iDreamPost

తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో 470 కి 468 మార్కులు! ఇది ఆల్ టైమ్ రికార్డు!

  • Published Apr 24, 2024 | 1:11 PMUpdated Apr 24, 2024 | 1:19 PM

TS Inter 1st Year Results 2024: తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో ఓ విద్యార్థిని 470 మార్కులకు గాను 468 సాధించి స్టేట్‌ టాపర్‌గా నిలిచింది. ఆ వివరాలు..

TS Inter 1st Year Results 2024: తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో ఓ విద్యార్థిని 470 మార్కులకు గాను 468 సాధించి స్టేట్‌ టాపర్‌గా నిలిచింది. ఆ వివరాలు..

  • Published Apr 24, 2024 | 1:11 PMUpdated Apr 24, 2024 | 1:19 PM
తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో 470 కి 468 మార్కులు! ఇది ఆల్ టైమ్ రికార్డు!

తెలంగాణ ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు నేడు అనగా బుధవారం ఉదయం 11 గంటలకు విడదలయ్యాయి. ఫలితాల్లో అ‍మ్మాయిలదే హవా కొనసాగగా.. స్టేట్‌ టాపర్‌గా కూడా విద్యార్థినియే రావడం విశేషం. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో కామారెడ్డి జిల్లా అంతంపల్లికి చెందిన చర్విత స్టేట్‌ టాపర్‌గా నిలిచింది. ఈ విద్యార్థిని ఇంటర్‌ మొదటి ఏడాదిలో 470 మార్కులకు గాను ఏకంగా 468 మార్కులు సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇది ఆల్‌ టైమ్‌ రికార్డు అంటున్నారు. ఎంపీసీ గ్రూప్‌ తీసుకున్న చర్విత.. పరీక్షల్లో 468 మార్కులు సాధించింది. ఇంగ్లీష్‌- 99, సంస్కృతం- 99, మ్యాథ్స్‌ 1ఏ- 75, మ్యాథ్స్‌ 1బీ- 75, ఫిజిక్స్‌- 60, కెమిస్ట్రీ- 60 మార్కులు సాధించింది. చర్వితపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక తాజాగా విడుదలైన ఏపీ పదో తరగతి ఫలితాల్లో మనస్వి అనే విద్యార్థినిన ఏకంగా 600 మార్కులకు గాను ఏకంగా 599 సాధించి ఆల్‌ టైం రికార్డ్‌ క్రియేట్‌ చేసిన సంగతి తెలిసిందే. సెకండ్‌ లాంగ్వేజ్‌లో మాత్రమే ఒక్క మార్కు తగ్గింది. ఇక తాజాగా చర్వితకు కూడా కేవంల్‌ లాంగ్వేజ్‌లల్లో మాత్రమే 1,1 చొప్పున రెండు మార్కులు తగ్గాయి. మిగతా అన్ని సబ్జెక్ట్స్‌లో అవుటాఫ్‌ మార్కులు సాధించి.. సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఇక నేడు విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో.. ఫస్టియర్‌లో 2,87,261 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత 60.01 శాతంగా నమోదయ్యింది. ఇక సెకండియర్‌లో 3,22,432 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత శాతం 64.19శాతంగా పేర్కొన్నారు. అలానే ఇంటర్‌ ఒకేషనల్‌ మొదటి ఏడాదికి సంబంధించి 24,432 మంది పరీక్షలు రాయగా.. వారిలో 50.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండ్‌ ఇయర్‌కు సంబంధించి ఒకేషనల్‌లో 42,723 మంది పరీక్షలు రాస్తే 27,287 మంది పాస్‌ అయ్యారు. ఇక ప్రైవేట్‌గా 3,884 పరీక్షలు రాయగా.. వారిలో 1,549 మంది ఉత్తీర్ణత సాధించారు.

ఇక ఎప్పటి లానే ఈ సారి కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికల హవానే కొనసాగిందే. వారే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత శాతంలో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఇక సాయంత్రం 5 గంటల నుండి మెమోలు అందుబాటులో ఉంచనున్నారు. రేపటి నుండి అనగా ఏప్రిల్‌ 25 నుంచి మే నెల 2 వరకు రీ వెరిఫికేషన్, రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వచ్చే నెల అనగా మే 24 నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి