింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. ఇదిలా ఉంటే.. హాల్ టికెట్ల జారీ తేదీ కూడా మార్చనుంది విద్యాశాఖ. ఈ తేదీ ఏప్రిల్ 15 ఉండగా దాన్ని వాయిదే వేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి